India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ శాఖ స్పెషల్ సీఎస్-అనంతరామ్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్-సిసోడియా, భూపరిపాలన చీఫ్ కమిషనర్-జయలక్ష్మి, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ-కాంతీలాల్ దండే, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెకట్రరీ- గిరిజా శంకర్. బదిలీల పూర్తి జాబితా కోసం ఇక్కడ <

AP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న YCP ఆఫీసు కూల్చివేత ఘటనపై ఆ పార్టీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. CRDA కమిషనర్ కాటమనేని భాస్కర్, తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌కు న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. చట్టాన్ని మీరి వ్యవహరించొద్దని న్యాయస్థానం సూచించినా ఆఫీసును కూల్చివేయడం కోర్టు ధిక్కరణే అని YCP తరఫు లాయర్ పేర్కొన్నారు.

ఇంధన ట్యాంకర్లను క్లీన్ చేయకుండా అందులోనే వంట నూనెను సరఫరా చేస్తున్న వ్యవహారం చైనాలో సంచలనంగా మారింది. ఖర్చులు తగ్గించుకోవడానికే డ్రైవర్లు ఇలా చేస్తున్నారట. ఇలాంటి నూనెలను వాడటం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. చైనాలో ఆహార కల్తీ కొత్త కాదు. 2008లో మెలమైన్‌తో కల్తీ చేసిన పాలు తాగి ఆరుగురు పిల్లలు చనిపోగా, వేలాది మంది అనారోగ్యానికి గురయ్యారు.

వావి వరసలు మరిచి తండ్రీకూతుళ్లపై నీచంగా కామెంట్లు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అతడిపై సైబర్ సెక్యూరిటీ పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా ఆదేశాలిచ్చింది. కాగా ఫ్రెండ్స్‌తో కలిసి ప్రణీత్ తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్యకర కామెంట్లు చేశాడు. దీనిపై సినీ ప్రముఖులు, ప్రభుత్వం సీరియస్ అయిన విషయం తెలిసిందే.

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహానికి సర్వం సిద్ధమైంది. వీరి పెళ్లికి దేశీయ ప్రముఖులతోపాటు విదేశీ సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నారు. వారిని తరలించేందుకు ఏకంగా 100 విమానాలు, మూడు ఫాల్కన్ జెట్‌లను అంబానీ ఫ్యామిలీ ఏర్పాటు చేసింది. పెళ్లి తర్వాత కూడా వారిని తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు వీటిని ఉపయోగించనున్నారు. అనంత్-రాధిక వివాహం రేపు ముంబైలో జరగనుంది.

TG: మెదక్ జిల్లా రామాయంపేట గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. అక్కడ చదివే 12 మంది బాలికలను ఎలుకలు కరిచాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పాఠశాల నిర్వాహకులపై తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కామారెడ్డి(D) దేశాయ్‌పేట ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్‌పై పోక్సో కేసు నమోదైంది. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తేలడంతో ఆయనతో పాటు మరో 9 మందిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ED అభియోగ పత్రంలో పేర్కొంది. ‘లిక్కర్ పాలసీపై మంత్రుల కమిటీ ఏర్పాటనేది కట్టుకథ. సౌత్ గ్రూప్‌తో పాటు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు రూ.100 కోట్లు ముడుపులిచ్చారు. వీటిలో రూ.45 కోట్లను 2022 అసెంబ్లీ ఎన్నికలకు కేజ్రీవాల్ వాడుకున్నారు. BRS నాయకురాలు కవిత సౌత్ గ్రూప్‌తో కలిసి కుట్ర పన్నారు. మధ్యవర్తితో నిధులను ఆప్‌కు అందించారు’ అని ED పేర్కొంది.

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. సర్వర్ డౌన్ కావడం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రిజిస్ట్రేషన్లు జరగక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. సర్వర్ సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40కి.మీ వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

AP: ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తయితే ఇక్కడి యువత వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. ‘2026 జూన్ నాటికి విమానాశ్రయం తొలిదశ పూర్తి చేస్తాం. పారిశ్రామికంగా ఎదిగేందుకు ఈ ప్రాంతానికి మంచి అవకాశాలున్నాయి. భోగాపురం వరకు బీచ్ రోడ్డు నిర్మాణం కూడా జరగాలి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అన్నీ మొదటి నుంచి చేయాల్సి వస్తోంది’ అని భోగాపురం పర్యటనలో వ్యాఖ్యానించారు
Sorry, no posts matched your criteria.