News April 25, 2024

రైల్వే ప్రయాణికులకు అందుబాటు ధరలో భోజనం

image

జనరల్ క్లాస్ ప్రయాణికులకు సరసమైన ధరకే ఆహారం అందించే కార్యక్రమానికి రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. అన్‌రిజర్వ్‌డ్, జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్యాసింజర్లు పరిశుభ్రమైన భోజనం, స్నాక్స్ అందుబాటు ధరల్లో పొందగలరని రైల్వేశాఖ తెలిపింది. ఎకానమీ మీల్ ధర రూ.20, స్నాక్ మీల్ ధర రూ.50 కాగా.. ప్రధాన రైల్వేస్టేషన్లలో ఇవి అందుబాటులోకి వచ్చాయి.

News April 25, 2024

నేడు ఇంటర్ ఫలితాలు.. WAY2NEWSలో వేగంగా తెలుసుకోండి

image

TG: ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను నేడు ఉదయం 11 గంటలకు అధికారులు విడుదల చేయనున్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను WAY2NEWS యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. కాగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఇంటర్‌ పరీక్షలను 9,80,978 మంది విద్యార్థులు రాశారు. <<-se>>#ResultsFirstOnWay2News<<>>

News April 25, 2024

మెటా అధికార ప్రతినిధికి రష్యాలో ఆరేళ్ల జైలు శిక్ష

image

రష్యాలోని మిలిటరీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బహిరంగంగా ఉగ్రవాదాన్ని సమర్థించారంటూ ఆ దేశంలోని మెటా ప్లాట్‌ఫామ్స్ అధికార ప్రతినిధి ఆండీ స్టోన్‌కు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే శిక్ష వేశారంటూ అతని తరఫు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా ఈ అంశంపై మెటా ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యాలో FB, ఇన్‌స్టాను నిషేధించిన విషయం తెలిసిందే.

News April 25, 2024

అనకొండల స్మగ్లింగ్.. ఎయిర్‌పోర్టులో వ్యక్తి అరెస్ట్

image

బతికున్న 10 అనకొండలను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని బెంగళూరు ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతను 10 అనకొండలను చెక్ ఇన్ బ్యాగ్‌లో దాచి బ్యాంకాక్ నుంచి తీసుకొచ్చినట్లు గుర్తించారు. వన్యప్రాణుల అక్రమ రవాణాను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కాగా గత సెప్టెంబర్‌లో 72 పాములు, 55 పైథాన్స్, 17 కింగ్ కోబ్రాల అక్రమ రవాణాను అధికారులు అడ్డుకున్నారు.

News April 25, 2024

దేశం కోసం మా అమ్మ మంగళసూత్రం త్యాగం చేశారు: ప్రియాంకా గాంధీ

image

మహిళల మంగళ సూత్రాలనూ కాంగ్రెస్ వదలదంటూ మోదీ చేసిన ఆరోపణలపై ఆ పార్టీ నేత ప్రియాంకా గాంధీ స్పందించారు. బెంగళూరులో మాట్లాడుతూ.. ‘యుద్ధ సమయంలో ఇందిరా గాంధీ తన బంగారాన్ని విరాళమిచ్చారు. మా అమ్మ సోనియా దేశం కోసం తాళిబొట్టును త్యాగం చేశారు(రాజీవ్ గాంధీని ఉద్దేశించి)’ అని పేర్కొన్నారు. దేశంలో INC 55 ఏళ్లు అధికారంలో ఉందని, ప్రజల బంగారాన్ని, తాళి బొట్లను ఎప్పుడైనా లాక్కుందా? అని ప్రశ్నించారు.

News April 25, 2024

అనంతపురం: ఓటరు వరమిచ్చేదెవరికి?

image

AP: అనంతపురం పార్లమెంట్ స్థానంలో పార్టీలు ఈసారి బీసీ మంత్రాన్ని జపించాయి. మాలగుండ్ల శంకరనారాయణ(YCP), అంబికా లక్ష్మీనారాయణ(TDP) బరిలో దిగుతున్నారు. 2009 వరకు INCకి కంచుకోట లాంటి సెగ్మెంట్ ఇది. ఏకంగా 12 సార్లు ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. TDP 3సార్లు, CPI, YCP చెరోసారి గెలిచాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ, మరోసారి గెలవాలని టీడీపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 25, 2024

ఇవాళ్టి నుంచి KCR బస్సు యాత్ర

image

TG: ఎన్నికల ప్రచారంలో భాగంగా BRS అధినేత కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఉప్పల్, ఎల్బీ నగర్, నల్గొండ మీదుగా సాయంత్రం మిర్యాలగూడలో రోడ్ షో చేస్తారు, రాత్రి సూర్యాపేట రోడ్‌షోలో ప్రసంగిస్తారు. మొత్తం 17 రోజులపాటు యాత్ర కొనసాగిస్తారు. మే 10 సిద్దిపేటలో బహిరంగసభతో ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు. కాగా రోజూ ఉదయం పొలం బాట, సాయంత్రం 2-3 ప్రాంతాల్లో రోడ్ షోలు ఉండనున్నాయి.

News April 25, 2024

క్రికెట్ దేవుడికి హ్యాపీ బర్త్ డే

image

క్రికెట్‌కే బ్రాండ్ అంబాసిడర్ లాంటి వ్యక్తి సచిన్. 3 దశాబ్దాల పాటు తన అద్భుతమైన ఆటతో క్రీడాభిమానులను అలరించారు. ఏ దేశమైనా, ఎలాంటి పిచ్‌ అయినా, బౌలర్ ఎంత ఉద్ధండుడైనా మాస్టర్ క్లాసిక్ ఆటకు తలొంచాల్సిందే అన్న రీతిలో హవా కొనసాగించారు. క్రికెట్ గ్రౌండే దేవాలయం, సచినే దేవుడు అన్నట్లుగా మెప్పు పొందారు. ఎన్నో రికార్డులను సృష్టించి భావి క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచారు. నేడు సచిన్ 51వ బర్త్ డే.

News April 25, 2024

మనిద్దరం కలిసి డాన్స్ చేద్దాం.. షారుఖ్‌తో మోహన్ లాల్

image

షారుఖ్ నటించిన జవాన్ మూవీలోని ‘జిందా బందా’ పాటకు మోహన్ లాల్ ఓ ఈవెంట్‌లో డాన్స్ చేశారు. దీనికి బాలీవుడ్ బాద్‌షా స్పందిస్తూ.. ‘ఈ పాటకు స్టెప్పులు వేసి దాన్ని ప్రత్యేకంగా నిలిపిన మోహన్ లాల్‌కు థాంక్స్. మీతో డిన్నర్ చేసేందుకు వేచి చూస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ‘కేవలం డిన్నరేనా? ఆ పాటకు మనమెందుకు డాన్స్ చేయకూడదు?’ అని కంప్లీట్ యాక్టర్ ప్రశ్నించారు. దీనికి ఓకే సార్ అంటూ షారుఖ్ రిప్లై ఇచ్చారు.

News April 25, 2024

కాంగ్రెస్ గెలిస్తే షరియా చట్టం తెస్తుంది: యోగి

image

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో షరియా చట్టాన్ని తీసుకొస్తుందని అన్నారు. మోదీ పాలనలోనే దేశంలోని టెర్రరిజం అంతమైందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు కలిసి దేశానికి తీవ్ర ద్రోహం చేశాయని ఆరోపించారు.