India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో జింబాబ్వే 20 ఓవర్లలో 152/7 రన్స్ చేసింది. ఆ జట్టులో కెప్టెన్ సికిందర్ రజా 46 రన్స్‌తో రాణించారు. మారుమణి 32, మాధెవెరె 25 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. అటు భారత్ జట్టులో అరంగేట్ర బౌలర్ దేశ్‌పాండే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తొలి వికెట్ పడగొట్టారు. ఖలీల్ 2, సుందర్, అభిషేక్, దూబే తలో వికెట్ తీశారు. భారత్ విజయానికి 153 పరుగులు కావాలి.

AP: అమ్మ ఒడి కింద ఇద్దరు బిడ్డలకు రూ.15,000 చొప్పున ఇప్పిస్తామని తనతో వైసీపీ నేతలు ప్రచారం చేయించడం నిజమని APCC చీఫ్ షర్మిల పునరుద్ఘాటించారు. ‘కూటమి ప్రభుత్వం తల్లికి వందనంపై ఇచ్చిన GO.29లో క్లారిటీ లేదని, విద్యార్థులందరికీ డబ్బులు ఇవ్వాలని మేం డిమాండ్ చేశాం. మేము చెప్పిందేంటో వైసీపీ నేతలు మరోసారి వినాలి. చంద్రబాబుకు కాంగ్రెస్ తోకపార్టీ అని <<13615247>>విమర్శించడం<<>> మీ అవగాహనా రాహిత్యం’ అని Xలో ఫైరయ్యారు.

మొనాకోలో జరుగుతున్న డైమండ్ లీగ్‌లో ఆస్ట్రేలియా రన్నర్ జెస్సికా హల్ ప్రపంచ రికార్డు సృష్టించారు. మహిళల విభాగంలో 2,000 మీటర్ల పరుగును 5 నిమిషాల 19.70 సెకన్లలోనే పూర్తి చేశారు. 2021లో బురుండికి చెందిన ఫ్రాన్సిస్ 5:21.56 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకోగా, ఇవాళ ఆ రికార్డు బ్రేకయ్యింది. తన పేరు చరిత్రపుటల్లో ఎక్కిందని, ఈ అనుభూతి అద్భుతంగా ఉందని జెస్సికా తెలిపారు.

తనపై <<13622151>>కేసు<<>> నమోదైందని వస్తోన్న వార్తలను యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఖండించారు. కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి పోస్ట్ చేయలేదని, గుర్తు తెలియని వ్యక్తులు తన పేరడి అకౌంట్‌లో పోస్ట్ చేశారని తెలిపారు. కావాలంటే ఓసారి చెక్ చేయాలని సూచించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు UPSC పరీక్షకు హాజరుకాకుండానే ఉత్తీర్ణత సాధించినట్లు ‘ధ్రువ్ పేరడీ’ X అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

AP: మాజీ సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేముల సతీశ్ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ప్రజాదర్బార్‌లో లోకేశ్‌తో కలిసి ఆయన ఫొటో దిగారు. కాగా ఏప్రిల్ 13న విజయవాడలో సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా జగన్‌పై రాయి దాడి జరిగింది. ప్రజలకు అభివాదం చేస్తూ పక్కకు తిరగడంతో గాయం తీవ్రత తగ్గింది. ఆ తర్వాత పోలీసులు ఈ కేసులో సతీశ్‌ను ఏ1గా చేర్చి నెల్లూరు జైలుకు తరలించగా బెయిల్‌పై బయటకు వచ్చారు.

గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. దీంతో 71 మంది సాధారణ ప్రజలు మరణించగా 289 మంది గాయాలపాలయ్యారు. కాగా ఖాన్ యూనిస్ ప్రాంతంలోనే హమాస్ ఉగ్రవాదులు దాక్కున్నారని, అందుకే దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇప్పటివరకు గాజా నరమేధంలో 38,300 మంది మరణించారు. 88,000 మందికిపైగా గాయాలపాలయ్యారు. గాజాలోని 80 శాతం ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు.

దేశంలోని 13 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఫలితాల్లో BJPకి ఎదురుదెబ్బ తగిలింది. 11 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 2చోట్ల మాత్రమే గెలిచింది. మొత్తం 13స్థానాల్లో కాంగ్రెస్ 4, TMC 4, AAP 1, DMK 1, ఇండిపెండెంట్ ఒక చోట విజయం సాధించారు. బెంగాల్‌లో TMC క్లీన్ స్వీప్ చేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ 2 సీట్ల చొప్పున కైవసం చేసుకుంది. పంజాబ్‌లో AAP, తమిళనాడులో DMK, బిహార్‌లో IND గెలిచారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(Q1)లో డీమార్ట్ రూ.774 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 17.5 శాతం వృద్ధి సాధించినట్లు అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ వెల్లడించింది. మొత్తం ఆదాయం రూ.14,069 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. దేశంలో కొత్తగా 6 స్టోర్లను తెరవడంతో మొత్తం స్టోర్ల సంఖ్య 373కి చేరినట్లు తెలిపింది.

అమరుడైన కెప్టెన్ అన్షుమాన్ సింగ్ భార్య స్మృతిపై అసభ్యకర <<13592580>>కామెంట్<<>> చేసిన నెటిజన్‌పై కేసు నమోదైంది. అన్షుమాన్ సేవలకుగానూ ఇటీవల ఆయన భార్య స్మృతికి కేంద్రం ‘కీర్తిచక్ర’ అవార్డు ప్రదానం చేసింది. ఆ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురైన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఓ నెటిజన్ ఆమెపై అసభ్యకర కామెంట్ చేశాడు. దీన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్.. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

యూకే మాజీ PM టోనీ బ్లెయిర్‌తో సమావేశమైనట్లు మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘బ్రాహ్మణితో కలిసి ఈరోజు టోనీ బ్లెయిర్‌తో సమావేశమయ్యే అవకాశం నాకు లభించింది. విద్య, ఆరోగ్యం, రాజకీయాలు వంటి రంగాల్లో AI ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై చర్చించాం. ఆదాయాన్ని పెంపొందించడానికి దానిని ఎలా ఉపయోగించగలం అనేదానిపై మాట్లాడుకున్నాం’ అని ట్వీట్ చేశారు. ఆయనతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.