News October 30, 2024

ముగిసిన రాజ్ పాకాల విచారణ

image

TG: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసులో KTR బామ్మర్ది రాజ్ పాకాల విచారణ ముగిసింది. విజయ్ మద్దూరి స్టేట్‌మెంట్ ఆధారంగా 9 గంటల పాటు ఆయన్ను మోకిల పోలీసులు ప్రశ్నించారు. విచారణ మధ్యలో ఆయన్ను ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లిన పోలీసులు గంట పాటు అక్కడ సోదాలు చేపట్టారు. గతంలో ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీలపైనా ఆరా తీశారు. ఆయన చెప్పిన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.

News October 30, 2024

కోడింగ్‌పై సుందర్ పిచ్చాయ్ కీలక వ్యాఖ్యలు

image

గూగుల్‌లో 25% కోడ్‌ల‌ను AI ద్వారా జ‌న‌రేట్ చేస్తున్న‌ట్టు CEO సుంద‌ర్ పిచ్చాయ్ తెలిపారు. బేసిక్ అవ‌స‌రాలును AIతో తీర్చుకోగ‌లిగినా వాటిని హ్యుమ‌న్ ఇంజినీర్లు చెక్ చేస్తున్న‌ట్టు తెలిపారు. తద్వారా ఆయన ఎంట్రీలెవ‌ల్‌, కోడింగ్ జాబ్‌ల‌పై అనేక‌ ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తార‌నే టాక్ న‌డుస్తోంది. దీని వల్ల ఉద్యోగాలు పోతాయ‌ని కాకుండా ఉద్యోగులు ఇన్నోవేష‌న్‌పై దృష్టిసారించే ఆస్కారం ఏర్పడుతుందని చెబుతున్నారు.

News October 30, 2024

పచ్చదనంతో ఈ సమస్యలకు చెక్!

image

పచ్చదనం కలిగిన పరిసరాల్లో నివసిస్తున్న వారు గుండె, షుగర్, BP వంటి సమస్యలకు దూరంగా ఉన్నట్లేనని ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా పార్కులు, తోటల చుట్టూ ఉన్న ఇంట్లో నివసించడం వల్ల స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం తక్కువని తేలింది. చుట్టూ భవనాలతో నిండిన కార్యాలయాల్లో పనిచేయడం వల్ల శబ్ద కాలుష్యానికి గురికావడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంది. BP, హార్ట్ బీట్ పెరగడానికి శబ్దకాలుష్యం ఓ కారణమని పేర్కొంది.

News October 30, 2024

రిప‌బ్లిక‌న్ల‌ను కలవరపెడుతున్న ప్యూర్టో రికో

image

అధ్య‌క్ష ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ ప‌డేకొద్దీ అమెరికా అధీనంలోని ప్యూర్టో రికో రిప‌బ్లిక‌న్ల‌ను టెన్ష‌న్ పెడుతోంది. ట్రంప్ మాడిస‌న్ స్క్వేర్ స‌భ‌లో స్టాండ‌ప్ క‌మెడియ‌న్ టోనీ హించ్‌క్లిఫ్ ప్యూర్టో రికోను ఓ చెత్త‌కుప్ప‌తో పోల్చ‌డం వివాదం రేపింది. ఈ ద్వీపంలోని ప్ర‌జ‌లు ఎన్నికల్లో ఓటు వేయకపోయినా ఇక్కడి మూలాలున్న 60 లక్షల మంది ఓటర్లు అమెరికాలో నివసిస్తున్నారు. ఇప్పుడు వీరంతా రిపబ్లికన్లపై గుర్రుగా ఉన్నారు.

News October 30, 2024

గాంధీ కుటుంబం హామీ శిలాశాసనం: రేవంత్

image

గాంధీ కుటుంబం ఏదైనా హామీ ఇస్తే అది శిలాశాసనంతో సమానమని సీఎం రేవంత్ అన్నారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన కుల గణనపై అవగాహన సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చాక సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని ఆయన అన్నారు. సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో సోనియా గాంధీ కూడా మాటిచ్చారని, గాంధీ కుటుంబం మాటిస్తే 100% నెరవేర్చుతుందని ఆయన అన్నారు.

News October 30, 2024

CM చంద్రబాబుతో రాందేవ్ బాబా భేటీ

image

AP: సీఎం చంద్రబాబును ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా కలిశారు. అమరావతిలో వీరిద్దరూ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏర్పాటుపై సీఎంతో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే వెల్‌నెస్ సెంటర్లు, వ్యవసాయరంగంలో పెట్టుబడులపై కూడా వీరు చర్చించినట్లు సమాచారం.

News October 30, 2024

TTD ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు

image

AP: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా బీఆర్ నాయుడును ప్రభుత్వం ప్రకటించింది. 24 మంది సభ్యులతో పాలక మండలిని నియమించింది. కాగా బీఆర్ నాయుడు ఓ మీడియా ఛానల్ అధినేత. జ్యోతుల నెహ్రూ, ఎంఎస్ రాజు, నన్నూరి నర్సిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, సుచిత్ర యెల్లా, మల్లెల రాజశేఖర్ గౌడ్, ఆనంద్ సాయి, వేముల ప్రశాంతి, పనబాక లక్ష్మి, జస్టిస్ హెచ్ఎల్ దత్, ఆర్ఎన్ దర్శన్, బొంగునూరు మహేందర్‌లను మెంబర్లుగా ప్రకటించింది.

News October 30, 2024

మయోనైజ్‌పై ప్రభుత్వం నిషేధం

image

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో మంది అనారోగ్యాలకు కారణం అవుతున్న మయోనైజ్‌ను ఏడాది పాటు నిషేధిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మయోనైజ్‌ను వినియోగించకుండా హోటళ్లు, ఫుడ్‌స్టాళ్లలో తరచూ తనిఖీలు చేయాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. కాగా మయోనైజ్ తిని ఇటీవల హైదరాబాద్‌లో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.

News October 30, 2024

SPFకు సచివాలయ భద్రత

image

TG: రాష్ట్ర సచివాలయ భద్రత బాధ్యతను ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(SPF)కు అప్పగించింది. ఇప్పటివరకు తెలంగాణ స్పెషల్ పోలీస్(TGSP) విధులు నిర్వహించింది. పాత సచివాలయంలో 25 ఏళ్లుగా SPF సిబ్బందే భద్రతను పర్యవేక్షించారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం తర్వాత అప్పటి BRS సర్కార్ TGSPని నియమించింది. అయితే ఇటీవల బెటాలియన్ పోలీసుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా వారిని తొలగించినట్లు తెలుస్తోంది.

News October 30, 2024

మెడికల్ కాలేజీకి యల్లాప్రగడ పేరు: పవన్

image

AP: రాష్ట్రంలోని ఏదైనా మెడికల్ కాలేజీకి ప్రముఖ వైద్య శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన CM చంద్రబాబుకు పూర్తి వివరాలు పంపారు. ‘సుబ్బారావు భీమవరంలో పుట్టి, రాజమండ్రిలో చదువుకున్నారు. కాబట్టి ఏలూరు, రాజమండ్రిలోని ఏదైనా ఒక కళాశాలకు ఆయన పేరు పెడితే సముచితంగా ఉంటుంది. సీఎం స్పందించి ఈ ప్రతిపాదనను పరిశీలించాలి’ అని ఆయన పేర్కొన్నారు.