India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అగ్నిపథ్‌పై రాహుల్, రాజ్‌నాథ్ మధ్య సంవాదం జరిగింది. పింఛన్ల గురించి ప్రస్తావిస్తూ ఈ పథకం జవాన్లు, వారి కుటుంబాల ఆర్థిక రక్షణ, గౌరవాన్ని లాగేసుకుందని రాహుల్ ఆరోపించారు. ఇది యువతపై ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబిస్తోందన్నారు. ప్రతిపక్ష నేత బడ్జెట్‌పై అపోహలు సృష్టిస్తున్నారని రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. అగ్నిపథ్‌పై ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదన్నారు.

‘<<13731964>>హల్వా<<>>’ వేడుక BJP, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. 2024 కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన హల్వా వేడుకలో NDA సర్కార్ దళిత, ఆదివాసీలకు చోటు కల్పించలేదని కాంగ్రెస్ విమర్శించింది. సంబంధిత ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దానికి BJP శ్రేణులు బదులిస్తూ గతంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు హల్వా వేడుకలో ఎంత మంది దళిత, ఆదివాసీలకు చోటు కల్పించారని ప్రశ్నిస్తున్నాయి.

పారిస్ ఒలింపిక్స్ సవ్యంగా సాగడం డౌటే. సోమవారం ఉదయం ఫ్రాన్స్‌లో SFR, Bouygues టెలికం లైన్లను కొందరు నాశనం చేశారు. దీంతో మొబైల్, టెలీ, ఫైబర్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది. కనెక్టివిటీ పరంగా ఒలింపిక్స్‌పై దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. ఓపెనింగ్ సెర్మనీకి కొన్ని గంటల ముందే 3 హైస్పీడ్ ట్రైన్ రూట్లను కొందరు టార్గెట్ చేశారు. ఇక 5 వేర్వేరు ప్రాంతాల్లో తమ టెలికం లైన్లను కట్ చేశారని SFR తెలిపింది.

TG: వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి BRS అంగీకరించిందని CM రేవంత్ సభను తప్పుదోవ పట్టించారని MLA హరీశ్‌రావు అన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలోనూ రేవంత్ అబద్ధాలు చెప్పారన్నారు. అంతటితో ఆగకుండా అమరవీరులను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం డిఫెన్స్‌లో పడగానే ఏదో ఓ కాగితం తెచ్చి సభను తప్పుదోవపట్టిస్తున్నారని, సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేయాలని భావిస్తున్నామన్నారు.

తండ్రీకూతుళ్ల మధ్య ఉండే బంధం ఎంతో ప్రత్యేకం. కూతుళ్ల కోసం తండ్రులు ఏమైనా చేస్తుంటారు. తన కూతురు రాహా కపూర్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ఏళ్లుగా ఉన్న అలవాటును వదులుకున్నారు. తనకు 17 ఏళ్లు ఉన్నప్పటి నుంచి సిగరెట్ తాగుతున్నానని, రాహా హెల్తీగా ఉండేందుకు ధూమపానాన్ని వదిలేసినట్లు తెలిపారు. కూతురు పుట్టాక మళ్లీ పుట్టానని, తండ్రిగా తాను ఆరోగ్యంగా ఉండాలని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

తెలంగాణలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పలుచోట్ల బలమైన గాలులు వీచే అవకాశం ఉందంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.

AP: భూ యజమానులకు ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. వాటిపై పార్టీల రంగులు, నేతల ఫొటోలు ఉండకూడదన్నారు. ప్రభుత్వ రాజముద్రతో పాసు పుస్తకాల నమూనాను విడుదల చేశారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం లాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ అరికట్టేలా కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా? ఎటువంటి చట్టాలు తేవాలి? అనే అంశాలపై చర్చించారు.

మారుతి తెరకెక్కిస్తోన్న ‘రాజా సాబ్’ సినిమా నుంచి నిన్న రిలీజైన పోస్టర్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మెరూన్ రంగు సూట్‌తో కనిపించారు. దీంతో ఆ కలర్ డ్రెస్సులతో ప్రభాస్ నటించిన సినిమాలను ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు. ‘బాహుబలి’తో పాటు ‘కల్కి’ సినిమాలోనూ ప్రభాస్ మెరూన్ రంగు డ్రెస్ ధరించగా రెండూ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దీంతో ఇదే ట్రెండ్ ‘రాజా సాబ్’లోనూ కంటిన్యూ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

విద్య, ఉపాధిలో 75% రిజర్వేషన్లు చెల్లవన్న బిహార్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. రాష్ట్ర Govt వేసిన 10 పిటిషన్లను విచారిస్తామంది. గత నవంబర్లో నితీశ్ Govt SC, ST, BCల కోటాను 50-65%కు పెంచింది. EWS కోటా 10% దీనికి అదనం. ఇది ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం సమానత్వపు హక్కును ఉల్లంఘిస్తోందన్న పౌరుల పిటిషన్లతో హైకోర్టు పైతీర్పు ఇచ్చింది. ఇందిరా సాహ్ని కేసులో సుప్రీం తీర్పును ఉటంకించింది.

AP: మదనపల్లి ఫైళ్ల దహనం <<13712155>>కేసులో<<>> ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మాజీ ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Sorry, no posts matched your criteria.