News July 5, 2024

ఈ రైల్వే స్టేషన్‌కు పేరే లేదు!

image

దేశంలో ఓ రైల్వే స్టేషన్‌కు పేరు లేదనే విషయం మీకు తెలుసా? దానికి నేమ్ బోర్డు లేకపోయినా రైళ్లు అక్కడ ఆగుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లోని రైనా & రైనాగఢ్ అనే రెండు గ్రామాల మధ్య ఇది ఉంది. దీనికి రైనాగఢ్‌ స్టేషన్‌గా పేరు పెట్టారు. స్టేషన్ తమ భూభాగంలో ఉందని, తమ ఊరి పేరే పెట్టాలని రైనా గ్రామస్థులు వాదిస్తున్నారు. ఈ వివాదం ముదరడంతో రైల్వేశాఖ స్టేషన్ పేరును తొలగించింది. టికెట్‌లో రైనాగఢ్‌గా ఉంటోంది.

News July 5, 2024

టీమ్ ఇండియా టార్గెట్ 190 రన్స్

image

భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా మహిళా జట్టు భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 189/4 రన్స్ చేసింది. సఫారీ ప్లేయర్లలో తజ్‌మిన్ బ్రిట్స్ 81, మారిజానె కాప్ 57 రన్స్‌తో చెలరేగారు. కెప్టెన్ వాల్వార్డ్(33) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో పూజ, రాధ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌ను JIO CINEMAలో ఉచితంగా లైవ్ చూడొచ్చు.

News July 5, 2024

హిండెన్‌బర్గ్ వివాదంలో చైనా హస్తం?- 1/2

image

అదానీ గ్రూప్‌పై రిపోర్టు రిలీజ్ చేసినందుకు సెబీ నోటీసులు పంపిందన్న హిండెన్‌బర్గ్ ప్రకటన కొత్త ట్విస్టులకు దారి తీస్తోంది. ఈ వ్యవహారంలో హిండెన్‌బర్గ్‌తో కింగ్‌డాన్ క్యాపిటల్ ఫౌండర్‌కు సంబంధం ఉండగా ఆయన సతీమణి ఆన్లా ఛాంగ్ చైనా దేశస్థురాలు కావడం వివాదాస్పదమైంది. 20ఏళ్ల పాటు చైనాలో పనిచేసిన ఆమె 2016లో ‘సప్‌చైనా’ అనే మీడియా సంస్థ ప్రారంభించారు. చైనా ఏజెంట్ అనే ఆరోపణలు రావడంతో కొంతకాలానికి మూతపడింది.

News July 5, 2024

హిండెన్‌బర్గ్ వివాదంలో చైనా హస్తం?- 2/2

image

అదానీ గ్రూప్ తమ సంస్థలకు పోటీగా ప్రాజెక్టులు దక్కించుకుంటోందనే అక్కసుతోనే చైనా ఈ కుట్ర చేసి ఉండొచ్చనేది పలు ట్రేడ్ వర్గాల వాదన. హిండెన్‌బర్గ్ ముందస్తుగా తన రిపోర్టును కింగ్‌డాన్ క్యాపిటల్‌కు షేర్ చేసిందని ఆరోపిస్తున్నాయి. రాజ్యసభ ఎంపీ మహేశ్ జెఠ్మలానీ సైతం దీనిపై Xలో సుదీర్ఘ పోస్ట్ చేశారు. హిండెన్‌‌బర్గ్‌కు సహకరించిన భారత ఆర్థిక సంస్థలకు చైనా మూలాల గురించి ముందే తెలుసా? అని ప్రశ్నించారు.

News July 5, 2024

IND vs ZIM: ఓపెనర్లుగా గిల్, అభిషేక్

image

జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20లో భారత్ తరఫున శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. తొలుత రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్‌గా వస్తారని వార్తలు వచ్చాయి. కానీ గిల్‌తో కలిసి అభిషేక్ ఓపెనింగ్ చేయనున్నారు. వన్‌డౌన్‌లో గైక్వాడ్ రానున్నారు. కాగా తొలి టీ20 ఈ నెల 6న, రెండో టీ20 7న, మూడో మ్యాచ్ 10న, నాలుగో టీ20 13న, చివరిది 14న జరగనుంది. ఈ మ్యాచులన్నీ హరారే వేదికగా జరగనున్నాయి.

News July 5, 2024

బ్రిటన్ ఎన్నికల్లో భారతీయుల హవా!

image

బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి హవా కొనసాగించింది. ఏకంగా 26 మంది భారత మూలాలున్న అభ్యర్థులు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. తెలుగు సంతతికి చెందిన ఉదయ్ నాగరాజు, చంద్ర కన్నెగంటి ఓటమిపాలయ్యారు. గెలుపొందిన వారిలో రిషి సునాక్, బ్రేవర్మన్, ప్రీతి పటేల్, గగన్ మొహీంద్ర, శివాని రాజా, సీమా మల్హోత్రా, వాలెరీ వాజ్, కీత్ వాజ్, లీసా నాండీ, ప్రీత్ కౌర్ గిల్, తన్‌మంజిత్ సింగ్ ధేసి, నావెందు మిశ్రా తదితరులు ఉన్నారు.

News July 5, 2024

కుమారుడితో హార్దిక్ పాండ్య.. పిక్స్ వైరల్

image

టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య T20WC విజయాన్ని తన కుమారుడు అగస్త్యతో కలిసి మరోసారి సెలబ్రేట్ చేసుకున్నారు. వరల్డ్ కప్ మెడల్‌ను కుమారుడికి వేసి మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మరాయి. ‘నా నంబర్ 1 నువ్వే. నేను చేసే ప్రతిదీ నీకోసమే. ఏదైనా చేస్తా కూడా’ అంటూ హార్దిక్ పోస్టు పెట్టారు. కానీ భార్య నటాషా మాత్రం ఫొటోల్లో ఎక్కడా కనిపించలేదు.

News July 5, 2024

కేశవరావు రాజీనామా ఆమోదించిన ఛైర్మన్

image

TG: కే కేశవరావు రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆమోదించారు. రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ అయిందని సచివాలయం బులెటిన్ విడుదల చేసింది. కాగా ఇటీవల కేశవరావు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం తన ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. నిన్న రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు అందించగా ఒక్క రోజులోనే ఆమోదించారు.

News July 5, 2024

కాటేసిన పామును కొరికి చంపిన వ్యక్తి

image

తనను కాటేసిన పామును వ్యక్తి కొరికి చంపిన ఘటన బిహార్ రాజౌలీలో జరిగింది. రైల్వే లైన్ పని చేస్తున్న కార్మికుడు సంతోష్‌ను పాము కరిచింది. గమనించిన అతడు దాన్ని పట్టుకొని మూడుసార్లు కొరకడంతో అది చనిపోయింది. అధికారులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే కరిచిన పామును తిరిగి కొరికితే విషం విరుగుడు అవుతుందని తమ ఊరిలో నమ్ముతారని అతడు చెప్పడం గమనార్హం.

News July 5, 2024

‘నీట్’పై ఎన్టీఏదీ అదే మాట

image

నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలన్న పిటిషన్లకు వ్యతిరేకంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పేపర్ లీకేజీ కేవలం పట్నా, గోద్రా సెంటర్లలోనే జరిగిందని, దీనికి పరీక్ష మొత్తాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంతకుముందు కేంద్రం కూడా ఇదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలియపర్చింది.