India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ మరోసారి బెదిరింపులు వచ్చాయి. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ముంబై పోలీసులకు ఈ థ్రెట్ మెసేజ్ అందింది. కాగా ఈ వారంలో సల్మాన్‌కు బెదిరింపులు రావడం ఇది మూడోసారి. కాగా రూ.50 లక్షలు ఇవ్వకపోతే షారుక్ ఖాన్‌ను చంపేస్తానంటూ నిన్న ఓ దుండగుడు పోలీసులకు ఫోన్ చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణకు చెందిన 21 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంకును కైవసం చేసుకున్నారు. నార్వేకు చెందిన కార్ల్‌సెన్ మాగ్నస్ ప్రథమ స్థానంలో ఉండగా ఇటాలియన్- అమెరికన్ గ్రాండ్ మాస్టర్ ఫాబియానో కరువానా మూడో ప్లేస్‌లో ఉన్నారు. నకమురా హికారు (USA) నాల్గో స్థానంలో ఉన్నారు. ఐదో స్థానంలో గుకేశ్ (ఇండియా), ఆరో స్థానంలో అబ్దుసట్టోరోవ్ నోడిర్బెక్ (ఉజ్బెకిస్థాన్) నిలిచారు.

TG: ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌కు సంబంధించిన కేసులో KTRను అరెస్ట్ చేస్తారనే ప్రచారం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. రూ.55 కోట్ల చెల్లింపు <<14549490>>వ్యవహారంలో<<>> ఆయనపై కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాయగా, ఆయన నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అటు తనను అరెస్ట్ చేస్తే చేసుకోవచ్చని, దేనికైనా రెడీ అంటూ KTR సైతం నిన్న ప్రెస్‌మీట్‌లో చెప్పడంతో ఈ అంశంలో ఏం జరుగుతుందా అని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబోలో తెరకెక్కనున్న అఖండ-2పై ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. దేవాలయాలు, హిందూ గ్రంథాలను అవహేళన చేసే వ్యక్తులకు బుద్ధి చెప్పే పాత్రలో బాలయ్య నటిస్తారని, అఘోర తరహాలో పవర్‌ఫుల్‌గా ఆయన క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఆయన మేకోవర్‌పై దృష్టిసారించినట్లు టాక్. ఈ మూవీ కోసం భారీ సెట్టింగ్‌ను నిర్మిస్తున్నామని, త్వరలోనే ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని మూవీ వర్గాలు చెబుతున్నాయి.

నీరు పుష్కలంగా ఉండేచోట మొక్కలు నాటడం కామన్. కానీ, నీటిజాడ కనిపించని ఎడారిని పచ్చగా మార్చేందుకు ఓ వ్యక్తి కంకణం కట్టుకున్నారు. రాజస్థాన్‌లోని ఎకల్‌ఖోరి గ్రామంలో 80 ఏళ్ల రణారామ్ బిష్ణోయ్ ఎడారి ప్రాంతంలో 10 ఎకరాల్లో 50వేల చెట్లను నాటారు. గొట్టపుబావిలో నుంచి నీటిని తోడి మొక్కలు నాటిన ప్రాంతానికి వెళ్లి వాటికి నీరు పోస్తుంటారు. ఈయణ్ని ‘ట్రీ మ్యాన్’ అని పిలుస్తుంటారు. మొక్కలను దేవుడిలా పూజిస్తుంటారయన.

నాలుగు T20ల సిరీస్‌లో భాగంగా భారత్, సౌతాఫ్రికా మధ్య నేడు తొలి మ్యాచ్ జరగనుంది. డర్బన్ వేదికగా రా.8.30 గంటలకు పోరు మొదలుకానుంది. స్పోర్ట్స్ 18, జియో సినిమాలో లైవ్ చూడొచ్చు. టెస్ట్ సిరీస్‌లో కివీస్ చేతిలో ఎదురైన దారుణ పరాభవాన్ని మరిపించాలని సూర్య నేతృత్వంలోని కుర్రాళ్లు భావిస్తున్నారు. T20 WC ఫైనల్లో భారత్ చేతిలో ఓటమికి ఈ సిరీస్ ద్వారా కొంతైనా ప్రతీకారం తీర్చుకోవాలని సఫారీ జట్టు ఉవ్విళ్లూరుతోంది.

రోజూ ఉదయాన్నే చద్దన్నం తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇడ్లీ, దోశ, చపాతీ, ఉప్మా బదులు దీనిని తీసుకోవడం ఉత్తమం. చద్దన్నంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది తింటే రోజంతా ఉత్తేజంగా, శక్తిమంతంగా పనిచేస్తారు. పెరుగుతో కూడిన చద్దన్నంలో ఉల్లిపాయ, మిరపకాయ నంజుకుని తింటే శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది. కుర్చీలో కూర్చుని పనిచేసేవారు తక్కువ, శారీరక శ్రమ చేసే వారు ఎక్కువగా తినొచ్చు.

AP: నేరాల నియంత్రణకు ఆధార్ డేటాను పోలీసులకు అప్పగించేందుకు కేంద్ర నిర్ణయించింది. ఇది నేర పరిశోధన ప్రక్రియలో మరింత వెసులుబాటు కలిగించేందుకు ఉపయోగపడుతుంది. ప్రధానంగా గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించడంలో అవసరమవుతుంది. వలస కూలీలు, పేదలకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఈ డేటాను అందుబాటులోకి తేవాలని వివిధ రాష్ట్రాల పోలీసులు కేంద్ర హోంశాఖను కోరాయి. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంది.

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, SIB మాజీ OSD ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డు లభించినట్లు సమాచారం. ఇక ఆయన ఇప్పట్లో హైదరాబాద్ రారని, ఈ కేసు విచారణకు బ్రేక్ పడుతుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎలా ముందుకెళ్లాలని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా గ్రీన్ కార్డు ఉన్నవాళ్లు అమెరికాలో ఎన్ని రోజులైనా ఉండొచ్చు.

AP: గత ప్రభుత్వంలో క్రీడా రంగాన్ని పట్టించుకోలేదని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ విమర్శించారు. విశాఖ, మంగళగిరి క్రికెట్ స్టేడియాల్లో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ATP, VZM, మూలపాడులో క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మన క్రికెటర్లు IPLకి సెలక్ట్ అయ్యేలా, రంజీ ట్రోఫీ, అండర్-19 ఆడేవారికి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇప్పిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.