India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు BRSలోకి వెళ్తారనే ప్రచారాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. ‘వెంకటరావు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. పాత పరిచయం కాబట్టి BRS వాళ్లను కలిసి ఉంటారు. మా దగ్గరకు వచ్చిన వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాంగ్రెస్ దగ్గర ప్రేమ రాజకీయాలు ఉంటాయి. వెంకటరావే కాదు ఎవరూ ఎక్కడికీ వెళ్లరు’ అని వ్యాఖ్యానించారు.

AP: వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పవన్ కళ్యాణ్ మీద గుంటూరులో నమోదైన కేసు విచారణలో హైకోర్టు స్టే విధించింది. ఈ కేసును క్వాష్ చేయాలని పవన్ తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనితో పాటు ఇలాంటి మరికొన్ని కేసులపై ప్రభుత్వం రివిజన్ చేస్తోందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో కేసు విచారణలో హైకోర్టు స్టే విధించింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

టీమ్ ఇండియాతో వన్డే సిరీస్‌కు శ్రీలంక జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఆగస్టు 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి.
శ్రీలంక టీమ్: చరిత్ అసలంక (C), నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుశల్ మెండిస్, సమరవిక్రమ, కమిందు మెండిస్, లియనాగె, మధుష్క, హసరంగ, వెల్లలాగె, కరుణరత్నె, తీక్షణ, ధనంజయ, మధుశంక, పతిరణ, అసిత ఫెర్నాండో

ట్యాక్స్ పేయర్లు ITR ఫైల్ చేసేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఫైల్ చేశాక 4-5వారాల్లో రీఫండ్ ట్యాక్స్ పేయర్ల అకౌంట్లలో జమవుతుంది. ఈ-వెరిఫికేషన్ పూర్తయితేనే రీఫండ్ వస్తుంది. PANలో ఉన్న వివరాల్లో తప్పులున్నా, బ్యాంక్ అకౌంట్ ముందుగా ధ్రువీకరించకపోయినా రీఫండ్ రాదు. రీఫండ్ రాకపోతే IT డిపార్ట్‌మెంట్ నుంచి మీకు ఏదైనా ఈమెయిల్ వచ్చిందేమో చెక్ చేసుకోవాలి. ఏమైనా లోపాలు ఉన్నట్లు పేర్కొన్నారేమో గమనించాలి.

ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ భజన్‌కౌర్ ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఇవాళ జరిగిన రెండు వరుస గేముల్లో విజయం సాధించారు. తొలుత ఇండోనేషియన్ ఆర్చర్‌పై 7-3 తేడాతో గెలిచి 32 రౌండ్‌కు చేరుకున్న ఆమె, ఆ తర్వాత పోలిష్ ఆర్చర్‌పై 6-0తో నెగ్గి రౌండ్ 16కి అర్హత సాధించారు. #OLYMPICS2024

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘దేవర’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ‘దేవర’ అని ట్వీట్ చేయగా అతి త్వరలోనే అని టీమ్ దానికి రిప్లై ఇచ్చింది. ఈ సాంగ్ రొమాంటిక్ మెలోడీగా ఉంటుందని సమాచారం. ఇప్పటికే రిలీజైన ఫియర్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. కాగా సెప్టెంబర్ 27న ‘దేవర’ రిలీజ్ కానుంది.

ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉన్న కాల్ రికార్డింగ్ ఆప్షన్ మరికొద్ది రోజుల్లో యాపిల్ యూజర్లు పొందనున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. Apple iOS 18.1 వెర్షన్‌లో కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంచారట. ప్రస్తుతం ఇది ఎంపిక చేసిన యూజర్లకు (డెవలపర్స్) మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, రికార్డ్ చేస్తున్నట్లు కాలర్‌కు తెలియజేస్తుంది. దీంతోపాటు రికార్డయిన ఆడియోను టెక్స్ట్ రూపంలో మార్చే సదుపాయం కూడా ఉంటుందట.

ఒలింపిక్స్-2024: భారత బ్యాడ్మింటన్ స్టార్లు చిరాగ్-సాత్విక్ జోడీ మరోసారి అదరగొట్టింది. ఇప్పటికే క్వార్టర్స్ చేరుకున్న ఆ జోడీ తాజాగా ఇండోనేషియన్లపై గెలిచి టేబుల్ టాపర్లుగా నిలిచారు. నెక్స్ట్ రౌండ్‌లో ఇది కీలకం కానుంది.
<<-se>>#Olympics2024<<>>

TG: స్కిల్ యూనివర్సిటీ బిల్లును ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటుతో యువతకు అధునాతన పరిజ్ఞానం అందించడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా ఉద్యోగ కల్పన దిశగా ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పారు. ఈ యూనివర్సిటీ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు కానుంది.

కర్ణాటకలో బీరు ధరలు రూ.10 నుంచి రూ.20 వరకు పెరిగాయి. గత 17 నెలల్లో మద్యం ధరలు ఎగబాకడం ఇది 5వ సారి. ముడి సరుకుల ధరల్లో మార్పుల వల్లే రేట్లను పెంచినట్లు కంపెనీలు తెలిపాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారు కొలువుదీరినప్పటి నుంచి వాణిజ్య వాహనాలపై రవాణా సెస్, స్టాంప్ డ్యూటీ, పెట్రోల్ లీటర్‌పై రూ.3, నందిని పాల ధరలు పెరిగాయి. 5 గ్యారంటీల అమలుకు నిధుల కొరతే రేట్ల పెరుగుదలకు కారణమని వార్తలొస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.