News October 11, 2024

మందు బాబులపై ‘రౌండాఫ్’ భారం

image

AP: నూతన లిక్కర్ పాలసీలో రౌండాఫ్ పేరుతో ఛార్జీల వసూలుకు ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ విధానంపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఉదాహరణకు మద్యం బాటిల్ ధర ₹150, ₹200 ఉంటే యథాతథంగా ఉంచుతారు. ఆ రేటుకు అర్ధరూపాయి ఎక్కువున్నా రౌండాఫ్ చేసి ₹160, ₹210 వసూలు చేస్తారు. ఒకవేళ సీసా ధర ₹90.5 ఉంటే రౌండాఫ్ ₹99 చేస్తారు. రూ.99కే నాణ్యమైన క్వార్టర్ మద్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

News October 11, 2024

భారతీయులకు రాష్ట్రపతి దుర్గా పూజ శుభాకాంక్షలు

image

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దుర్గా పూజ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘చెడుపై మంచి సాధించిన విజయానికి దుర్గా పూజ ప్రతీక. అమ్మవారిని శక్తికి సంకేతంగా భావిస్తాం. ఐక్యతను, సర్వమత సమానత్వాన్ని చాటేందుకు ఈ పండుగ ఓ సందర్భం. మనందరికీ దుర్గమ్మ శక్తి, ధైర్యం, సంకల్పాన్ని ఇవ్వాలని కోరుకుందాం. మహిళల్ని అత్యున్నతంగా గౌరవించుకుందాం’ అని పిలుపునిచ్చారు.

News October 11, 2024

ఢిల్లీ వెళ్లనున్న ఉత్తమ్

image

TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా NDSA ఛైర్మన్ అనిల్ జైన్‌తో భేటీ కానున్న ఆయన కాళేశ్వరం బ్యారేజీలపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ఛైర్మన్‌తోనూ సమావేశం కానున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ చర్యలపై వారితో చర్చించడంతో పాటు నీటి నిల్వకు ఉన్న అవకాశాలపై సమీక్షిస్తారు.

News October 11, 2024

EVMలే కారణం: నేతలపై చిరాకుపడ్డ రాహుల్ గాంధీ!

image

హరియాణా ఓటమిపై సమీక్షలో రాహుల్ గాంధీ గుంభనంగా కూర్చున్నారని తెలిసింది. పరాజయానికి EVMలే కారణమని సభ్యులు చెప్తుంటే చిరాకు పడ్డారని సమాచారం. EVM, EC జవాబుదారీతనం, కౌంటింగ్ పరంగా తప్పెక్కడ జరిగిందో డీటెయిల్డ్ రిపోర్టు అడిగారు. గెలిచి తీరాల్సిన ఎన్నికల్లో పార్టీ భవిష్యత్తుపై కాకుండా తమ ఎదుగుదలపై లోకల్ లీడర్లు ఆసక్తి చూపారని అనడంతో రూమ్ అంతా సైలెంటైంది. ఆ 2 పాయింట్లు అనేసి రాహుల్ వెళ్లిపోయారు.

News October 11, 2024

FLASH: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

దసరా ముంగిట హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.760 పెరిగి రూ.77,400 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.700 ఎగసి రూ.70,950కి చేరుకుంది. కేజీ సిల్వర్ ధర రూ.2,000 పెరగడంతో రూ.1,02,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

News October 11, 2024

‘ఇస్లామిక్ జిహాద్’ అగ్రకమాండర్ హతం: ఇజ్రాయెల్

image

హమాస్ మిత్ర సంస్థ ‘ఇస్లామిక్ జిహాద్’ అగ్రకమాండర్ మహ్మద్ అబ్దుల్లా హతమయ్యాడని ఇజ్రాయెల్ ప్రకటించింది. వెస్ట్ బ్యాంక్‌లోని శరణార్థుల శిబిరంలో దాక్కున్న అబ్దుల్లాను మరో ఉగ్రవాదితో కలిపి తమ బలగాలు మట్టుబెట్టాయని తెలిపింది. వారి దగ్గర M-16 రైఫిల్స్, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఇటీవల హతమైన ముహమ్మద్ జబ్బెర్ స్థానంలో అబ్దుల్లా చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నాడని వివరించింది.

News October 11, 2024

భారత్‌కు భయపడకూడదు: న్యూజిలాండ్ కెప్టెన్

image

భారత్‌తో ఆడినప్పుడు భయపడొద్దంటూ న్యూజిలాండ్ టెస్టు జట్టు నూతన సారథి టామ్ లాథమ్ తన టీమ్‌కు పిలుపునిచ్చారు. ‘టీమ్ ఇండియాను వారి స్వదేశంలో ఎదుర్కోవడం పెను సవాలే. అందుకు సిద్ధంగా ఉన్నాం. భయం లేకుండా ఆడి ఎదురుదాడి చేయాలి. గతంలో అక్కడ గెలిచిన జట్లు అదే చేశాయి. దూకుడుతోనే గెలిచే ఛాన్స్ ఉంటుంది. మా ప్లాన్స్ మాకున్నాయి’ అని వెల్లడించారు. వచ్చే మూడు వారాల్లో ఆ జట్టు భారత్‌లో 3 టెస్టులాడనుంది.

News October 11, 2024

Stock Market: ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు

image

ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఫలితాల సీజన్ ఆరంభమవ్వడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రస్తుతం BSE సెన్సెక్స్ 23 పాయింట్లు పెరిగి 81,637 వద్ద ట్రేడవుతోంది. NSE నిఫ్టీ 18 పాయింట్లు ఎగిసి 25,015 వద్ద చలిస్తోంది. హిందాల్కో, టాటా స్టీల్, ఐచర్, JSW స్టీల్, ONGC టాప్ గెయినర్స్. సిప్లా, TCS, ASIAN PAINTS, ICICI బ్యాంక్, ITC టాప్ లూజర్స్.

News October 11, 2024

‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ REVIEW

image

ఇది కన్నతండ్రి(సాయిచంద్), పెంచిన తండ్రి(సాయాజీ షిండే), ఓ కొడుకు(సుధీర్‌బాబు) మధ్య ముక్కోణపు ఎమోషనల్ కథ. డైరెక్టర్ అభిలాష్ కొత్త తరహా కథాంశాన్ని ఎమోషనల్ డ్రామాగా తీర్చిదిద్దారు. పెంచిన తండ్రి అప్పు తీర్చేందుకు హీరో కష్టాలు, కొడుకు ప్రేమకై తపించే కన్నతండ్రి యాంగిల్ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సన్నివేశాలు బాగున్నా పాత్రల మధ్య కొరవడిన భావోద్వేగాలు, స్లో నరేషన్, చివరి 20 నిమిషాలు మైనస్.
రేటింగ్: 2.5/5

News October 11, 2024

16 నుంచి ఇంటర్ కాలేజీల టైమింగ్స్ మార్పు

image

AP: ప్రభుత్వ జూనియర్, ఎయిడెడ్ కాలేజీల సమయాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం ఉ.9 నుంచి సా.4 వరకు టైమింగ్స్ ఉండగా, ఈ నెల 16 నుంచి సా.5 వరకు సమయాన్ని పొడిగించింది. గత ఏడాది ఫలితాల్లో ఆశించిన స్థాయిలో విద్యార్థులు రాణించకపోవడంతో సా.4-5 గంటల మధ్య స్టడీ అవర్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు డైరెక్టర్ కృతిక శుక్ల ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని ప్రిన్సిపల్స్‌ను ఆదేశించారు.