News July 5, 2024
టీమ్ ఇండియా టార్గెట్ 190 రన్స్

భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా మహిళా జట్టు భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 189/4 రన్స్ చేసింది. సఫారీ ప్లేయర్లలో తజ్‌మిన్ బ్రిట్స్ 81, మారిజానె కాప్ 57 రన్స్‌తో చెలరేగారు. కెప్టెన్ వాల్వార్డ్(33) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో పూజ, రాధ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌ను JIO CINEMAలో ఉచితంగా లైవ్ చూడొచ్చు.
Similar News
News December 16, 2025
ఎట్టకేలకు అమ్ముడైన పృథ్వీ షా

యంగ్ బ్యాటర్ పృథ్వీషాకు ఎట్టకేలకు ఊరట దక్కింది. ఐపీఎల్-2026 మినీ వేలం తొలి రౌండ్‌లో షా అమ్ముడుపోలేదు. మరో రౌండ్‌లో బేస్ ప్రైస్ రూ.75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని సొంతం చేసుకుంది. గతంలో ఇతడు ఢిల్లీ తరఫునే ఆడారు. 79 మ్యాచుల్లో 1,892 రన్స్ చేశారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లు జేమీసన్‌ను రూ.2 కోట్లకు ఢిల్లీ, ఆడమ్ మిల్నేను రూ.2.4 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసింది.
News December 16, 2025
రేపే మూడో విడత ఎన్నికల పోలింగ్

TG: రేపు 182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడతలో మొత్తం 4,159 సర్పంచ్ స్థానాలకు SEC నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 394 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 3,752 స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 28,410 వార్డు మెంబర్ల స్థానాలకు 75,725 మంది బరిలో నిలిచారు.
News December 16, 2025
ఆప్కాబ్, DCCB, PACSలలో అక్రమాలపై సభాసంఘం

AP: ఆప్కాబ్, DCCB, PACSలలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై స్పీకర్ ఏడుగురు MLAలతో సభాసంఘాన్ని నియమించారు. ఇందులో N.అమర్‌నాథ్ రెడ్డి ఛైర్మన్‌గా K.రవికుమార్, D.నరేంద్ర, B.శ్రీనివాస్, Y.వెంకట్రావు, B.రామాంజనేయులు, శ్రావణ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈ అంశంపై ఫిర్యాదులను అసెంబ్లీ సహాయ కార్యదర్శికి నేరుగా లేదా ‘apl.apcob@gmail.com’కి మెయిల్ పంపవచ్చని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ తెలిపారు.


