News July 24, 2024

పస లేదు.. అధికారపక్షమే.. ప్రతిపక్షమైన వేళ!

image

ఏపీ అసెంబ్లీ సమావేశాలు చప్పగా సాగుతున్నాయి. ప్రతిపక్షం లేకపోవడమే ఇందుకు కారణం. గత పదేళ్లలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల హయాంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్‌‌కూ వైసీపీ హాజరు కాలేదు. కీలకమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై ప్రతిపక్షం లేకుండానే చర్చ సాగింది. అధికారపక్ష సభ్యులే ప్రతిపక్షమై ప్రశ్నలు సంధించగా మంత్రులు సమాధానమివ్వడంతో చర్చల్లో పస కనిపించడం లేదు.

News July 24, 2024

బడ్జెట్‌లో ఇతర రాష్ట్రాలను పట్టించుకోరా?: శ్రీధర్ బాబు

image

దేశంలోనే తెలంగాణ అతిపెద్ద గ్రోత్ ఇంజిన్ అయినా విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సినవేవీ ప్రకటించలేదని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో దుయ్యబట్టారు. ‘ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను పట్టించుకోరా? ఇలాగే వ్యవహరిస్తే మీరు ఆశించిన వికసిత్ భారత్ సాధ్యమా? పర్యాటకాభివృద్ధికి సహకరించాలని ఢిల్లీ పెద్దలను కోరాం. కానీ భద్రాచలం, రామప్ప, వేములవాడ, యాదాద్రి గురించి ప్రస్తావనే లేదు’ అని ఫైర్ అయ్యారు.

News July 24, 2024

ప్రభుత్వానికి రూ.26,000 కోట్ల లాస్: CBDT ఛైర్మన్

image

పన్ను స్లాబులు సవరించడం వల్ల మిడిల్ క్లాస్ ప్రజలు రూ.17500 వరకు ఆదా చేసుకోవచ్చని CBDT ఛైర్మన్ రవి అగర్వాల్ అన్నారు. ‘తక్కువ పన్ను స్లాబుల పరిధిని రూ.3-7 లక్షలు, రూ.7-10 లక్షలకు పెంచారు. బెనిఫిట్ వల్లే ట్యాక్స్ పేయర్లలో 65% కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50000-రూ.75000కు పెంచడంతో ప్రభుత్వం ప్రత్యక్ష పన్నుల్లో రూ.29000 కోట్లు వదులుకోవాల్సి వస్తోంది’ అని చెప్పారు.

News July 24, 2024

అందుకే ఏపీకి ఎక్కువ నిధులు: శ్రీధర్ బాబు

image

TG: ఎన్డీయేకు మద్దతిస్తున్నారు కాబట్టే బడ్జెట్‌లో ఏపీకి ఎక్కువ నిధులు కేటాయించారని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో విమర్శించారు. ‘ఏపీకి కేంద్రం ఏం ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. కానీ విభజన చట్టం ఇద్దరికీ ఒక్కటే. తెలంగాణకు ఎందుకు కేటాయింపులు చేయలేదు? రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఇక్కడి ప్రజల ప్రయోజనాలను అస్సలు పట్టించుకోకుండా సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీశారు’ అని ఆయన మండిపడ్డారు.

News July 24, 2024

VD12లో విజయ్ దేవరకొండ లుక్ లీక్

image

గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న VD12 సినిమాలోని రౌడీబాయ్ విజయ్ దేవరకొండ లుక్ లీక్ అయింది. బీచ్ ఒడ్డున జరిగిన షూటింగ్‌లో విజయ్ బైక్‌పై కూర్చున్న ఫొటో నెట్టింట ప్రత్యక్షమైంది. షార్ట్ హెయిర్‌తో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో VD అదిరిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగుతుండగా విజయ్ పాత్రకు సంబంధించిన సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అక్కడున్నవారు ఫొటో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో వైరలవుతోంది.

News July 24, 2024

సింగరేణి ప్రైవేటీకరణ ఉండదు: కిషన్ రెడ్డి

image

సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై సమాధానమిచ్చిన కిషన్ రెడ్డి.. దేశంలో ఏ బొగ్గు గనినీ ప్రైవేటుపరం చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. ప్రైవేటీకరణ చేయాలంటే 51% వాటా ఉన్న రాష్ట్ర నిర్ణయమే కీలకమని తెలిపారు. సింగరేణికి కేంద్రం మద్దతు ఉంటుందన్నారు.

News July 24, 2024

అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో భారత్‌ స్థానం ఇదే!

image

అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్ 82వ స్థానంలో నిలిచింది. మన పాస్‌పోర్టుతో 58 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. హెన్లీ పాస్‌పోర్టు సూచీ ప్రకారం.. 195 దేశాలకు వీసా లేకుండా వెళ్లే వీలు కల్పించే సింగపూర్ పాస్‌పోర్ట్ అగ్రస్థానంలో నిలిచింది. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. పాకిస్థాన్ 100వ స్థానంలో ఉండగా, అఫ్గానిస్థాన్ 103వ స్థానంతో చివర్లో ఉంది.

News July 24, 2024

BUDGET: అందుకే దేశం వదిలి వెళుతున్నారని విమర్శలు

image

ట్యాక్స్ విషయంలో కేంద్రం తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. బడ్జెట్‌తో అసంతృప్తికి గురైన ఓ యూజర్ ‘నేను సంపాదించినా, ఖర్చు చేసినా, ఈరెండూ కాకుండా పెట్టుబడి పెట్టినా ట్యాక్స్ వేస్తారు. ట్యాక్స్‌పై మళ్లీ సెస్ వేస్తారు’ అని ట్వీట్ చేశారు. దానిపై కొందరు స్పందిస్తూ ఈ ట్యాక్స్‌ల వల్లే చాలామంది దేశాన్ని విడిచివెళ్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్‌కూ మద్దతు వస్తోంది.

News July 24, 2024

పెళ్లికి ముందు జయాబచ్చన్‌కు అమితాబ్ షరతులు!

image

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన సతీమణి జయా బచ్చన్‌కు పెళ్లికి ముందు కండీషన్స్ పెట్టారట. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో జయాబచ్చన్ పెళ్లి నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ‘పెళ్లి తర్వాత సినిమాలు చేయడానికి ఆయన అనుమతిచ్చారు కానీ, రోజూ షూటింగ్స్‌కు వెళ్లడానికి వీల్లేదన్నారు. కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మంచి ప్రాజెక్టులు ఎంచుకొని, సరైన మనుషులతో వర్క్ చేయాలని సూచించారు’ అని తెలిపారు.

News July 24, 2024

రేషన్ కార్డుల విషయంలో ఎవరూ ఇబ్బంది పడట్లేదు: ఉత్తమ్

image

TG: గతంలో ఉన్న రేషన్ కార్డులు కొనసాగుతున్నాయని, వాటిపై ఎలాంటి ప్రయోజనాలు అందాయో అవన్నీ ఇప్పుడూ అందుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డుల విషయంలో ఎవరూ ఇబ్బంది పడటం లేదని, ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి రాలేదని శాసనమండలిలో మంత్రి చెప్పారు. పథకాలకు లబ్ధిదారుల సంఖ్యను పెంచేందుకే తాము కృషి చేస్తున్నామన్నారు.