News July 31, 2024
శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద

AP: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. జూరాల, సుంకేసుల నుంచి 2,91,003 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 212 TMCల నీటి నిల్వ ఉండగా నీటి మట్టం 884.50 అడుగులుగా ఉంది. 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,22,768 క్యూసెక్కులు, శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ 60,232 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు.
Similar News
News January 19, 2026
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ నేడు

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 19, 2026
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

జనవరి 19వ తేదీన కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.