India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: మోసాలు చేసే చంద్రబాబు కావాలా? విశ్వసనీయతకు మారుపేరైన జగన్ కావాలా? తేల్చుకోవాలని సీఎం జగన్ అన్నారు. ‘సొంత బలం లేక పొత్తుల డ్రామా ఆడే నాయకుడు కావాలా? లేదా మంచి చేసి, ఆ చేసిన మంచిని చూపించే, సింహంలా సింగిల్‌గా వచ్చే నాయకుడు కావాలా? ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాడు చంద్రబాబు. పొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ డ్రామాలాడుతున్నాడు’ అని విమర్శించారు.

మొబైల్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను ఆర్బీఐ ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయొద్దని పేర్కొంది. డేటా సెక్యూరిటీకి సంబంధించి సమస్యలను సమగ్రంగా, సకాలంలో పరిష్కరించకపోవడంతో 35A సెక్షన్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 ప్రకారం చర్యలు తీసుకుంది.

AP: కరోనా కాలంలోనూ బటన్లు నొక్కడం ఆపలేదని సీఎం జగన్ తెలిపారు. ‘సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసిన చరిత్ర మాది. రూ.2.70 లక్షల కోట్లు ప్రజలకు పంచాం. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. మేనిఫెస్టోలో పేర్కొన్న 99 శాతం హామీలు నెరవేర్చాం. చంద్రబాబుకు రోజూ నన్ను తిట్టడమే పని. చంద్రబాబు లాంటి మోసగాడు కావాలా? జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా? అని ప్రజలను తేల్చుకోమన్నారు.

AP: మోసం చేయాలని ప్రయత్నిస్తున్న ఎన్డీఏ కూటమిని చెంప చెళ్లుమనిపించేలా ఓడించాలని సీఎం వైఎస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. నాకు ఓటు వేస్తేనే పథకాలు కొనసాగుతాయి. డబుల్ సెంచరీ కొట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలి. ఈ ఎన్నికలు ప్రతీ ఒక్కరి భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి. పెత్తందారుల ముఠాపై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి’ అని ఆయన కోరారు.

క్రికెట్‌లో టెక్నాలజీ హవా నడుస్తున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత సహాయంతో 90శాతం నిర్ణయాలు థర్డ్ అంపైర్లు తీసుకుంటే ఫీల్డ్ అంపైర్లు నామమాత్రంగా మారారని అన్నారు. ఫీల్డ్ అంపైర్లు విచక్షణతో సొంత నిర్ణయాలు తీసుకుంటేనే మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి విషయంలో థర్డ్ అంపైరే నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఫీల్డ్ అంపైర్ల అవసరమే లేదన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. మే 6న తీర్పును వెల్లడిస్తామని తెలిపింది.

తమిళ స్టార్ హీరో విజయ్‌తో సినిమా ఇప్పట్లో కష్టమేనని దర్శకుడు వెట్రిమారన్ అన్నారు. ఓ అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చాలా రోజుల క్రితం విజయ్‌కి ఓ కథ చెప్పినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవచ్చని చెప్పారు. ప్రస్తుతం వెట్రిమారన్ ‘విడుతలై పార్ట్-1’ సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రంలో నటిస్తున్నారు.

కర్ణాటకలో ముస్లింలు బ్యాక్‌వర్డ్ క్యాస్ట్‌లలో భాగం కావడాన్ని నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వార్డ్ క్లాసెస్ (NCBC) తప్పుపట్టింది. ‘ముస్లింలు ఓబీసీ పరిధిలోకి వస్తారని కర్ణాటక ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 17 ముస్లిం వర్గాలు కేటగిరీ-1, మరో 19 ముస్లిం వర్గాలు కేటగిరీ-2A పరిధిలోకి వస్తాయి. ముస్లిం వర్గాల్లో నిరుపేదలు ఉన్నా ఆ మతం మొత్తాన్ని వెనుకబడిన వర్గంగా పరిగణించడం సరికాదు’ అని పేర్కొంది.

TG: ఇంటర్ ఫెయిల్ అయినందుకు ఇద్దరు అమ్మాయిలు తనువు చాలించారు. మెదక్ జిల్లా శేరిపల్లిలో ఇంటర్ సెకండియర్ బాలిక పంబాల రమ్య ఉత్తీర్ణత సాధించలేదు. మనస్తాపానికి గురైన ఆమె.. గ్రామ శివారులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లాలోనూ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ కావడంతో తేజస్విని అనే విద్యార్థిని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
**ఫెయిలైతే సప్లిమెంటరీలో పాస్ కావొచ్చు. కానీ జీవితం తిరిగి రాదు.

యూపీ టెన్త్ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచిన బాలిక ముఖంపై అవాంఛిత రోమాలు ఉండటాన్ని పలువురు ట్రోల్ చేశారు. ఆ పరిస్థితిని PCOD అంటారని వైద్యులు చెబుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత కారణంగా తలెత్తే ఈ ప్రాబ్లమ్ వల్ల నెలసరి సక్రమంగా రాకపోవడం, అధిక రక్తస్రావం, బరువు పెరగడం వంటి పలు ఇబ్బందుల్ని PCOD మహిళలు ఎదుర్కొంటుంటారు. అలాంటి వారికి వీలైతే అండగా ఉండాలి తప్ప గేలి చేయడం సరికాదని సూచిస్తున్నారు నిపుణులు.
Sorry, no posts matched your criteria.