News July 24, 2024
పస లేదు.. అధికారపక్షమే.. ప్రతిపక్షమైన వేళ!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు చప్పగా సాగుతున్నాయి. ప్రతిపక్షం లేకపోవడమే ఇందుకు కారణం. గత పదేళ్లలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల హయాంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్‌కూ వైసీపీ హాజరు కాలేదు. కీలకమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై ప్రతిపక్షం లేకుండానే చర్చ సాగింది. అధికారపక్ష సభ్యులే ప్రతిపక్షమై ప్రశ్నలు సంధించగా మంత్రులు సమాధానమివ్వడంతో చర్చల్లో పస కనిపించడం లేదు.
Similar News
News July 10, 2025
ఎమర్జెన్సీపై శశి థరూర్ సంచలన కథనం

1975 ఎమర్జెన్సీని ఉద్దేశించి కాంగ్రెస్ MP శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో పాలన ప్రజలను భయంలోకి నెట్టి, అణచివేతకు గురిచేసిందని ఓ ఆర్టికల్‌లో పేర్కొన్నారు. భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రపంచానికీ తెలియలేదన్నారు. అయినప్పటికీ ఆ చర్యలు జాతీయ ప్రయోజనాల కోసమని అప్పటి నాయకులు చెప్పుకొచ్చారని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షకులు అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికను ఎమర్జెన్సీ ఇచ్చిందన్నారు.
News July 10, 2025
టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్?

TG: ప్రభుత్వ బడుల్లో టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నేడు క్యాబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో ఈ విధానం సక్సెస్ అయిందని అధికారులు తెలిపారు. దీని ద్వారా టీచర్లు టైమ్‌కు స్కూల్‌కు వస్తారని, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెరుగుతుందని భావిస్తున్నారు.
News July 10, 2025
టాలీవుడ్ సెలబ్రిటీలపై సజ్జనార్ ఫైర్

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన <<17013741>>టాలీవుడ్ సెలబ్రిటీ<<>>లపై RTC MD సజ్జనార్ ఫైర్ అయ్యారు. ‘యువత బంగారు భవిష్యత్తును ఛిద్రం చేస్తున్న వీళ్లా సెలబ్రిటీలు? మంచి పనులు చేసి యూత్‌కు ఆదర్శంగా ఉండాల్సిన మీరు.. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసి యువత మరణాలకు కారణమయ్యారు. మీరు బెట్టింగ్ ప్రోత్సహించడం వల్లే యువత బంధాలు, బంధుత్వాలు మరిచిపోయారు. కాసులకు కక్కుర్తి పడే మీ ధోరణి సరైనది కాదు’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.