India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసులో మరో కీలక సూత్రధారి అమన్ సింగ్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌తో పాటు మరో ఇద్దరిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అక్కడ కాలిపోయిన నీట్ ప్రశ్నపత్రాలను బిహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

అసోం రాష్ట్రాన్ని వరదలు వణికిస్తున్నాయి. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. 23 జిల్లాలు వరద ప్రభావానికి గురి కాగా 2,90,000 మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇటు కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ కేంద్రాలు నీటిలో మునిగిపోయాయి. దీంతో వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. ఒక రైనో సహా 8 జంతువులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

AP: సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిగా ప్రమోద్‌ను నియమిస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గుజ్జర్లపూడి రాజు, దిలీప్ కుమార్, నాగరాజు, సోమరెడ్డి కృష్ణారెడ్డి, వెంకట సాయికృష్ణలను ప్రభుత్వ ప్లీడర్లుగా నియమించింది. మరో 14 మందిని అసిస్టెంట్ ప్లీడర్లుగా నియమించింది.

తేది: జులై 04, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4:25 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:46 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:21 గంటలకు అసర్: సాయంత్రం 4:57 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6:55 గంటలకు ఇష: రాత్రి 8.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

హాథ్రస్ <<13555518>>తొక్కిసలాట <<>>ఘటనలో 121 మంది చనిపోవడంపై రష్యా, జపాన్ దేశాల అధినేతలు స్పందించారు. ‘ఈ విషాద ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నాం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’ అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన విడుదల చేశారు. జపాన్ ప్రధాని పుమియో కిషిద మృతులకు సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని తమ ప్రభుత్వం పార్థిస్తుందని పేర్కొన్నారు.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కీలక అంశాలతో పోలీసులు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ‘గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు జడ్జిలు, రాజకీయ ప్రముఖులు, ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్‌లను ట్యాప్ చేశారు. ఇప్పటికే నలుగురు పోలీసులను అరెస్ట్ చేశాం. ఓ మీడియా సంస్థ యజమాని ఇంట్లో కూడా సోదాలు చేసి మెటీరియల్ సీజ్ చేశాం. కేసు నమోదు కాగానే ఎస్ఐబీ మాజీ చీఫ్ దేశం వదిలి వెళ్లిపోయారు’ అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

AP: ఢిల్లీలో కూటమి ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. టీడీపీ, బీజేపీ, జనసేన ఎంపీలతో డిన్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీ అర్వింద్ సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆయన తండ్రి డి.శ్రీనివాస్ మరణించడంతో అర్వింద్‌ను సీఎం పరామర్శించారు. కాగా రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు.

తేది: జులై 04, గురువారం
త్రయోదశి: ఉదయం 05:34 గంటలకు
చతుర్దశి: తెల్లవారుజామున 04:40 గంటలకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 09:53- 10:45 గంటల వరకు,
మధ్యాహ్నం 03:06- 03:58 గంటల వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 01:30 -03:00 గంటల వరకు
Sorry, no posts matched your criteria.