News November 3, 2024

ఈ కందిరీగల స్పెషల్ పవర్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

image

వెస్పా జాతి కందిరీగలకు ఉన్న ఇథనాల్(ఆల్కహాల్‌ కాంపోనెంట్) డిటాక్సిఫికేషన్‌ పవర్ ప్రపంచంలో మరే జంతువులకీ లేదని సైంటిస్టులు తెలిపారు. ఇథనాల్ అధికంగా ఉన్న తాటి పువ్వుల నుంచి ఇవి మకరందాన్ని సేవిస్తాయి. అయినప్పటికీ వాటి జీవితకాలం, జీవక్రియలపై ఇథనాల్ ఎలాంటి ప్రభావం చూపడం లేదని గుర్తించారు. ఈ కందిరీగల్లో ఇథనాల్‌‌ను అత్యంత వేగంగా మెటబాలిజింగ్ చేసే శక్తి ఉండటంతో వాటికి డిటాక్సిఫికేషన్ పవర్ అందుతోందన్నారు.

News November 3, 2024

నాన్-స్టిక్ పాత్రల్లో వంట చేస్తున్నారా?

image

వినియోగించడానికి సౌకర్యంగా ఉన్నా వంట కోసం నాన్-స్టిక్ పాత్రలు వాడొద్దని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. నాన్-స్టిక్ పాత్రల్లోని ఆహారం తినడం వల్ల శరీరంలో టెప్లాన్ పరిమాణం పెరిగి వంద్యత్వం, గుండె జబ్బులు వస్తాయి. ఈ పాత్రల్లోని ఫుడ్ తింటే ఐరన్ లోపంతోపాటు శ్వాసకోస సమస్యలు, థైరాయిడ్ వంటి రోగాలు వస్తాయి. మట్టి కుండల్లో ఆహారం వండుకుని తినడం మంచిది.

News November 3, 2024

ఈనెల 5 నుంచి ఇందిర‌మ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక: మంత్రి

image

TG: ఈనెల 5 నుంచి ఇందిర‌మ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 15 రోజుల్లో గ్రామ క‌మిటీల ద్వారా ఎంపిక పూర్తి చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ఉండ‌వని, ల‌బ్ధిదారుల ఇష్టం మేర‌కు నిర్మించుకోవ‌చ్చన్నారు. క‌నీసం 400 చ‌.అడుగులకు త‌గ్గ‌కుండా ఇల్లు నిర్మించుకోవాలని, త‌ప్ప‌నిస‌రిగా కిచెన్, బాత్రూం ఉండాలని మీడియా చిట్ చాట్‌లో పేర్కొన్నారు.

News November 3, 2024

రవీంద్ర జడేజా సూపర్ రికార్డ్

image

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ రికార్డు నెలకొల్పారు. ప్రస్తుత WTCలో 50 వికెట్లు పూర్తి చేసుకున్న రెండో భారత బౌలర్‌గా రికార్డులకెక్కారు. రవిచంద్రన్ అశ్విన్ తర్వాత ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా ఘనత వహించారు. అశ్విన్ ఈ WTCలో 62 వికెట్లు పడగొట్టారు. కాగా జడేజా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.

News November 3, 2024

విశాఖను లింక్ చేస్తూ ORR: చంద్రబాబు

image

AP: విశాఖ నగర అభివృద్ధిపై కలెక్టరేట్‌లో CM చంద్రబాబు రివ్యూ చేశారు. నగరంలో పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేయాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం, నెల్లిమర్ల, భోగాపురం, అనకాపల్లి ప్రాంతాలను విశాఖకు అనుసంధానం చేస్తూ ORR నిర్మించేలా ప్లాన్ చేయాలని సూచించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానించేలా రోడ్ల నిర్మాణం ఉండాలని వెల్లడించారు. 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం 15% వృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.

News November 2, 2024

ఉద్యోగి ఆత్మహత్యపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

image

విధులకు సంబంధించి పైస్థాయి వ్య‌క్తి తీసుకున్న నిర్ణ‌యాలు ఉద్యోగి ఆత్మహత్యకు కారణంగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లోని వ్యక్తుల నిర్ణయాలు ఉద్యోగుల‌కు కొన్నిసార్లు క‌ష్ట‌త‌రంగా అనిపించ‌వచ్చు. అయితే హానికారక ఉద్దేశం లేకపోతే ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌కు వారిని బాధ్యులుగా ప‌రిగ‌ణించ‌లేం’ అని బీఆర్ అంబేడ్కర్ కాలేజీ(Delhi వర్సిటీ) EX ప్రిన్సిపల్ కేసులో పేర్కొంది.

News November 2, 2024

రేపు ఏం జరుగుతుంది? సర్వత్రా ఉత్కంఠ

image

NZతో మూడో టెస్టులో భారత్ గెలుస్తుందా లేదా అనేది రేపు తేలనుంది. ఇప్పటికే 143 పరుగుల ఆధిక్యంలో ఉన్న NZ, INDకు 160 పరుగుల టార్గెట్ ఇచ్చే ఛాన్సుంది. దీనిని ఛేదించడం INDకు అంత సులభమేం కాదు. వాంఖడేలో ఇప్పటివరకు అత్యధిక రన్స్ ఛేజ్ చేసిన రికార్డు SA (163vsIND) పేరిట ఉంది. ఈ నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందనే దానిపై క్రికెట్ ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. రేపు టీమ్‌ఇండియా గెలుస్తుందా? కామెంట్ చేయండి.

News November 2, 2024

ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసు సిట్‌కు బదిలీ

image

TG: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ విగ్రహం ధ్వంసం కేసు విచారణను సిట్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై ఇప్పటివరకు సిట్ 3 కేసులు నమోదు చేసింది. అటు విగ్రహం ధ్వంసం చేసిన ప్రధాన నిందితుడు సల్మాన్ సలీంకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితుడ్ని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

News November 2, 2024

39,481 ఉద్యోగాలు.. అభ్యర్థులకు BIG ALERT

image

BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF, NCBలో 39,481 GD కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం గత నెలలో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. అయితే అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో సవరణ చేసుకునేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది. నవంబర్ 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 7వ తేదీ రాత్రి 11 వరకు మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. గడువు ముగిసిన తర్వాత వచ్చే ఎలాంటి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.

News November 2, 2024

మోదీ గ్యారంటీ అనేది క్రూరమైన జోక్‌: ఖ‌ర్గే

image

మోదీ గ్యారంటీ అనేది 140 కోట్ల మంది భార‌తీయుల‌పై ఓ క్రూర‌మైన జోక్ అని కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఖ‌ర్గే దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ గ్యారంటీల‌ను మోదీ విమ‌ర్శించడంపై ఖ‌ర్గే స్పందిస్తూ BJPలో B అంటే బిట్రేయ‌ల్(మోసం), J అంటే జుమ్లా(అబ‌ద్ధం) అని మండిప‌డ్డారు. 2 కోట్ల ఉద్యోగాలు, అచ్చే దిన్‌, విక‌సిత్ భార‌త్‌, నేను తిన‌ను-తిన‌నివ్వ‌ను, స‌బ్‌కా సాత్‌-స‌బ్‌కా వికాస్ నినాదాలు ఏమ‌య్యాయ‌ని ఖ‌ర్గే ప్ర‌శ్నించారు.