News July 31, 2024

ఇన్ఫోసిస్‌ రూ.32వేల కోట్ల పన్ను ఎగవేత?

image

టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రూ.32వేల కోట్ల పన్ను ఎగవేసిందంటూ ఆ సంస్థపై GST అధికారులు దర్యాప్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 2017-2022 మధ్య ఇన్ఫోసిస్ IGST చెల్లించలేదని, ఆ సంస్థ విదేశాల్లోనూ క్లయింట్స్ కోసం బ్రాంచీలు ఏర్పాటు చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST పేర్కొంది. ఇప్పటికే DGGI నుంచి ఇన్ఫోసిస్‌కు నోటీసు అందినట్లు సమాచారం. దీనిపై ఆ సంస్థ ఇంకా స్పందించలేదు.

News July 31, 2024

భూమిపై నీటి సృష్టి.. ‘సల్ఫర్’ కీ రోల్

image

మానవాళికి, జంతు, వృక్షజాలాలకు నీరే(H2O) ఆధారం. ఇందులో ఆక్సిజన్, హైడ్రోజన్ ప్రధాన మూలకాలు. భూమి ఏర్పడిన తర్వాత నీరు తయారవడంలో సల్ఫర్ కీలక పాత్ర పోషించినట్లు తాజాగా పరిశోధకులు తేల్చారు. నీరు లేని తొలినాళ్లలో హైడ్రోజన్‌ సూర్యుడి వేడిని తట్టుకునేందుకు సల్ఫర్‌‌తో కలిసి ఉండేదట. అలా తట్టుకొని ఉన్న హైడ్రోజన్ కాలక్రమేణా సల్ఫర్ నుంచి విడిపోయి ఆక్సిజన్‌‌తో కలవడంతో నీరు ఆవిర్భవించినట్లు సైంటిస్టులు తెలిపారు.

News July 31, 2024

రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పిలుపు

image

TG: సీఎం రేవంత్ దిష్టి బొమ్మల దహనానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిష్టి బొమ్మలను రేపు దహనం చేయాలని పిలుపునిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. రేవంత్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

News July 31, 2024

ALERT: మరణాల్లో కరెంట్ ‘షాక్‌’

image

దేశంలో కరెంట్ షాక్‌ వల్ల నమోదవుతున్న మరణాలపై NCRB(నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) షాకింగ్ వివరాలు వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం 2015-2020 మధ్య ఏకంగా 72,000 మంది కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. అంటే ఏడాదికి సగటున 12,000 మంది, డైలీ 32 మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నమాట. ఇటీవల UPలో ఓ UPSC అభ్యర్థి హాస్టల్ వద్ద వర్షపు నీటిలో కరెంట్‌షాక్‌కు గురై మరణించిన ఘటన అందర్నీ కలచివేసింది.

News July 31, 2024

నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్‌గా జో రూట్

image

ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాకింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్‌గా నిలిచారు. 872 పాయింట్లతో రూట్ అగ్రస్థానంలో ఉండగా న్యూజిలాండ్ బ్యాటర్ విలియమ్సన్(859) రెండో స్థానంలో ఉన్నారు. 3, 4, 5 స్థానాల్లో బాబర్ ఆజం(PAK), మిచెల్(NZ), స్మిత్(AUS) ఉన్నారు. ఇక 6వ స్థానంలో రోహిత్ శర్మ, 7లో హ్యారీ బ్రూక్(ENG), 8లో జైస్వాల్, 9లో కరుణరత్నే(SL), 10వ స్థానంలో కోహ్లీ ఉన్నారు.

News July 31, 2024

పిన్నెల్లికి మరోసారి షాక్.. బెయిల్ నిరాకరణ

image

AP: పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి చుక్కెదురైంది. గుంటూరు జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. గతంలో సెషన్స్ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయంలో కారంపూడి సీఐ, టీడీపీ ఏజెంట్‌పై దాడి చేశారనే అభియోగాలతో పిన్నెల్లిపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

News July 31, 2024

మోసానికి ప్రతిరూపం సబిత: మీడియా చిట్‌చాట్‌లో రేవంత్

image

TG: సబితా ఇంద్రారెడ్డి తనను కాంగ్రెస్‌లోకి రమ్మని, తర్వాత ఆమె బీఆర్ఎస్‌లోకి మారారని మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ అన్నారు. ఆమె మోసానికి ప్రతిరూపం అని వ్యాఖ్యానించారు. ‘నేను సభలో సబిత పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆమె ఆవేదనలో అర్థం లేదు. ఆమె మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా కేసీఆర్ సభకు రావాలి’ అని పేర్కొన్నారు. సభలో BRS సభ్యులకు ఇవ్వాల్సిన సమయం ఇచ్చామని తెలిపారు.

News July 31, 2024

తల్లి నగలపై బ్రిటన్ రాజకుటుంబంలో చిచ్చు

image

దివంగత బ్రిటన్ ప్రిన్సెస్ డయానా నగల విషయంలో ఆమె వారసులు విలియం, హ్యారీ మధ్య చిచ్చు రగిలిందని రచయిత రాబ్ జాబ్సన్ ‘కేథరిన్, ది ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’ పుస్తకంలో తెలిపారు. ‘నటి మేఘన్ మార్కెల్‌ను హ్యారీ పెళ్లి చేసుకోవడం రాజకుటుంబానికి అస్సలు ఇష్టం లేదు. అందుకే తమ తల్లి నగల్ని మేఘన్‌కు ఇవ్వనని విలియం తేల్చిచెప్పారు. ఆ విభేదాల కారణంగానే హ్యారీ దంపతులు రాచరికాన్ని వదిలేసుకున్నారు’ అని వెల్లడించారు.

News July 31, 2024

సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, పొన్నవోలుకు హైకోర్టు నోటీసులు

image

AP: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, మాజీ అదనపు AG పొన్నవోలు సుధాకర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. YCP హయాంలో చంద్రబాబుపై నమోదైన స్కిల్ కేసు దర్యాప్తులో ఉండగానే వీరు మీడియా సమావేశం నిర్వహించారని హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రెస్‌మీట్ పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారని పిటిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు విచారణను SEP 9కి వాయిదా వేసింది.

News July 31, 2024

కేసీఆర్‌కు బాధ్యత లేదు.. మీడియా చిట్‌చాట్‌లో రేవంత్

image

TG: అధికారం లేకపోతే ప్రజలు కూడా అవసరం లేదన్నట్టు కేసీఆర్ వైఖరి ఉందని మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ అన్నారు. ‘కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? అధికార పక్షానికి మేం సరిపోతాం అని కేటీఆర్ అంటున్నారు. మరి కేసీఆర్ ఎందుకు? ఫ్లోర్ లీడర్‌గా కేటీఆర్ ఉండొచ్చు కదా. కేసీఆర్ బాధ్యత లేని వ్యక్తి’ అని విమర్శించారు. సభ ప్రజాస్వామ్యబద్ధంగానే నడుస్తోందని తెలిపారు.