News April 11, 2024

లక్నోకు రోహిత్ శర్మ.. కోచ్ ఏమన్నారంటే?

image

రోహిత్‌ను LSG దక్కించుకోనుందంటూ వస్తున్న వార్తలపై ఆ జట్టు కోచ్ లాంగర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. వేలంలో ఏ ఆటగాడిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అడగ్గా ‘నేను ఎవరి పేరు చెబుతానని మీరనుకుంటున్నారు?’ అని ఆయన తిరిగి ప్రశ్నించారు. ‘రోహిత్‌ను జట్టులోకి తీసుకోగలరా?’ అని అనడంతో ఆశ్చర్యపోయిన లాంగర్ ‘ఏంటీ.. రోహిత్‌ శర్మనా? OK. మేం అతడిని తీసుకుంటాం. మీరే ఈ డీల్ కుదర్చగలరు’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు.

News April 11, 2024

వావ్.. ఇది కదా దేశానికి కావాల్సింది!

image

కేరళ ప్రజలు మత సామరస్యాన్ని చాటారు. ముస్లింలు అధికంగా ఉండే ముత్తువల్లూర్ గ్రామంలో 400ఏళ్ల నాటి దుర్గాభగవతి ఆలయం ఉంది. అయితే ముస్లింలు, హిందువులు కలిసి ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆర్థిక సాయంతో ఆగిపోకుండా నిర్మాణ సామగ్రిని విరాళంగా ఇచ్చారు. అలా ఇరు వర్గాల ప్రజలు కలిసి ఆలయాన్ని పునరుద్ధరించారు. మేలో విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. హిందూ పండుగలకు క్రమం తప్పకుండా కూరగాయలు ఇస్తుండటం మరో విశేషం.

News April 11, 2024

నెగటివ్ రివ్యూస్‌పై కంప్లైంట్ ఇవ్వలేదు: విజయ్

image

తన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’కు నెగటివ్ రివ్యూ ఇస్తున్న వారిపై హీరో విజయ్ దేవరకొండ కంప్లైంట్ ఇచ్చారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈక్రమంలో ఓ సినీ జర్నలిస్టు దీనిపై విజయ్‌ను సంప్రదించగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇది ఫేక్ వార్త అని, కొవిడ్ సమయంలో అప్పటి HYD సీపీ అంజనీ కుమార్‌తో ఉన్న ఫొటోను ప్రస్తుతం షేర్ చేస్తున్నట్లు వెల్లడించారు.

News April 11, 2024

ఓటమి భయంతోనే వైసీపీ దాడులు: చంద్రబాబు

image

AP: ఓటమి భయంతోనే YCP <<13031157>>హింసా<<>> రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ‘ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్‌ను ప్రశ్నిస్తే బెదిరిస్తారా? ప్రభావతి కుటుంబాన్ని YCP రౌడీమూక చంపేస్తామని బెదిరించింది. అండగా నిలిచిన TDP నేత మోహన్‌పై దాడి చేశారు. దాడి సమయంలో పోలీసులు ఉన్నా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దాడికి బాలినేని శ్రీనివాస్‌రెడ్డే కారణం. నిందితులపై SP కఠిన చర్యలు తీసుకోవాలి’ అని బాబు డిమాండ్ చేశారు.

News April 11, 2024

మాల్దీవుల అధ్యక్షుడికి మోదీ విషెష్

image

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ దేశ ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకున్నారు. మాల్దీవుల సాంస్కృతిక, నాగరికత వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజలు కరుణ, సోదరభావం, ఐక్యతతో మెలగాలని అభిలషించారు. ఇది శాంతియుత ప్రపంచాన్ని నిర్మించడంలో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రంజాన్ కరుణ, దాతృత్వం, సామరస్యానికి ప్రతీక అని ఆయన తెలిపారు.

