News September 25, 2024

చెవిలో పేలిన ఇయర్ బడ్స్.. యువతికి శాశ్వత వినికిడి లోపం

image

టర్కీలో శాంసంగ్ ఇయర్ బడ్స్ చెవిలో పేలడంతో యువతికి శాశ్వతంగా వినికిడి లోపం తలెత్తింది. శాంసంగ్ గెలాక్సీ బడ్స్ FEని వాడుతున్న క్రమంలో పేలిందని యువతి ప్రియుడు తెలిపారు. దీనిపై శాంసంగ్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేలుడుకు గల కారణాన్ని వెల్లడించలేదన్నారు. దీంతో సేఫ్టీ విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News September 25, 2024

ధోనీకి కూడా కోపమొస్తుంది: మోహిత్

image

కెప్టెన్ కూల్‌గా పేరున్న మహేంద్ర సింగ్ ధోనీకి కూడా కోపమొస్తుందని CSK మాజీ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ తెలిపారు. ‘మ్యాచ్ కీలకంగా ఉన్న క్షణాల్లో ధోనీకి కోపమొచ్చింది. బేవకూఫ్ తూ నహీ హై, బేవకూఫ్ మై హు అని తిట్టారు’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో గుర్తుచేసుకున్నారు. ఆయనలోని ఈ కోణాన్ని కొద్ది మంది మాత్రమే చూశారన్నారు. దీపక్ చాహర్ కూడా ధోనీ చేతిలో తిట్లు తిన్నవారేనని చెప్పారు. అయితే ఇది గేమ్ వరకేనని సపోర్ట్ చేశారు.

News September 25, 2024

డేటింగ్ రూమర్స్‌పై స్పందించిన ఎలాన్ మ‌స్క్‌

image

ఇట‌లీ ప్ర‌ధాని మెలోనితో డేటింగ్ చేయ‌డం లేద‌ని ఎలాన్ మ‌స్క్ స్ప‌ష్టం చేశారు. న్యూయార్క్‌లో ఇటీవల జరిగిన ఓ అవార్డ్స్ ప్రోగ్రాంలో ‘మెలోని బయట కంటే లోపల మరింత అందమైన వ్యక్తి’ అని మస్క్ ప్రశంసించారు. దీంతో వీరి డేటింగ్ ప్రచారం మొదలైంది. వీరిద్దరి ఫొటోను షేర్ చేసిన మ‌స్క్ ఫ్యాన్ క్లబ్ ‘వీళ్లు డేట్ చేస్తారని అనుకుంటున్నారా?’ అని ప్ర‌శ్నించింది. దీనికి ‘మేము డేటింగ్ చేయ‌డం లేదు’ అని మ‌స్క్ రిప్లై ఇచ్చారు.

News September 25, 2024

కులగణనను వీలైనంత వేగంగా పూర్తి చేయండి: CM రేవంత్

image

TG: రాష్ట్రంలో బీసీ కులగణన ప్రక్రియను వేగంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్‌ను CM రేవంత్ కోరారు. ఈ ప్రక్రియ వీలైనంత తొందరగా పూర్తయ్యేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. కులగణనకు అనుసరించాల్సిన విధివిధానాలపై బీసీ కమిషన్‌‌తో చర్చించారు. కుల గణనపై సమగ్రంగా అధ్యయనం చేయాలని, అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలని కమిషన్‌కు CM సూచించారు.

News September 25, 2024

మహిళను 59 ముక్కలుగా నరికిన నిందితుడు ఆత్మహత్య

image

బెంగళూరుకు చెందిన మహాలక్ష్మి (29) హత్య <<14192326>>కేసు<<>> నిందితుడు ముక్తి రంజన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అతడి కోసం ఒడిశా వెళ్లి గాలిస్తుండగా కూలేపాడులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గుర్తించారు. కాగా మహాలక్ష్మి పని చేస్తున్న ఫ్యాక్టరీలో టీమ్ హెడ్‌గా ఉన్న రంజన్ కొంతకాలంగా ఆమెతో రిలేషన్‌లో ఉన్నాడు. మహాలక్ష్మి మరో వ్యక్తితో చనువుగా ఉండటం నచ్చక ఆమెను కిరాతకంగా చంపినట్లు సమాచారం.

News September 25, 2024

యాంగ్రీ లుక్‌లో ఎన్టీఆర్.. ‘దేవర’ నయా పోస్టర్

image

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. మరో రెండు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానుండగా చిత్ర యూనిట్ కొత్త పోస్టర్‌ను ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ చేతిలో ఆయుధంతో యాంగ్రీ లుక్‌లో ఉన్నారు. ‘ఆయుధం రక్తం రుచి చూసింది. తర్వాతి వంతు ప్రపంచానిదే. మరో రెండు రోజుల్లో..’ అని రాసుకొచ్చింది.

News September 25, 2024

విశాఖ ఉక్కుకు పునర్వైభవం: లోకేశ్

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రశ్నే లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విశాఖ ప్రాంత కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో లోకేశ్ సమావేశమై ప్లాంట్ అంశంపై చర్చించారు. విశాఖ ఉక్కుతో ప్రతి తెలుగు వారికి అనుబంధం ఉందని చెప్పారు. ఉక్కు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. విశాఖ ఉక్కుకు పునర్వైభవం తీసుకొస్తామని వివరించారు.

News September 25, 2024

దసరాలోగా నాలుగో విడత రుణమాఫీ?

image

TG: దసరాలోగా నాలుగో విడత రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 4.25 లక్షల మందికి మాఫీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే 22 లక్షల మందికి రూ.17,934 కోట్లు మాఫీ చేసింది. రేషన్ కార్డులు లేని రైతులు, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉన్నవారికి, ఇతర సాంకేతిక సమస్యలు, కుటుంబ నిర్ధారణ కానివారికి మాఫీ చేస్తారు. ఇందుకు సంబంధించిన డేటా అప్‌లోడ్ ప్రక్రియ ఈ నెలాఖరుతో ముగియనుంది.

News September 25, 2024

IPL-2025పై బిగ్ అప్‌డేట్!

image

IPLలో ప్లేయర్ల రిటెన్షన్ (అట్టిపెట్టుకోవడం)పై అప్‌డేట్ వచ్చింది. మెగా వేలానికి ముందు ఒక ఫ్రాంచైజీ ఐదుగురు ప్లేయర్లను రిటెన్షన్ చేసుకునే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందులో ముగ్గురు భారత, ఇద్దరు విదేశీ ప్లేయర్లు ఉండొచ్చనే రూల్ పెట్టినట్లు సమాచారం. RTM (రైటు టు మ్యాచ్) ఆప్షన్ ఉండదని వార్తలొస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

News September 25, 2024

పలు జిల్లాలకు వైసీపీ అధ్యక్షుల నియామకం

image

AP: పలు జిల్లాలకు వైసీపీ అధినేత జగన్ అధ్యక్షులను ప్రకటించారు.
1.గుంటూరు- అంబటి రాంబాబు
2.ఎన్టీఆర్- దేవినేని అవినాశ్
3.కృష్ణా- పేర్ని నాని
>> ఏపీ వైసీపీ అధికార ప్రతినిధిగా కైలే అనిల్ కుమార్
>>మంగళగిరి వైసీపీ సమన్వయకర్తగా శంకర్ రెడ్డి నియామకం.