India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ధాన్యం కొనుగోళ్లు, నీటి సరఫరాపై సమీక్షలో అధికారులపై CM రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ‘కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే చర్యలు తీసుకోవాలి. గేటెడ్ కమ్యూనిటీలకు ఎక్కువ నీరు ఇచ్చి.. బస్తీలకు తక్కువ నీరు ఇచ్చే సిబ్బందిపై నిఘా పెట్టాలి. ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీస్తే చర్యలు తప్పవు. ధాన్యం పక్కదారి పట్టించే మిల్లర్లపై నిఘా పెట్టాలి. MSP కన్నా తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయవద్దు’ అని స్పష్టం చేశారు.

AP: గత ఐదేళ్లలో సీఎం జగన్ ఎవరినైనా కలిశారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరులో టీడీపీ సభలో మాట్లాడిన ఆయన.. ‘కరవు, తుపాన్ల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. తుపాన్ల కంటే అసమర్థ సీఎం వల్ల ఎక్కువ నష్టపోయారు. రాష్ట్రంలో ధాన్యం కొనే దిక్కు లేదు. తుపాను వల్ల నష్టపోతే పరామర్శించేందుకు సీఎం రాలేదు. ఇప్పుడు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.

పృథ్వీరాజ్ నటించిన ఆడు జీవితం సినిమా కలెక్షన్లలో రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.130 కోట్ల వసూళ్లు రాబట్టి.. సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘లూసిఫర్’ కలెక్షన్లను(రూ.128కోట్లు) దాటేసింది. దీంతో మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల్లో నిలిచింది. తొలి 4 స్థానాల్లో మంజుమ్మల్ బాయ్స్ (రూ.230Cr), 2018(రూ.176Cr), పులి మురుగన్(రూ.150 Cr), ప్రేమలు (రూ.136Cr) సిినిమాలున్నాయి.

విమానంలో లవర్స్ రెచ్చిపోయారు. ఫ్లైట్‌లో ప్రయాణికుల ముందే ఒకరిపైఒకరు పడుకుని ముద్దులు, హగ్‌లతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ జంట చేసిన నిర్వాకం తోటి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. ‘దాదాపు 4 గంటల పాటు ఆ జంట మాకు నరకం చూపించింది. వారు మైమరచిపోయి ఎవర్నీ పట్టించుకోకుండా చేతులతో లవ్ సింబల్స్ చూపిస్తూ ప్రేమ విమానంలో విహరిస్తున్నట్లుగా ప్రవర్తించారు’ అని ఓ ప్రయాణికుడు ఆ ఫొటోలను ట్వీట్ చేశారు.

AP: కడప జిల్లా రాజంపేటలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. టికెట్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ఇవ్వడాన్ని పార్టీ సీనియర్ నేత బత్యాల చెంగల్రాయుడు వ్యతిరేకిస్తున్నారు. స్థానికేతరుడికి టికెట్ ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో సుగవాసిని వ్యతిరేకిస్తూ బత్యాల సొంతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీలోని రెండు వర్గాలు వేర్వేరుగా ప్రచారం నిర్వహిస్తుండటంతో కేడర్‌లో అయోమయం నెలకొంది.

CUET-PG ఫలితాల విడుదలపై UGC ఛైర్మన్ జగదీశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ‘CUET-PG ఫలితాలను ఇవాళ రాత్రిలోగా విడుదల చేసేందుకు NTA ప్రయత్నిస్తోంది. ఈ ఫలితాల ద్వారా దేశంలోని యూనివర్సిటీల్లో విద్యార్థులు పీజీ కోర్సుల్లో చేరవచ్చు. గుడ్‌లక్’ అని పోస్ట్ చేశారు.

AP: టెస్లా అధినేత మస్క్ భారత పర్యటనకు విచ్చేస్తున్న వేళ ఆయనకు ఆహ్వానం పలుకుతూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘మీరు భారత్ రావడం ఆనందంగా ఉంది. 2017లో మీరు చంద్రబాబు గారిని కలిసి ఆంధ్రప్రదేశ్‌పై ఆసక్తి కనబర్చారు. టెస్లా ప్లాంట్ నెలకొల్పేందుకు ఏపీ సరైన ఎంపిక. ఇక్కడ నైపుణ్యం కలిగిన యువత, సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. టెస్లా విషయంలో మీ లక్ష్యాలు నెరవేరేందుకు మా రాష్ట్రం సహాయపడుతుంది’ అని ట్వీట్ చేశారు.

పబ్లిక్ ఎగ్జామ్ రిజల్ట్స్ డెస్టినేషన్‌గా Way2News మరోసారి నిలిచింది. ఇవాళ విడుదలైన AP ఇంటర్ రిజల్ట్స్‌ను మన యాప్ అందరికంటే ముందు అందించింది. మిగతా ప్లాట్‌ఫాంలతో పోలిస్తే వేగంగా, సులభంగా ఫలితాలు ఇవ్వడంతో ఏకంగా 92% మంది విద్యార్థులు Way2Newsలో తమ రిజల్ట్స్ తెలుసుకున్నారు. ఇది మా వేగం, మా పట్ల యూజర్ల విశ్వాసం తెలిపేందుకు ఓ ఉదాహరణగా ఉంది. ఇదే ఉత్సాహంతో మిగతా పబ్లిక్ ఎగ్జామ్స్ రిజల్ట్స్‌నూ అందిస్తాం.

AP: ఉత్తరాంధ్రలో కూటమి పార్టీల్లో అసమ్మతి జ్వాలలు చల్లారడం లేదు. TDP నుంచి సీటు దక్కని శ్రీకాకుళం, పాతపట్నం Ex MLAలు లక్ష్మీదేవి, కలమట వెంకటరమణ అసంతృప్తితో ఉన్నారు. అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ.. పార్టీ అభ్యర్థులకు సహకరించం అని తెగేసి చెప్తున్నారు. అరకు TDP ఇన్‌ఛార్జ్ దొన్నుదొర ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటు పాలకొండ జనసేన టికెట్ దక్కని పడాల భూదేవి అసమ్మతి వ్యక్తం చేశారు.

AP: ఇవాళ విడుదలైన ఇంటర్ ఫలితాలు పలువురి ఇళ్లలో విషాదాన్ని నింపాయి. ఫెయిలయ్యాననే మనస్తాపంతో నరసరావుపేట(M) ఇక్కురు గ్రామంలో విద్యార్థిని అర్చన ఉరి వేసుకుని <<13037716>>ఆత్మహత్య<<>> చేసుకుంది. చిత్తూరు జిల్లాలోని శాంతిపురంలో గాయత్రి, రామకుప్పంలో మిత్ర పురుగుమందు తాగారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.
NOTE: జీవితంలో పరీక్షలు ఓ భాగం మాత్రమే.. పరీక్షలే జీవితం కాదు. ఫెయిలైన వారికి పేరెంట్స్ అండగా ఉండాలి.
Sorry, no posts matched your criteria.