News April 11, 2024

REVIEW: విజయ్ ఆంటోనీ ‘లవ్‌గురు’

image

పెళ్లి ఇష్టంలేని అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి పడే ఇబ్బందుల కథే ‘లవ్ గురు’. బిచ్చగాడు, సలీం, సైతాన్ వంటి డిఫరెంట్ మూవీలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ జానర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఎప్పటిలాగే విజయ్ తన నటనతో, హీరోయిన్ మృణాళిని అభినయంతో మెప్పించారు. కామెడీ, ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి. కథలో కొత్తదనం లేకపోవడం, ముందే ఊహించే సీన్లు మైనస్.
రేటింగ్: 2.5/5

News April 11, 2024

ఇజ్రాయెల్‌కు 6 వేల మంది భారత కార్మికులు

image

నిర్మాణ రంగ పనుల కోసం భారత్ నుంచి 6000 మంది భారత కార్మికులు ఇజ్రాయెల్ వెళ్లనున్నారు. ఏప్రిల్, మే నెలల్లో వీరిని ప్రత్యేక విమానాల్లో అక్కడికి తరలించనున్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఇజ్రాయెల్‌లో పనిచేసే పాలస్తీనా కార్మికులను ఆ దేశం పంపించింది. వీరి స్థానంలో భారత్‌తో పాటు మరికొన్ని దేశాల నుంచి కార్మికులను రప్పించుకుంటోంది. వీరికి భారీ జీతాలు ఇవ్వనున్నట్లు సమాచారం.

News April 11, 2024

అయోధ్య రాముడికి ‘బంగారు రామాయణం’

image

అయోధ్య రాముడికి ఓ మాజీ IAS అధికారి ఏడు కిలోల బంగారు రామాయణాన్ని కానుకగా ఇచ్చారు. ఇది రూ.4.5-5 కోట్ల విలువ చేస్తుందని సమాచారం. 500లకు పైగా బంగారు పేజీలపై రాసిన ఈ రామాయణాన్ని ప్రధాన మందిరంలో ఉంచారు. 147 కేజీల బరువు ఉండే ఈ రామాయణం తయారీలో 140 కేజీల రాగి, వెండిని ఉపయోగించారు. ఇందులో 10,192 శ్లోకాలను లిఖించారు. కాగా ప్రాణప్రతిష్ఠ సమయంలోనే తన సంపాదనను బాల రాముడికి ఇస్తానని ఆ అధికారి ప్రతిజ్ఞ చేశారు.

News April 11, 2024

హార్దిక్ పాండ్య సోదరుడి అరెస్ట్

image

క్రికెటర్ హార్దిక్ పాండ్య సోదరుడు(సవతి తల్లి కొడుకు) వైభవ్ పాండ్య అరెస్ట్ అయ్యారు. వైభవ్, తన సోదరుడు, క్రికెటర్ కృనాల్ పాండ్య కలిసి 2021లో ఓ బిజినెస్ పెట్టారు. అందులో వైభవ్‌కు 20% వాటా ఉంది. కాగా.. అతడు భాగస్వాములకు తెలియకుండా సొంతంగా ఇదే తరహా వ్యాపారం మొదలుపెట్టారు. కొత్త బిజినెస్ కోసం పాత వ్యాపారం నుంచి రూ.4.3కోట్ల నిధులను మళ్లించారట. దీంతో అతడిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి.

News April 11, 2024

చైనాలో కోరింత దగ్గు విజృంభణ

image

కరోనా తర్వాత చైనాను మరో జబ్బు వణికిస్తోంది. ఆ దేశంలో కోరింత దగ్గు కేసులు అసాధారణంగా పెరుగుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మునుపెన్నడూ లేనంతగా ప్రజలు ఈ వ్యాధి బారినపడ్డారు. 13మంది మరణించారు. 2023లో ఇదే సమయంలో 1,421 కేసులు నమోదవగా 2024లో ఏకంగా 32,380 కేసులు వెలుగు చూశాయి. మరోవైపు కోరింత దగ్గుకు చైనా ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోంది.