India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: సంగారెడ్డి జిల్లాలో SB కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు <<12982731>>ఘటనపై<<>> సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలానికి వెళ్లి సహాయ చర్యలు పర్యవేక్షించాలని ఫైర్ డీజీ నాగిరెడ్డిని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి సూచించారు. మంత్రులు దామోదర, కొండా సురేఖ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.

ఆర్సీబీ లాంటి జట్లు ఎప్పటికీ ట్రోఫీ గెలవలేవని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ‘రూ.కోట్లు వెచ్చించి తీసుకున్న ఆర్సీబీ స్టార్ ఆటగాళ్లు గ్రౌండ్‌లో కంటే డగౌట్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఇలా జరుగుతున్నంత కాలం ఆర్సీబీ రాత మారదు. అలాగే ఆ జట్టు బౌలర్లు ఎప్పుడూ అత్యధికంగా పరుగులు ఇస్తుంటారు. ఆర్సీబీ కష్టాల్లో ఉన్న సమయంలో ఒక్క స్టార్ ఆటగాడు కూడా రాణించడం నేను చూడలేదు’ అని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్, బీజేపీలకు దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు ఉన్నా ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో ఉనికిని నిలుపుకునేందుకు శ్రమిస్తున్నాయి. అక్కడి తొలి లోక్‌సభ ఎన్నికల (1977) తర్వాత కాంగ్రెస్ గెలుపు రుచి చూడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఖాతా తెరవలేదు. BJP ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. అధికారం మాట అటుంచితే ఈసారి ఈ పార్టీలు కనీసం ఒక్క సీటు అయినా గెలుస్తాయా? అనేది చర్చనీయాంశమైంది.
<<-se>>#Elections2024<<>>

ఏపీని గాడిలో పెట్టడానికే మూడు పార్టీలు జట్టుగా వచ్చాయని చంద్రబాబు అన్నారు. ‘ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అన్నారు.. చేశారా? బాబాయ్‌ను గొడ్డలితో చంపి సానుభూతితో గెలిచిన వ్యక్తి జగన్. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులే. వైసీపీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వందకు వంద శాతం మనమే గెలుస్తున్నాం’ అని కోనసీమ జిల్లా రావులపాలెం ప్రజాగళం సభలో అన్నారు.

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన MRI స్కానర్ నుంచి మనిషి మెదడు ఫొటో విడుదలైంది. ఫ్రాన్స్ పరిశోధకులు 2021లో ఓ గుమ్మడికాయను స్కాన్ చేయడానికి ఈ యంత్రాన్ని ఉపయోగించారు. తాజాగా మనుషుల మెదళ్లను స్కాన్ చేసేందుకు అనుమతి లభించింది. ఇది సాధారణ MRIల కంటే 10రెట్లు ఖచ్చితత్వంతో స్కాన్ చేస్తుందని చెబుతున్నారు. దీంతో మెదడు సమస్యలను సులభంగా గుర్తించి చికిత్స అందించవచ్చని అభిప్రాయపడుతున్నారు.

రేప్ కేసు బాధితురాలి గాయాలు చూసేందుకు బట్టలు విప్పమని మెజిస్ట్రేట్ ఆదేశించిన ఘటన రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లాలో చోటుచేసుకుంది. గత నెల 19న తనపై అత్యాచారం జరిగిందని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై జిల్లా కోర్టులో విచారణ సందర్భంగా జడ్జి బట్టలు విప్పి గాయాలు చూపించాలని ఆదేశించారు. నిరాకరించిన ఆ యువతి జడ్జిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఢిల్లీతో మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచింది. విశాఖలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.
★ ప్లేయింగ్ XI
DC: పృథ్వీ షా, వార్నర్, మిచెల్ మార్ష్, పంత్, స్టబ్స్, అక్షర్, సుమిత్ కుమార్, రసిఖ్, అన్రిచ్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
KKR: ఫిలిప్ సాల్ట్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, రఘువంశీ, రస్సెల్, నరైన్, రమణదీప్, స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

సీతారామం సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస విజయాలతో దూసుకుపోతున్న మృణాల్ ఠాకూర్‌కు భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చేయబోయే ఓ సినిమాలో నటించే అవకాశం ఆమెకు వచ్చినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ఈనెల 5న థియేటర్లలో విడుదల కానుంది.

AP: రాష్ట్రంలోని ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల ఆస్తి కల్పించామని సీఎం జగన్ అన్నారు. ‘రూ.3 వేల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. ఎన్నో పథకాలతో అక్కచెల్లెమ్మలకు అండగా ఉన్నాం. మహిళలకు ఇచ్చిన ఒక్కో ఇంటి విలువ రూ.లక్షల్లో ఉంటుంది. ఇప్పటివరకు రూ.2.70 లక్షల కోట్లు మీ ఖాతాల్లో నేరుగా వేశాం. 130 సార్లు మీ బిడ్డ జగన్ బటన్ నొక్కారు. నా కోసం రెండు సార్లు బటన్లు నొక్కండి’ అని ఆయన పేర్కొన్నారు.

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. ఈనెల 15న మెదక్ జిల్లాలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. కాగా కేసీఆర్ ఇటీవల మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని ప్రకటించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి నీలం మధు బరిలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.