India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: జనసేనాని పవన్‌తో టీడీపీ చీఫ్ చంద్రబాబు ఉమ్మడి ప్రచారానికి కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇవాళ తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో చంద్రబాబు ‘ప్రజాగళం’ సభలు నిర్వహించనున్నారు. రేపు పాయకరావుపేట, చోడవరం, గాజువాకలో, ఈ నెల 15న రాజాం, పలాస, టెక్కలిలో సభలు నిర్వహించనున్నారు. 16, 17న ఇరువురు నేతలు కలిసి ఉమ్మడి ప్రచారం నిర్వహిస్తారు.

TS: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి ఏటీజీహెచ్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 63,163 మంది భక్తులు దర్శించుకోగా.. 31,287 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.2.99 కోట్లు సమకూరింది.

‘రామాయణం’ మూవీ కోసం ఎంతైనా కష్టపడతానని హీరో యశ్ అన్నారు. ‘భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై ఉంచాలన్నది నాకు ఎప్పటి నుంచో ఉన్న కల. నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి రామాయణం తీస్తే బాగుంటుందని చాలాసార్లు అనుకున్నాం. కానీ అంత పెద్ద సబ్జెక్ట్ మూవీ తీయడం మామూలు విషయం కాదు. పైగా బడ్జెట్ కూడా సరిపోదు. అందుకే నితీశ్ దర్శకత్వంలో ఈ సినిమాను కో ప్రొడ్యూస్ చేస్తున్నా. దీని కోసం ఎంతైనా కష్టపడతా’ అని యశ్ చెప్పారు.

AP: పొత్తులో భాగంగా కేటాయించిన సీట్లలో చేయాల్సిన మార్పులపై TDP, BJP, JSP అగ్రనేతలు నిన్న భేటీ అయ్యారు. అనపర్తి అసెంబ్లీ సీటును తమకు ఇచ్చి, బదులుగా తంబళ్లపల్లె సీటును BJP తీసుకోవాలని TDP ప్రతిపాదించింది. అలాగే నరసాపురం MP స్థానాన్ని రఘురామకు కేటాయించి, దానికి బదులుగా ఉండి స్థానం తీసుకోవాలని CBN కోరారట. దీనిపై పార్టీ అధిష్ఠానాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని BJP నేతలు చెప్పినట్లు సమాచారం.

AP: సీఎం జగన్, షర్మిల ప్రచార ఒత్తిడి తట్టుకోలేక వారి తల్లి వైఎస్ విజయమ్మ అమెరికాలోని బంధువుల ఇంటికి వెళ్లినట్లు సమాచారం. ఇటీవల జగన్ చేపట్టిన ‘సిద్ధం’ బస్సుయాత్ర ప్రారంభానికి ముందు ఆమె ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే షర్మిల చేపట్టిన బస్సు యాత్ర ప్రారంభ సమయంలో కూడా ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇప్పుడు ఎవరికి ప్రచారం చేయాలో తేల్చుకోలేక అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.

AP: రాష్ట్రంలోని 57 మండలాల్లో ఇవాళ వడగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు 9 మండలాల్లో తీవ్ర వడగాలులు, 111 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వడగాలులు వీచే మండలాల వివరాల కోసం ఇక్కడ <

AP: రాష్ట్రంలోని మసీదులలో పని చేసే ఇమామ్, మౌజన్లకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు గౌరవ వేతనాన్ని విడుదల చేసింది. 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి నెల వరకు 6 నెలల కాలానికి సంబంధించిన రూ.45 కోట్లను ఆయా మసీదుల ఖాతాలకు జమ చేసినట్లు అధికారులు తెలిపారు.

AP: నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు ‘టాప్’లో నిలిచారు. గాజువాకకు చెందిన శరగడం పావని సెకండియర్ బైపీసీలో 1000కి 991(ఫస్ట్ ఇయర్‌లో 435) మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. ఇంగ్లిష్‌లో 97/100, సంస్కృతంలో 99/100, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 60/60, ప్రాక్టికల్స్‌లో 120/120 మార్కులు వచ్చాయి. ప్రకాశం జిల్లా మూలగుంటపాడుకు చెందిన కిరణ్మయి 990 మార్కులతో రెండో స్థానంలో నిలిచింది.

TG: రాష్ట్రంలో కొత్తగా నియమితులైన నర్సింగ్ ఆఫీసర్లకు త్వరలో జీతాలు అందజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఫిబ్రవరిలో డీఎంఈ విభాగంలో మొత్తం 5,600 మంది విధుల్లో చేరారని పేర్కొంది. వారికి ఎంప్లాయ్ ఐడీ, పీఆర్ఏఎన్ నంబర్ కేటాయించే ప్రక్రియ జరుగుతోందని, త్వరలోనే ఆ ప్రక్రియను పూర్తిచేసి వేతనాలు ఇస్తామని వెల్లడించింది.

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఇవాళ సాయంత్రం చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. దీనికి పార్టీ చీఫ్ కేసీఆర్ హాజరుకానున్నారు. ఇప్పటికే సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయగా.. పెద్దఎత్తున జనసమీకరణ చేసే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న కేసీఆర్.. ఇవాళ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది.
Sorry, no posts matched your criteria.