News November 2, 2024
రేపు ఏం జరుగుతుంది? సర్వత్రా ఉత్కంఠ
NZతో మూడో టెస్టులో భారత్ గెలుస్తుందా లేదా అనేది రేపు తేలనుంది. ఇప్పటికే 143 పరుగుల ఆధిక్యంలో ఉన్న NZ, INDకు 160 పరుగుల టార్గెట్ ఇచ్చే ఛాన్సుంది. దీనిని ఛేదించడం INDకు అంత సులభమేం కాదు. వాంఖడేలో ఇప్పటివరకు అత్యధిక రన్స్ ఛేజ్ చేసిన రికార్డు SA (163vsIND) పేరిట ఉంది. ఈ నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందనే దానిపై క్రికెట్ ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. రేపు టీమ్‌ఇండియా గెలుస్తుందా? కామెంట్ చేయండి.
Similar News
News December 6, 2024
MSPతోనే పంటల కొనుగోలు: కేంద్రం
వ్యవసాయ ఉత్పత్తులను MSPతో కొనేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో తెలిపారు. 2019 నుంచి పంట ఉత్పత్తుల ఖర్చులో 50% రైతులకు లాభం చేకూర్చేలా MSPని లెక్కిస్తున్నామని తెలిపారు. రుణమాఫీ అవసరం లేకుండా రైతుల ఆదాయం పెంపు, నష్టాల సమయంలో పరిహారం వంటి చర్యలతో ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. అయితే రైతులు MSPకి చట్టబద్ధత డిమాండ్ చేస్తున్నారు.
News December 6, 2024
12వేల ఏళ్ల క్రితమే కుక్కలతో మనిషి బంధం: అధ్యయనం
కుక్కలు, మనుషుల మధ్య బంధం 12వేల ఏళ్ల క్రితమే ఉందని అమెరికా పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అలాస్కాలో లభించిన 12వేల ఏళ్ల నాటి కుక్కల కాలి ఎముకలపై వారు అధ్యయనం నిర్వహించారు. వాటి ఎముకల్లో సాల్మన్ చేప ప్రొటీన్లు లభ్యమయ్యాయి. నాటి కుక్కలు భూమిపైనే వేటాడేవి తప్పితే సాల్మన్ చేపల్ని పట్టుకోవడం కష్టమని.. కచ్చితంగా అవి మనుషులతో కలిసి జీవించినవేనని పరిశోధకులు తేల్చారు.
News December 6, 2024
పెళ్లికి ముందే ఈ పరీక్షలు అవసరం!
ప్రాణాంతక తలసేమియా వ్యాధి నుంచి పిల్లల్ని రక్షించడానికి పెళ్లికి ముందే కాబోయే దంపతులు పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దేశంలో 4 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు! తల్లిదండ్రులిద్దరికీ ఈ సమస్యలుంటే పిల్లలకూ సంక్రమించే అవకాశం ఎక్కువని చెబుతున్నారు. మేనరిక వివాహాల వల్ల అత్యధికంగా సంక్రమించే ఈ వ్యాధి నుంచి పిల్లల రక్షణకు పెళ్లికి ముందే పరీక్షలు అవసరమని చెబుతున్నారు.