News July 23, 2024
బడ్జెట్ వివరణపై నిర్మల భర్త ఏమన్నారంటే?

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ ఆమె భర్త, ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘బడ్జెట్ కేటాయింపులు అందరికీ అర్థం అవ్వాలి. సామాన్యులకు, గృహిణులకు, ఆటోడ్రైవర్లకు, కూలీలు సైతం సులభంగా ఆర్థిక పద్దు అర్థం చేసుకునేలా వివరించాలి. అప్పుడే పెరుగుతున్న ధరలు తమపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అందరికీ తెలుస్తుంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
Similar News
News July 10, 2025
ట్రంప్‌పై డ్రోన్ దాడి జరగొచ్చు: ఇరాన్ అధికారి

ట్రంప్‌పై ఏ క్షణంలోనైనా దాడి జరగొచ్చని ఇరాన్ సీనియర్ అధికారి జావద్ లారిజనీ హెచ్చరించారు. సన్‌బాత్ చేసే సమయంలో డ్రోన్‌తో అటాక్ చేయొచ్చని బెదిరింపులకు పాల్పడ్డారు. ఫ్లోరిడాలోని నివాసం కూడా ట్రంప్‌కు సురక్షితం కాకపోవచ్చని చెప్పారు. 2020లో ఇరాన్ ఉన్నతాధికారి ఖాసీం సులేమాని హత్యలో ట్రంప్ పాత్రను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ చీఫ్ ఖమేనీని లక్ష్యంగా చేసుకున్నా ప్రతీకారం తప్పదన్నారు.
News July 10, 2025
ఆర్టీసీలో 422 కొత్త బస్సులు

TG: ఆర్టీసీ కొత్తగా 422 బస్సులు ప్రవేశపెట్టనుంది. కాలం చెల్లిన బస్సుల స్థానంలో 294 పల్లె వెలుగులు, 88 మెట్రో డీలక్స్‌లు, 23 డీలక్స్‌లు, 17 ఎక్స్‌ప్రెస్‌లను తీసుకురానుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరగడంతో ప్రయాణికులకు రిలీఫ్ ఇచ్చేందుకు RTC ఈ నిర్ణయం తీసుకుంది. 13-15లక్షల కి.మీ. తిరిగిన లేదా 15 ఏళ్ల కాలం దాటిన బస్సులను ఆర్టీసీ పక్కనపెట్టనుంది.
News July 10, 2025
ఇక బాక్సాఫీసుపై స్టార్ హీరోల దండయాత్ర

ఈ నెలాఖరు నుంచి దసరా వరకు వెండితెరపై స్టార్ హీరోలు సందడి చేయనున్నారు. ఈ నెల 24న హరిహర వీరమల్లుతో మొదలుకొని సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యే అఖండ-2 వరకు ఈ జోరు కొనసాగనుంది. విజయ్ దేవరకొండ-కింగ్డమ్(జులై 31), రజినీకాంత్-కూలీ(ఆగస్టు 14), NTR-‘వార్-2’(ఆగస్టు 14), పవన్ కళ్యాణ్-OG(సెప్టెంబర్ 25) ఈ మధ్యలోనే రానున్నాయి. మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?