News July 6, 2024

టీ20 WC నెగ్గడంలో రోహిత్‌ది కీలక పాత్ర: గవాస్కర్

image

టీ20 WC టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ ప్రతిభ తనను ఆకట్టుకుందని మాజీ ప్లేయర్ గవాస్కర్ అన్నారు. ‘జట్టు విజయంలో ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. బౌలింగ్‌లో బుమ్రా, బ్యాటింగ్‌లో కోహ్లీ చాంపియన్స్. వీరందరినీ నడిపించి జట్టును గెలిపించిన రోహిత్ ప్రధాన పాత్రధారి. క్లిష్ట పరిస్థితుల్లో నిస్పృహను దరిచేరనీయకుండా సమర్థంగా వ్యవహరించి కప్ నెగ్గేందుకు కారణమయ్యారు’ అని కొనియాడారు.

News July 6, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 6, 2024

7 మండలాలు తిరిగివ్వాలని తెలంగాణ డిమాండ్

image

TG: విభజన చట్టంలోని అంశాలపై తెలుగు రాష్ట్రాల సీఎంలు రేపు భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో తెలంగాణ పలు ప్రధాన డిమాండ్‌లను ప్రస్తావించనుంది. అందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీలో విలీనం చేసుకున్న ఏడు మండలాలను తిరిగి ఇవ్వాలని ప్రతిపాదించనుంది. టీటీడీలో 42.58 శాతం వాటా, కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో వాటా ఇవ్వాలని అడగనుంది. అలాగే సముద్ర తీరప్రాంతలోనూ వాటా ఇవ్వాలని కోరనుంది.

News July 6, 2024

శుభ ముహూర్తం

image

తేది: జులై 06, శనివారం
ఆషాఢ శుద్ధ పాడ్యమి: తెల్లవారుజామున 03:56 గంటలకు
పునర్వసు: తెల్లవారుజామున 05:09 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 05:34 -07:17 గంటల వరకు
రాహుకాలం: ఉదయం 9.00- 10.30 గంటల వరకు

News July 6, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ
* సమస్యల పరిష్కారానికి రేవంత్‌తో చర్చిస్తా: CBN
* AP:స్మగ్లింగ్ చేస్తున్న పెద్ద తలకాయలను పట్టుకోండి: పవన్
* AP: ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక
* ఆగస్టు 11 నుంచి నీట్-పీజీ పరీక్ష
* బ్రిటన్‌లో రిషి సునాక్‌కు షాక్.. లేబర్ పార్టీ విజయం

News July 5, 2024

రేపు వీరందరికీ డెబ్యూ మ్యాచ్?

image

జింబాబ్వేతో రేపు జరగనున్న తొలి టీ20లో అభిషేక్ శర్మ అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నారు. ఆయనతోపాటు రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, సాయి సుదర్శన్, తుషార్ దేశ్‌పాండే, హర్షిత్ రాణా కూడా తమ తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడనున్నట్లు తెలుస్తోంది. కాగా తొలి టీ20 రేపు, రెండో టీ20 ఈ నెల 7న, మూడో మ్యాచ్ 10న, నాలుగో టీ20 13న, చివరిది 14న జరగనుంది. ఈ మ్యాచులన్నీ హరారే వేదికగా జరగనున్నాయి.

News July 5, 2024

సీఎంల భేటీ.. నీటి పంపిణీపై నో డిస్కషన్?

image

AP CM చంద్రబాబు, TG CM రేవంత్ రేపటి భేటీకి 10 అంశాలతో అజెండా ఖరారైనట్లు తెలుస్తోంది. 9,10 షెడ్యూళ్లలోని ఆస్తుల విభజన, APSFC, విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల మార్పిడి, వృత్తిపన్ను పంపకం, HYDలోని భవనాల తిరిగి అప్పగింత, ఉమ్మడి సంస్థల వ్యయాల తిరిగి చెల్లింపు, విభజన చట్టంలో లేని ఆస్తుల ప్రస్తావన తదితర అంశాలపై సీఎంలు చర్చించనున్నారట. అయితే ఈ భేటీలో నీటి పంపిణీ జోలికి వెళ్లొద్దని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

News July 5, 2024

దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి

image

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత మహిళల జట్టు 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన SA 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సఫారీ బ్యాటర్లలో బ్రిట్స్(81), మారిజానె(57) అర్ధసెంచరీలతో రాణించారు. వస్త్రాకర్, రాధ చెరో 2 వికెట్లు తీశారు. ఛేదనలో భారత ప్లేయర్లు రోడ్రిగ్స్(53*), మంధాన(46) పోరాడినా ఫలితం లేకపోయింది. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 177 రన్సే చేశారు.

News July 5, 2024

30 ఏళ్లలో ఒక్క చీర కూడా కొనలేదు: సుధా మూర్తి

image

గత 30 ఏళ్లలో తాను ఒక్క చీర కూడా కొనలేదని రాజ్యసభ MP సుధామూర్తి తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ఉన్నవాటినే మళ్లీమళ్లీ కట్టుకుంటానన్నారు. ‘గంగానదిలో నచ్చినది వదిలేస్తే మంచి జరుగుతుందనే నమ్మకంతో నాకు ఇష్టమైన షాపింగ్‌ను కాశీ యాత్రకు వెళ్లినప్పుడు వదిలేశా. అప్పట్నుండి పెద్దగా షాపింగ్ చేయలేదు. మా అమ్మలా పొదుపుగా జీవించాలనుకున్నా. అక్కాచెల్లెళ్లు, స్నేహితులు బహుమతిగా ఇచ్చిన చీరలనే ధరిస్తుంటా’ అని అన్నారు.

News July 5, 2024

2, 3 రోజుల్లో కృష్ణాకు పట్టిసీమ నీళ్లు: మంత్రి నిమ్మల

image

AP: రానున్న రెండు, మూడు రోజుల్లో గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు చేరే అవకాశం ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత నాలుగేళ్లుగా పట్టిసీమ నిర్వహణ పనులు చేయకపోవడంతో గేట్లు, బోల్టులు తుప్పు పట్టిపోయి లీకేజీలు ఎక్కువగా ఉన్నాయన్నారు. 24 పంపుల్లో ప్రస్తుతం 15 పని చేస్తున్నాయని తెలిపారు. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే ప్రాజెక్టుల పనులకు ప్రాధాన్యమిస్తామని వివరించారు.