India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ‘పుష్ప-2’ను లీకులు వెంటాడుతున్నాయి. సినిమా షూటింగ్‌ను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాజాగా క్లైమాక్స్ ఫైట్ సీన్ షూటింగ్ అంటూ ఓ వీడియో నెట్టింట ప్రత్యక్షమైంది. దాన్ని డిలీట్ చేయాలని, లీకు వీరులపై చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కాగా, డిసెంబర్ 6న ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కానుంది.

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన, నిరసనల మధ్యే ద్రవ్య వినిమయ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. సీఎం రేవంత్ తన <<13745152>>వ్యాఖ్యలను<<>> వెనక్కి తీసుకోవాలని, ఎమ్మెల్యే సబితకు క్షమాపణలు చెప్పాలని పోడియం ఎదుట బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో సభాపతి అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ట్రైనీ IAS పూజా ఖేడ్కర్ ఎంపికను UPSC రద్దు చేసింది. భవిష్యత్తులోనూ పరీక్షలు రాసే అవకాశం లేకుండా ఆమెను లైఫ్ టైం డిబార్ చేస్తున్నట్లు ప్రకటించింది. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసేందుకు ఫేక్ డిజబిలిటీ, OBC సర్టిఫికెట్లను సమర్పించినందుకు ఆమెపై జులై 19న కేసు నమోదైంది. ట్రైనీ IASగా ఉండగానే అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో ఆమె వార్తల్లోకి ఎక్కారు.

భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ పుట్టిన రోజునే అరుదైన రికార్డు సృష్టించారు. 1998 జులై 31న హైదరాబాద్‌లో పుట్టిన ఈ యువ సంచలనం పారిస్ ఒలింపిక్స్‌లో సింగపూర్ ప్లేయర్ జెంగ్‌పై 4-2 తేడాతో సంచలన విజయం సాధించారు. తద్వారా ఒలింపిక్స్‌లో 16వ రౌండ్‌కు అర్హత సాధించిన రెండో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచారు. నిన్న మనికా బాత్రా 16వ రౌండ్‌కు అర్హత సాధించిన తొలి ప్లేయర్‌గా నిలిచారు. <<-se>>#Olympics2024<<>>

ఢిల్లీ రావుస్ IAS కోచింగ్ సెంటర్లో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన <<13727844>>ఘటనలో<<>> ఓ కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వరదలో అతివేగంగా వెళ్లడంతోనే అలలు ఏర్పడి బేస్మెంట్‌లోకి నీళ్లు వెళ్లాయని అన్నారు. అయితే అరెస్టును డ్రైవర్ భార్య ప్రశ్నించారు. కారును సేఫ్ ప్లేస్‌లో ఆపేందుకు సాధారణ వేగంతోనే వెళ్లాడని, వీడియోలో అది కనిపిస్తోందన్నారు. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమన్నారు. ఈ అరెస్టుపై మీ కామెంట్?

AP: సీఎం చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు, పలువురు ఎంపీటీసీలు పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో కలిసి అమరావతి వెళ్లిన వీరికి చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో మరికొంత మంది టీడీపీలో చేరుతారని శ్రీకాంత్ తెలిపారు.

ఒలింపిక్స్-2024: తెలుగమ్మాయి శ్రీజ ఆకుల మరోసారి సత్తా చాటారు. టేబుల్ టెన్నిస్ ఉమెన్స్ సింగిల్స్ రౌండ్-32లో విజయం సాధించారు. సింగపూర్ ప్లేయర్ జియాన్ జెంగ్‌పై గెలిచి ప్రి-క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. ఫస్ట్ గేమ్ ఓడిన శ్రీజ.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని 4-2 తేడాతో జెంగ్‌ను చిత్తు చేశారు.
<<-se>>#Olympics2024<<>>

ఢిల్లీలోని రావూస్ కోచింగ్ సెంటర్ <<13723684>>ఘటన<<>>లో ముగ్గురు విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. ప్రాణాలతో బయటపడిన రిషబ్ అనే విద్యార్థి ప్రమాద సమయంలోని పరిస్థితిని మీడియాతో పంచుకున్నారు. ‘వరద నీటిలో మునిగి లైబ్రరీలో ఉన్న మేమంతా చనిపోతాం అనుకున్నాం. కానీ తన్య మాత్రం అందరికీ ధైర్యం చెప్పింది. మానవహారంగా ఏర్పడి బయటకెళ్దామని సూచించింది. కానీ, అది కుదరలేదు. చివరికి ఆమె నీటిలో మునిగి చనిపోయింది’ అని తెలిపారు.

AP: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. జూరాల, సుంకేసుల నుంచి 2,91,003 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 212 TMCల నీటి నిల్వ ఉండగా నీటి మట్టం 884.50 అడుగులుగా ఉంది. 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,22,768 క్యూసెక్కులు, శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ 60,232 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు.

TG: అసెంబ్లీలో సీఎం రేవంత్‌ను కేటీఆర్ ఏకవచనంతో సంబోధించడంపై అధికార పక్ష ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కేటీఆర్ తన మాటలను వెనక్కి తీసుకున్నారు. ‘రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడు. 18 ఏళ్ల నుంచి తెలుసు. గత పదేళ్లుగా మా మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. చిన్న వయసులోనే సీఎం అయ్యారు. ఆయన అదృష్టవంతుడు’ అని అన్నారు.
Sorry, no posts matched your criteria.