News September 24, 2024

దమ్ముంటే వారిపై చర్యలు తీసుకోండి: కేటీఆర్

image

TG: హైడ్రా పేరుతో పేదల బతుకులను ప్రభుత్వం రోడ్డుపై వేస్తుందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే నిర్మాణ అనుమతులు ఇచ్చినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో అక్రమంగా అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్సే అని ఆరోపించారు. పేదల ఇళ్లు కూలిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

News September 24, 2024

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ లక్ష్మికి ఉద్వాసన

image

AP: రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గజ్జల వెంకట లక్ష్మికి ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఆమెను వెంటనే బాధ్యతల నుంచి తప్పిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఆమెకు నోటీసులు జారీ చేశారు. కాగా వెంకట లక్ష్మిని వైసీపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.

News September 24, 2024

కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

image

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లు 99% కొవ్వు రహితం, తక్కువ మొత్తంలో షుగర్ కలిగి ఉంటాయి. జీవక్రియలను పెంచడంతో పాటు మధుమేహాన్ని నివారించడంలో సహాయపడతాయి. బరువు తగ్గేందుకు దోహదపడుతాయి. pHను బ్యాలెన్స్ చేస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జీర్ణక్రియలో సహాయపడుతాయి.

News September 24, 2024

బేడీలతో ఉన్న నిందితుడు తుపాకీ ఎలా కాల్చాడు?: ‘మహా’ విపక్షాలు

image

బ‌ద్లాపూర్ లైంగిక దాడి కేసులో నిందితుడి ఎన్‌కౌంట‌ర్ ఘ‌ట‌న‌పై మ‌హారాష్ట్ర విప‌క్షాలు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నాయి. BJP నేత‌కు చెందిన స్కూల్‌లో ఈ లైంగిక దాడి జ‌ర‌గ‌డంతో ఘటనను తొక్కిపెట్టే ప్రయత్నాలు జరిగాయంటున్నాయి. చేతుల‌కు బేడీల‌తో ఉన్న నిందితుడు తుపాకీ ఎలా కాల్చ‌గ‌లిగాడ‌ని EX హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్ర‌శ్నించారు. ఇది చ‌ట్టం, న్యాయ వ్య‌వస్థ విచ్ఛిన్న‌మే అని MP సుప్రియా సూలే విమ‌ర్శించారు.

News September 24, 2024

ఓటుకు నోటు కేసు.. సీఎం విచారణకు రావాలని కోర్టు ఆదేశాలు

image

TG: ఓటుకు నోటు కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 16న సీఎం రేవంత్ రెడ్డి విచారణకు రావాలని ఆదేశించింది. కాగా ఇవాళ జరిగిన విచారణకు మత్తయ్య హాజరవ్వగా మిగతా నిందితులు గైర్హాజరయ్యారు.

News September 24, 2024

సీఎం రాజీనామా చేసే ప్రసక్తే లేదు: డిప్యూటీ సీఎం

image

<<14181565>>ముడా స్కామ్‌<<>>లో విచారణ ఎదుర్కోబోతున్న కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు తన డిప్యూటీ డీకే శివకుమార్ అండగా నిలిచారు. హైకోర్టు తీర్పు ఆయనకు ఎదురుదెబ్బేమీ కాదన్నారు. ‘సీఎం రిజైన్ చేసే ప్రసక్తే లేదు. ఆయన ఎలాంటి తప్పు, స్కామ్ చేయలేదు. మాపై, దేశంలోని అపోజిషన్ లీడర్లపై బీజేపీ చేస్తున్న రాజకీయ కుట్ర ఇది. గతంలోనూ మేం వీటిని ఎదుర్కొన్నాం. నేను స్వచ్ఛంగా వచ్చానా లేదా? చట్టాన్ని గౌరవించి మేం పోరాడతాం’ అని అన్నారు.

News September 24, 2024

లడ్డూలో పొగాకు పొట్లం వార్తలను ఖండించిన TTD

image

తిరుమల శ్రీవారి లడ్డూలో పొగాకు పొట్లం ఉన్నట్లు వస్తోన్న <<14180009>>ఆరోపణలను<<>> టీటీడీ కొట్టిపారేసింది. ‘పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారు. ఈ లడ్డూల తయారీ కూడా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుంది. ఇంతటి పకడ్బందీగా ఉన్న వ్యవస్థలో పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయడం శోచనీయం’ అని ప్రకటన విడుదల చేసింది.

News September 24, 2024

స్టార్ హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి: వెట్రిమారన్

image

సినిమా ఇండస్ట్రీ గట్టెక్కాలంటే స్టార్ హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ సూచించారు. కరోనా తర్వాత థియేటర్లు ఆర్థిక ఒడిదొడుకులకు గురయ్యాయని తెలిపారు. కొన్ని ఓటీటీ వేదికలు స్టార్ హీరోల సినిమాల కోసం భారీ మొత్తాలు చెల్లించడం వల్ల పరిశ్రమలో అసమతుల్యత ఏర్పడిందన్నారు. దీని వల్ల హీరోలు రెమ్యునరేషన్ పెంచారని, తద్వారా సినిమాల బడ్జెట్ కూడా పెరుగుతోందని వివరించారు.

News September 24, 2024

ఆర్థిక సాయం పెంచుతూ ఉత్తర్వులు

image

AP: వరదల కారణంగా నష్టపోయిన వారికి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నిర్దేశించిన దానికంటే ఆర్థిక సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో ఇళ్లు పూర్తిగా నీట మునిగిన బాధితులకు రూ.11వేలకు బదులుగా రూ.25 వేలు ఇవ్వనున్నారు. మొదటి ఫ్లోర్‌లో ఉన్నవారికి రూ.10 వేలు, దుకాణాలకు, పంటలకు హెక్టారుకు రూ.25 వేలు అందించనున్నారు. ఇళ్లు ధ్వంసమైన వారికి ప్రభుత్వం కొత్త ఇంటిని నిర్మించి ఇవ్వనుంది.

News September 24, 2024

రైతు భరోసా కాదు.. సీఎం కుర్చీకే భరోసా లేదు: కేటీఆర్

image

TG : హైదరాబాద్‌లో సీఎం రేవంత్ సోదరుడికి ఓ న్యాయం, సామాన్యులకు ఓ న్యాయమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఒకటే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘త్వరలో 10 చోట్ల ఉప ఎన్నికలు తప్పవు. డ్రామాలతో ఎక్కువ కాలం రాజకీయం నడవదు. మేం నిర్మాణాలు చేస్తే, కాంగ్రెస్ వాటిని కూల్చుతోంది. రైతు భరోసా కాదు.. సీఎం కుర్చీకే భరోసా లేదు’ అని ఆయన సెటైర్లు వేశారు.