News October 30, 2024

మెడికల్ కాలేజీకి యల్లాప్రగడ పేరు: పవన్

image

AP: రాష్ట్రంలోని ఏదైనా మెడికల్ కాలేజీకి ప్రముఖ వైద్య శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన CM చంద్రబాబుకు పూర్తి వివరాలు పంపారు. ‘సుబ్బారావు భీమవరంలో పుట్టి, రాజమండ్రిలో చదువుకున్నారు. కాబట్టి ఏలూరు, రాజమండ్రిలోని ఏదైనా ఒక కళాశాలకు ఆయన పేరు పెడితే సముచితంగా ఉంటుంది. సీఎం స్పందించి ఈ ప్రతిపాదనను పరిశీలించాలి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 8, 2024

ఆ రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించిన వైసీపీ

image

AP: చిలకలూరిపేట, తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ సమన్వయకర్తలను ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు చిలకలూరిపేట నియోజకవర్గానికి విడదల రజిని, తాడికొండకు వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు)ను నియమించినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.

News November 8, 2024

‘పుష్ప-2’ ఐటమ్ సాంగ్ ఫొటో లీక్?

image

‘పుష్ప-2’ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుంది. ప్రస్తుతం ఐటం సాంగ్ చిత్రీకరిస్తుండగా దానికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. సెట్‌లో అల్లు అర్జున్‌తో కలిసి శ్రీలీల స్టెప్పులేస్తున్నట్లుగా ఇందులో కనిపించింది. బన్నీ డిఫరెంట్ కాస్ట్యూమ్‌తో కనిపిస్తున్నారు. ఈ సాంగ్ వీడియో కూడా లీకైందని కొందరు పోస్టులు చేస్తున్నారు. మరికొందరేమో ఇలా లీక్ చేయడం కరెక్ట్ కాదని, ఫేక్ అని కామెంట్లు చేస్తున్నారు.

News November 8, 2024

అక్రమంగా 20.95 ఎకరాల్లో రెడ్ గ్రావెల్ తవ్వకం

image

AP: ఏలూరు(D) ఐ.ఎస్.జగన్నాథపురంలో 20.95 ఎకరాల్లో అక్రమంగా రెడ్ గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. Dy.CM పవన్ ఆదేశాలతో రెవెన్యూ, గనుల శాఖ విచారణ చేపట్టగా, బెకెమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ అనుమతులు లేకుండా 6 లక్షల క్యూబిక్ మీటర్ల రెడ్ గ్రావెల్ తవ్వకం సాగించినట్లు గుర్తించారు. ఇందుకు బాధ్యులైన అధికారులకు, ఇన్ఫ్రా సంస్థకు నోటీసులు ఇస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.