News April 12, 2024

వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చిన KCR

image

TG: వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిపై కేసీఆర్ తన నిర్ణయం మార్చుకున్నారు. తొలుత తాటికొండ రాజయ్య ఎంపీగా పోటీ చేస్తారని ప్రకటించిన గులాబీ బాస్.. తాజాగా డా.మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ప్రకటించారు. సుధీర్ కుమార్ ప్రస్తుతం హనుమకొండ జడ్పీ ఛైర్మన్‌గా ఉన్నారు.

News April 12, 2024

మల్టిపుల్ సెక్స్ పార్ట్‌నర్స్‌ ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం ఎంతంటే!

image

భారత్‌కు చెందినవారు తన జీవిత కాలంలో సగటున ముగ్గురు లైంగిక భాగస్వాముల్ని కలిగి ఉన్నట్లు WPR అధ్యయనంలో తేలింది. 46దేశాల్లో సర్వే చేయగా భారత్ చివరి స్థానంలో నిలిచింది. కాగా సగటున ఓ వ్యక్తి 14.5 మంది లైంగిక భాగస్వాముల్ని కలిగి ఉండటంతో తుర్కియే దేశం తొలి స్థానంలో ఉంది. భారతీయ విలువలు, సంస్కృతే ఈ జాబితాలో మన దేశం అట్టడుగున నిలవడానికి కారణమని.. ఇది మంచి పరిణామమని విశ్లేషకులు చెబుతున్నారు.

News April 12, 2024

‘వాలంటీర్’ వ్యవస్థపై సినిమా

image

AP: సీఎం జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై సినిమా తెరకెక్కుతోంది. సూర్యకిరణ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా.. ప్రసిద్ధి దర్శకత్వం వహిస్తున్నారు. రాకేశ్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తిరుపతిలో ఈ సినిమా టైటిల్‌ను ఇవాళ లాంఛ్ చేశారు. వాలంటీర్లు రియల్ హీరోలని, ఈ గొప్ప వ్యవస్థపై సినిమా రావడం సంతోషకరమని నారాయణ స్వామి పేర్కొన్నారు.

News April 12, 2024

డైనోసార్ల మాదిరిగానే కాంగ్రెస్ అంతం: రాజ్‌నాథ్

image

కాంగ్రెస్ మునిగిపోయే నావ అని, డైనోసార్ల మాదిరిగానే కొన్నేళ్లలో అది అంతరించి పోతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోస్యం చెప్పారు. భవిష్యత్తులో కాంగ్రెస్ గురించి అడిగితే.. ఎవరని? పిల్లలు ప్రశ్నిస్తారని ఎద్దేవా చేశారు. హస్తం పార్టీలో అంతర్గత పోరు బిగ్‌బాస్ రియాల్టీ షోను తలపిస్తోందని, రోజూ నాయకులు చొక్కాలు చించుకుంటున్నారని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నుంచి వలసలు జోరుగా కొనసాగుతున్నాయన్నారు.

News April 12, 2024

తల్లి కోసం బాబా గుడి కట్టించిన స్టార్ హీరో

image

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన తల్లి శోభ కోరిక మేరకు చెన్నైలో సాయిబాబా దేవాలయం కట్టించారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘బాబా మందిరం నిర్మించాలని ఉందని విజయ్‌తో ఎన్నోసార్లు చెప్పా. నా ఇష్టాన్ని అర్థం చేసుకుని అతను గుడి కట్టించాడు. ప్రతి గురువారం నేను ఇక్కడికొచ్చి పూజలు చేస్తా. విజయ్ కూడా అప్పుడప్పుడూ వస్తుంటాడు’ అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం దళపతి.. GOAT అనే చిత్రంలో నటిస్తున్నారు.

News April 12, 2024

వివేకా హత్య కేసుపై సీబీఐ కోర్టులో విచారణ

image

వివేకా హత్య కేసుపై నాంపల్లి CBI కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వ్యక్తిగత హాజరుపై MP అవినాశ్, దస్తగిరి మినహాయింపు తీసుకోగా మిగతా ఐదుగురు నిందితులు కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో తనను సాక్షిగా పరిగణించాలని దస్తగిరి వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. దస్తగిరిని సాక్షిగా పరిగణించేందుకు తమకు అభ్యంతరం లేదని CBI తెలిపింది. దీనిపై వాదనలు పూర్తి కాగా తీర్పును ఈ నెల 29వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

News April 12, 2024

SIRAJ: వరల్డ్ కప్ ఆడాలని లేదా మియా?

image

టీమ్ ఇండియా తరఫున ఆడుతున్న ఏకైక తెలుగు ప్లేయర్ మహ్మద్ సిరాజ్ IPLలో పేలవ ప్రదర్శన చేస్తున్నారు. అతడి గణాంకాలు చూసి ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు. సిరాజ్ దారుణ ప్రదర్శన చూసి నిరాశ చెందుతున్నారు. ఈ IPLలో 6 మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లే తీశారు. మరోవైపు పరుగులు కూడా ధారాళంగా ఇచ్చేస్తున్నారు. ఇకనైనా సిరాజ్ తిరిగి తన ఫామ్ అందుకుంటే మంచిదని.. లేదంటే T20 WCలో చోటు కష్టమేనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

News April 12, 2024

ట్రెడ్ మిల్‌పై గిన్నిస్ రికార్డు

image

భారత అల్ట్రా మారథాన్ రన్నర్ సుమిత్ సింగ్ గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఒడిశాకు చెందిన అతడు ట్రెడ్ మిల్‌పై ఏకంగా 12 గంటల పాటు ఆపకుండా పరుగెత్తి ఈ ఘనత సాధించారు. మార్చి 12న ఉదయం 8.15 గంటలకు పరుగు ప్రారంభించి రాత్రి 8.20 గంటల వరకు కొనసాగించారు. మొత్తంగా 68.04 కిలోమీటర్లు పరుగెత్తడంతో తాజాగా అతడికి గిన్నిస్‌లో చోటు లభించింది.

News April 12, 2024

కేసుల వివరాలివ్వాలని చంద్రబాబు పిటిషన్

image

AP: తమపై నమోదైన కేసుల పూర్తి వివరాలు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, అయ్యన్నపాత్రుడు, ఇతర నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ నెల 16 లోగా కేసుల వివరాలను అందించాలని డీజీపీకి మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది.

News April 12, 2024

10వేల మంది ప్రెషర్స్‌కి TCSలో ఉద్యోగాలు

image

TCS సంస్థ ఇటీవల 10వేల మంది ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకుంది. దేశంలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీల నుంచి నియమించుకున్న వీరికి నింజా, డిజిటల్, ప్రైమ్ కేటగిరీల్లో ఉద్యోగాలు కల్పించింది. రూ.3.36 లక్షల నుంచి రూ.11.5 లక్షల జీతం ఆఫర్ చేసింది. VIT కాలేజీలో అత్యధికంగా 963 మందికి ఆఫర్ లెటర్లు వచ్చాయి. కోడింగ్‌లో అద్భుతమైన స్కిల్స్, బిజినెస్ ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేసే నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసింది.