News July 23, 2024

AUG 14న ఓవర్సీస్‌లో ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీమియర్ షోస్

image

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే, ఓవర్సీస్‌లో ఆగస్టు 14న ప్రీమియర్ షోలు ఉంటాయని ప్రకటిస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్‌ అందిస్తుండగా పూరి & చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే, ఇదేరోజు రవితేజ నటిస్తోన్న ‘మిస్టర్ బచ్చన్’ మూవీ కూడా రిలీజ్ అవుతోంది.

News July 23, 2024

తెలంగాణకు బడ్జెట్‌లో మళ్లీ గుండు సున్నాయే: కేటీఆర్

image

TG: బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు ప్రతిసారీ అన్యాయమే చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు బీఆర్ఎస్ మండిపడ్డారు. ‘గడచిన పదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందేం లేదు. ఈసారి కూడా న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధులు మళ్లీ గుండు సున్నాయే’ అని పేర్కొన్నారు.

News July 23, 2024

బడ్జెట్ రోజు: 90% విన్నింగ్ రేటున్న స్టాక్ ఇదే

image

బడ్జెట్ రోజు షేర్లు ఆటుపోట్లకు లోనవుతాయి. సెన్సెక్స్‌లో ఒక స్టాక్ మాత్రం 90% విన్నింగ్ స్ట్రైక్‌రేట్ కొనసాగిస్తోంది. చివరి 10 బడ్జెట్లలో ఐటీసీ 9సార్లు పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సగటున 1.47% పెరిగింది. 2016 నుంచి చూస్తే 2020లో మాత్రమే 7% పతనమైంది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై విపత్తు సుంకం రూపంలో ఎక్సైజ్ డ్యూటీ పెంచడమే ఇందుకు కారణం. ఇండస్ ఇండ్, కొటక్ బ్యాంకులు 80% స్ట్రైక్‌రేట్‌తో ఉన్నాయి.

News July 23, 2024

అలాగైతే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు!

image

కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సందర్భంగా పెట్రోలియం ఉత్పత్తులను GST పరిధిలోకి రావాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఒకవేళ అలా జరిగితే పెట్రోల్ ఉత్పత్తులపై VAT, ఎక్సైజ్ డ్యూటీకి బదులు GST మాత్రమే పడుతుంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి. కాగా ఇందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దానికి రాష్ట్రాలు ఒప్పుకోవాల్సి ఉందని కేంద్రం పదేపదే చెబుతూ వస్తోంది. కానీ రాష్ట్రాలు ఒప్పుకోవడం అసాధ్యంగానే కనిపిస్తోంది.

News July 23, 2024

బడ్జెట్ పేపర్లు ఎలా పొందాలంటే?

image

కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ పేపర్లు ఇంటర్‌నెట్లో అందరికీ అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం <>www.indiabudget.gov.in<<>>లోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఎకనామిక్ సర్వేలు, బడ్జెట్ స్పీచ్‌లు, పేపర్లు పీడీఎఫ్‌ రూపంలో అందుబాటులో ఉంటాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం యూనియన్ బడ్జెట్ మొబైల్ అప్లికేషన్ కూడా ఉంటుంది. ఆర్థిక పద్దు ప్రవేశపెట్టిన తర్వాత ఆ పేపర్లు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతారు.

News July 23, 2024

జూన్ 3న స్టాక్ మార్కెట్లో ఏం జరిగిందంటే!

image

ఎగ్జిట్‌పోల్ ఊపులో జూన్ 3న నిఫ్టీ 3.25% పెరిగింది. కౌంటింగ్ రోజైన 4న మాత్రం 5.93% పతనమైంది. దీంతో మార్కెట్లో ఏం జరిగిందో సెబీ పార్లమెంటుకు నివేదిక ఇచ్చింది. 3న NSEలో టాప్ 100 సెల్లర్స్ రూ.87915 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మేశారని తెలిపింది. MFలు రూ.15572 కోట్లు, PFI రూ.10658 కోట్లు, రిటైల్ రూ.4544 కోట్లు, బీమా రూ.2566 కోట్లు, PMS రూ.362 కోట్లు, ఇతర సంస్థలు రూ.54,211 కోట్ల మేర అమ్మకాలు చేపట్టాయి.

News July 23, 2024

బడ్జెట్ వివరణపై నిర్మల భర్త ఏమన్నారంటే?

image

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ ఆమె భర్త, ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘బడ్జెట్ కేటాయింపులు అందరికీ అర్థం అవ్వాలి. సామాన్యులకు, గృహిణులకు, ఆటోడ్రైవర్లకు, కూలీలు సైతం సులభంగా ఆర్థిక పద్దు అర్థం చేసుకునేలా వివరించాలి. అప్పుడే పెరుగుతున్న ధరలు తమపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అందరికీ తెలుస్తుంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

News July 23, 2024

బడ్జెట్ స్పెషల్: ఈ స్టాక్స్‌పై పెరిగిన ఫోకస్

image

కేంద్రం స్వచ్ఛ ఇంధనంపై ఫోకస్ పెంచింది. 2070 నాటికి కర్బన రహిత స్థాయికి చేరాలని లక్ష్యం పెట్టుకుంది. అందుకు తగ్గట్టే ఈ బడ్జెట్లో కేటాయింపులు చేపట్టొచ్చు. దీంతో కొన్ని కంపెనీల షేర్లకు డిమాండ్ పెరుగుతోంది. అదానీ గ్రీన్ ఎనర్జీ, కేపీఐ గ్రీన్ ఎనర్జీ, సుజ్లాన్, ఐనాక్స్ విండ్, వారీ రిన్యూవబుల్, IREDA వంటి స్టాక్స్ భారీగా పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్నాళ్లుగా వీటిలో గ్రోత్ కనిపిస్తోంది.

News July 23, 2024

బడ్జెట్‌ను ఎలా సీక్రెట్‌గా ఉంచుతారంటే?

image

1951 నుంచి 1980 వరకు ఢిల్లీలో ఉన్న మింటో రోడ్‌లోని ప్రెస్‌లో బడ్జెట్ ముద్రించేవారు. ఆ తర్వాత పార్లమెంటులోని నార్త్ బ్లాక్‌ కింది ఫ్లోర్‌లో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశారు. అందులోనే బడ్జెట్ ప్రతులు ప్రింట్ అవుతాయి. బడ్జెట్ ప్రకటనకు ముందు ఆర్థికశాఖ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించరు. భారీ భద్రత ఉంటుంది. కేవలం బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకునే వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు.

News July 23, 2024

బాలలత సవాలును స్వీకరిస్తున్నా కానీ..: స్మిత సబర్వాల్

image

<<13681045>>దమ్ముంటే తనతో ఎగ్జామ్ రాయాలంటూ<<>> సివిల్స్ మెంటార్ బాలలత చేసిన సవాలును ఐఏఎస్ స్మిత సబర్వాల్‌ స్వీకరించారు. అయితే తన వయసు దాటిపోవడంతో యూపీఎస్‌సీ నిబంధనలు ఒప్పుకోవంటూ ట్వీట్ చేశారు. ‘బాలలత నా ప్రశ్నకు సమాధానమివ్వాలి. మీ దివ్యాంగ రిజర్వేషన్‌ను ప్రజలకు ఫీల్డ్‌ వర్క్ కోసం వినియోగించారా లేక కోచింగ్ సంస్థలు నడిపేందుకు వాడారా?’ అని ప్రశ్నించారు.