News March 21, 2024

BJPకి ఎక్కువ విరాళాలు ఇచ్చిన కంపెనీలివే

image

1.మేఘా ఇంజినీరింగ్ (MEIL): రూ.584 కోట్లు
2.క్విక్ సప్లై: రూ.375 కోట్లు
3.వేదాంత లిమిటెడ్: రూ.226 కోట్లు
4.భారతీ ఎయిర్‌టెల్: రూ.197 కోట్లు
**కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా వేదాంత లిమిటెడ్ రూ.125 కోట్లు ఇచ్చింది.
SOURCE: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సైట్‌లోని ఎలక్టోరల్ బాండ్లు

News March 21, 2024

లిక్కర్ స్కాంలో ఎవరెవరు అరెస్టయ్యారంటే?

image

ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేసింది. ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ CM మనీశ్ సిసోడియా, ఆప్ MP సంజయ్ సింగ్, BRS MLC కవిత, మాగుంట రాఘవ, విజయ్ నాయర్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, గౌతమ్ మల్హోత్రా, రాజేశ్ జోషి, అమన్ ‌దీప్, అరుణ్ రామచంద్ర పిళ్లైని అరెస్ట్ చేసింది.

News March 21, 2024

ఏపీ ప్రతిష్ఠపై బురదజల్లడమే చంద్రబాబు పని: YCP

image

AP: ఎక్కడేం జరిగినా దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెట్టి ఏపీ ప్రతిష్ఠపై బురదజల్లడమే చంద్రబాబు పని అని YCP విమర్శించింది. ‘విశాఖలో దొరికిన డ్రగ్స్ సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్ సంస్థకు చెందినది. దాని ఎండీ కూనం వీరభద్రరావు కాగా డైరెక్టర్ కూనం కోటయ్య చౌదరిగా గుర్తించారు. ఇప్పుడు చెప్పు చంద్రబాబూ.. వీళ్లు మీ పార్టీకి చెందినవారు కాదా? వీళ్లు ఎవరికి బంధువులు? నీకా నీ కొడుక్కా?’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

News March 21, 2024

2022లో 62 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్: UN

image

ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఏటా భారీగా పెరుగుతుండటంపై UN ఆందోళన వ్యక్తం చేసింది. 2022లో 62 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తి అయిందని.. ఇది 6వేల ఐఫిల్ టవర్స్‌తో సమానమని పేర్కొంది. ఏటా ఈ-వేస్ట్ 2.6 మిలియన్ టన్నుల చొప్పున పెరుగుతోందని 2030 నాటికి ఆ మొత్తం 82 మిలియన్ టన్నులకు చేరుతుందని హెచ్చరించింది. ఈ వ్యర్థాలు ఎక్కువగా ఈ-సిగరెట్స్, గృహోపకరణాల నుంచే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపింది.

News March 21, 2024

షోలాపూర్ ఎంపీ అభ్యర్థిగా సుశీల్ కుమార్ కూతురు

image

కాంగ్రెస్ 57 మంది ఎంపీ అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణితి షిండేకు చోటు కల్పించింది. ఆమెను షోలాపూర్ నుంచి బరిలో నిలిపింది. ప్రణితి గతంలో మహారాష్ట్ర PCC చీఫ్‌గా పనిచేశారు. షోలాపూర్ సిటీ సెంట్రల్ నుంచి మూడుసార్లు MLAగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధరి బెహరంపుర్(బెంగాల్) నుంచి పోటీ చేస్తున్నారు.

News March 21, 2024

2 నెలల్లో ఇద్దరు సీఎంలు అరెస్ట్

image

సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. అవినీతి కేసుల్లో రెండు నెలల వ్యవధిలో ఇద్దరు సీఎంలు అరెస్టయ్యారు. భూకుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను జనవరి 31న ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో ఇవాళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

News March 21, 2024

ఫ్యూచర్ గేమింగ్ సంస్థ నుంచి ఎక్కువ ఫండ్స్ ఈ పార్టీలకే!

image

అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రై.లి. ఏ పార్టీకి ఎంత విరాళమిచ్చిందో వెల్లడైంది. 2020 నుంచి 2024 వరకు ఈ సంస్థ రూ.1,368 కోట్ల ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది. అందులో TMCకి రూ.542 కోట్లు, DMKకు రూ.503 కోట్లు, YSRCPకి రూ.154 కోట్లు, BJPకి రూ.100 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.50 కోట్లు అందాయి. భారత లాటరీ పరిశ్రమలో ఈ సంస్థ టర్నోవర్ రూ.1.65 లక్షల కోట్లు.

News March 21, 2024

కేజ్రీవాల్ అరెస్టు అందుకేనా?

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్ల సమగ్ర వివరాలను వెల్లడించడానికి, ఈ అరెస్టుకు సంబంధం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. బాండ్ల విషయాన్ని మీడియా హైలైట్ చేయకుండా ఉండేందుకే ఢిల్లీ సీఎంను అరెస్టు చేశారని అనుమానిస్తున్నారు. కాగా, బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు భారీగా విరాళాలు వచ్చాయని మార్చి 14న తెలియగా, మార్చి 15న MLC కవితను అరెస్టు చేశారు.

News March 21, 2024

కేజ్రీవాల్‌ను కవితతో కలిపి విచారిస్తారా?

image

కొందరు ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చిందన్నది ED ఆరోపణ. ‘సౌత్ గ్రూప్ అనే పేరుతో కవిత, శరత్‌చంద్రారెడ్డి తదితరులు సిండికేట్‌గా ఏర్పడి ఈ పాలసీ ద్వారా లబ్ధి పొందారు. అందుకు ఆప్ ప్రభుత్వానికి లంచాలు ముట్టాయి’ అని వాదిస్తోంది. ఈ కేసులో నిందితులుగా చెబుతున్న కేజ్రీవాల్‌, కవిత, సిసోడియాను కలిపి విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News March 21, 2024

ఢిల్లీ సీఎం ఆయనే.. మంత్రి ప్రకటన

image

ఢిల్లీకి అరవింద్ కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మంత్రి, ఆప్ సీనియర్ నేత అతిశీ తెలిపారు. కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని వ్యాఖ్యానించారు. సీఎంను ఈడీ అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని ఆమె చెప్పారు. దీనిపై ఈరోజు రాత్రే విచారణ జరపాలని కోరామన్నారు. కాగా, లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌ను రెండు గంటల పాటు విచారించిన ఈడీ.. కాసేపటి క్రితం అరెస్టు చేసింది.