India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టమాటా ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కొద్దిరోజుల కిందట రూ.100కు చేరిన కేజీ టమాటా.. ఇటీవల కాస్త తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లలో కేజీ టమాటా రూ.50-60కి లభించింది. ఇప్పుడు మరోసారి రూ.80(గ్రేడ్-ఏ)కి చేరింది. వర్షాలకు దెబ్బతినడం, సరఫరా సరిపడినంత లేకపోవడంతోనే టమాటా ధరలు పైపైకి చేరుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. మరి మీ ప్రాంతంలో టమాటా రేట్ ఎంత ఉందో కామెంట్ చేయండి.

మొహర్రం సందర్భంగా ఈరోజు ఈక్విటీ, డెరివేటివ్ విభాగాల్లో ట్రేడింగ్‌కు ఎక్స్‌ఛేంజీలు సెలవు ప్రకటించాయి. ఇన్వెస్టర్లు ఈరోజు స్టాక్స్, బాండ్లను కొనుగోలు/విక్రయించడానికి అవకాశం ఉండదు. మరోవైపు మల్టీ కమొడిటీ ఎక్స్‌ఛేంజీలోనూ మార్నింగ్ సెషన్ అందుబాటులో ఉండదు. MCX తిరిగి సాయంత్రం ప్రారంభమవుతుంది. సా.గం.5 నుంచి రాత్రి గం.11.30 వరకు ట్రేడింగ్ ఉంటుంది. పెట్రోల్, గోల్డ్ మొదలైనవి దీని పరిధిలోకి వస్తాయి.

కర్ణాటకలో స్థానిక రిజర్వేషన్లలో కేబినెట్ <<13639739>>నిర్ణయం<<>>పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇది ముఖ్యంగా IT రంగంపై ప్రభావితం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో హరియాణా ప్రభుత్వం ఇదే నిర్ణయం తీసుకొని ఫెయిలైందని చెబుతున్నారు. మరోవైపు ఐటీ HYD, పుణే, నోయిడా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే రాష్ట్రానికి తీవ్ర నష్టమని, ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచిస్తున్నారు.

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య భార్య నటాషా స్వదేశం సెర్బియా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కుమారుడు అగస్త్యతో కలిసి ఆమె కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతకుముందు ఇన్‌స్టాలో ‘ఆ సమయం వచ్చింది’ అనే అర్థం వచ్చేలా నటాషా ఓ పోస్ట్ పెట్టారు. విమానం, ఇంటి ఎమోజీలను షేర్ చేయడంతో సెర్బియా వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది.

TG: మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన భూక్య యశ్వంత్ అరుదైన ఘనత సాధించారు. లద్దాక్‌లోని 6,250 మీటర్ల మౌంట్ కాంగ్ యాట్సే 2 పర్వతాన్ని ఎక్కారు. అందుకు 8 రోజుల పాటు శ్రమించినట్లు తెలిపారు. శిఖరాగ్రాన్ని చేరుకొని జెండాను ప్రదర్శించాక కష్టమంతా మరిచిపోయినట్లు పేర్కొన్నారు. పర్వతారోహణ అంటే తనకు ఇష్టమని, ఎవరెస్ట్ ఎక్కడమే తన లక్ష్యమని చెప్పారు.

AP: రాష్ట్రంలో ఇటీవల వాహనాలకు ‘పలానా ఎమ్మెల్యే తాలుకా’ నంబర్ ప్లేట్ల ట్రెండ్ నడుస్తోంది. అయితే అలాంటి వాటిని ఉపేక్షించేది లేదని, నిబంధనల ప్రకారం హైసెక్యూరిటీ నంబర్ మాత్రమే ఉండాలని రవాణా శాఖ చెబుతోంది. తాజాగా వైజాగ్‌లో ‘ఎమ్మెల్యే తాలుకా’ నంబర్ ప్లేట్లు ఉన్న 22 వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపై అలాంటి వాహనాలు కనిపిస్తే సీజ్ చేసి, కేసులు పెడతామని హెచ్చరించారు.

TG: అధికార దుర్వినియోగం చేసిన వారికి త్వరలోనే ప్రజాకోర్టులో శిక్ష పడుతుందని మాజీ మంత్రి KTR అన్నారు. విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలనుద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. ‘రాజకీయ ప్రతీకారాలకు పరిమితులు ఉంటాయి. బాధితులను ఎక్కువ కాలం బాధించొద్దని సుప్రీం తీర్పు చెబుతోంది. KCR కేసులో అధికార దుర్వినియోగం చేశారని న్యాయస్థానం పేర్కొంది. సత్యమే గెలుస్తుంది’ అని పేర్కొన్నారు.

TG: రాష్ట్రంలో రేపటి నుంచి 3 రోజులపాటు అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు, ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, MBNR, NZB, నిర్మల్, HMK, SDPT, NRPT, జగిత్యాల, సూర్యాపేట తదితర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.

AP: <<13589335>>టెట్‌కు<<>> దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌లో మాత్రమే లాగిన్ అవ్వాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. అభ్యర్థికి కేటాయించిన ఐడీతో క్యాండిడేట్ లాగిన్‌లోకి వెళ్లి అన్ని వివరాలు నమోదు చేయాలని, అప్లికేషన్ ప్రివ్యూ పరిశీలించిన తర్వాతే సబ్మిట్ చేయాలని సూచించారు. ఏమైనా తప్పులుంటే లాగిన్‌లో డిలీట్ ఆప్షన్ ఉపయోగించుకుని తిరిగి అప్లై చేయాలని సూచించారు.

దక్షిణాది నటి వరలక్ష్మి ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరలక్ష్మి పేరును తన పేరులో కలుపుకోవడమే ఆమెకు ఇచ్చే బహుమతి అని నికోలాయ్ తెలిపారు. తాను నికోలాయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ సచ్‌దేవ్‌గా మార్చుకుంటానని, తన కూతురికీ ఇదే పేరు జత చేస్తానని చెప్పారు. దీంతో వరలక్ష్మీ శరత్ కుమార్ ఎప్పటికీ అలాగే నిలిచిపోతుందన్నారు. ఆమె పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదన్నారు.
Sorry, no posts matched your criteria.