India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రైతు భరోసా(రైతుబంధు) ఎన్ని ఎకరాల వారికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఇప్పటికే ఆదర్శ రైతుల అభిప్రాయం సేకరించిన అధికారులు.. మరింత మంది సలహాలు స్వీకరించనున్నారు. ప్రతి సహకార సంఘంలోని రైతుల ఆలోచనలు తీసుకోనున్నారు. 5 ఎకరాలు, 8, 10, 15, 20, 30 ఎకరాల్లోపు ఎవరికి ఇవ్వాలనే దాన్ని ప్రతిపాదించి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు.

TG: ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పీజీ ఎంట్రన్స్ టెస్ట్ హాల్‌టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. 8 వర్సిటీల్లోని 45 సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలకు 73,566 మంది దరఖాస్తు చేసుకున్నారు. జులై 15 వరకు పరీక్షలు జరగనున్నాయి. అటు ఇతర పరీక్షల కారణంగా ఈ నెల 7న జరగాల్సిన ఎంఈడీ పరీక్షను 16వ తేదీకి వాయిదా వేశారు. cpget.tsche.ac.in వెబ్‌సైటు నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చు.

AP: రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజ సంస్థ టెస్లాతో పాటు మరికొన్ని పెద్ద కంపెనీల యాజమాన్యాలకు అధికారులు లేఖలు రాశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం గురించి వివరిస్తున్నారు. 2019కి ముందు వివిధ సంస్థలతో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాల్లో ఎన్ని కార్యరూపం దాల్చాయి? మిగతా వాటి పరిస్థితి ఏంటన్న దాన్ని విశ్లేషిస్తున్నారు.

2024: హాథ్రస్(UP)-116 మంది మృతి
2023: ఇండోర్(MP)-36 మంది మృతి
2022: వైష్ణోదేవీ ఆలయం(J&K)-12 మంది మృతి
2014: పట్నా(బిహార్)-32 మంది మృతి
2013: దతియాలో(MP)-115 మంది మృతి
2011: ఇడుక్కి(KL)-104 మంది అయ్యప్ప భక్తులు మృతి
2008: చాముండా దేవీ ఆలయం(RS)-250 మంది మృతి
2008: నైనా దేవీ కోవెల(HP)-162 మంది మృతి
2005: మంధర్‌దేవీ ఆలయం(MH)-340 మంది మృతి

యూరో ఛాంపియన్ షిప్‌లో తుర్కియే, నెదర్లాండ్స్ క్వార్టర్స్ దూసుకెళ్లాయి. నిన్న రొమేనియాతో జరిగిన మ్యాచులో నెదర్లాండ్స్ 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ మొత్తం నెదర్లాండ్స్ ప్లేయర్ల డామినేషనే కొనసాగింది. మరో మ్యాచులో ఆస్ట్రియాపై తుర్కియే 2-1తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు ప్లేయర్ మెరిహ్ డెమిరల్ రెండు గోల్స్ చేయడం గమనార్హం. ఈ నెల 5 నుంచి 7 వరకు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచులు జరగనున్నాయి.

AP: శాఖలపై గతంలో గంటల పాటు సమీక్షలు నిర్వహించే CM చంద్రబాబు రూట్ మార్చారు. ఏ శాఖతో రివ్యూ అయినా 30 నిమిషాల్లోనే ముగించాలని ఉన్నతాధికారులకు సూచించారట. ఇసుక, రహదారులు, నిత్యావసరాలపై నిన్న సమీక్షించిన CM.. ఒక్కో శాఖకు 30 నిమిషాలే కేటాయించారు. అధికారులు ఏం చెప్పాలనుకున్నా 20 నిమిషాల్లోనే ముగించమని ఆదేశించారట. కందిపప్పుల ధరలు పెరగడాన్ని CM దృష్టికి తీసుకెళ్లగా, కేంద్రంతో మాట్లాడుతామని బదులిచ్చారు.

TG: డీఎస్సీ ద్వారా నియమితులయ్యే కొత్త టీచర్లు ఆగస్టులోనే వస్తారని విద్యాశాఖ ఉన్నతాధికారి తెలిపారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు DSC జరగనుంది. మరోవైపు ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. బదిలీలు, పదోన్నతుల్లో సమస్యలతో పాటు అనారోగ్య, ఇతర కారణాలను పోర్టల్‌లో నమోదు చేసుకోని పరిష్కరించుకోవచ్చన్నారు.

AP: రాయలసీమ, కృష్ణా డెల్టాలకు సాగు, తాగు నీరు అందించేందుకు పట్టిసీమ నుంచి ఇవాళ ఉదయం నీరు విడుదల చేయనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పట్టిసీమ నుంచి 7 వేల క్యూసెక్కులు, తాడిపూడి ఎత్తిపోతల నుంచి 870, పురుషోత్తపట్నం నుంచి 3500, పుష్కర నుంచి 1225 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామన్నారు. ఎగువ నుంచి వరద జలాలు రాకపోవడంతో కృష్ణా నదీ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటాయన్నారు.

TG: నిన్న రాష్ట్ర ప్రభుత్వం 231 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన విషయం తెలిసిందే. ఒకవేళ తిరిగి నేరాలకు పాల్పడితే వారికి క్షమాభిక్ష రద్దవుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 26నే ఈ ఉత్తర్వులు ఇవ్వాలని భావించినా కొన్ని కారణాలతో నిలిచిపోయింది. ఈ క్రమంలో ఖైదీల కుటుంబ సభ్యులు CM రేవంత్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దీంతో వారి విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

TG: రాష్ట్రంలో చిన్నారులపై వీధి కుక్కల దాడి <<13554509>>ఘటనలు<<>> తరచూ జరుగుతున్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుంటే సరిపోదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విధానాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయట్లేదని, సరైన ఆహారం లేక మనుషులపై దాడి చేస్తున్నాయని ఓ పిల్ దాఖలైంది.
Sorry, no posts matched your criteria.