India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహేశ్ ‘మురారి’ ఫ్లాప్ అంటూ ఓ వెబ్‌సైట్‌కు చెందిన ట్విటర్ హ్యాండిల్ చేసిన ట్వీట్‌పై ఆ సినిమా దర్శకుడు కృష్ణవంశీ స్పందించారు. ‘నేను మురారి ‘తూర్పుగోదావరి’ హక్కుల్ని నిర్మాత వద్ద రూ.55లక్షలకు కొన్నాను. రూ.1.30కోట్లు వచ్చాయి. సక్సెస్‌కు లాభాలే కొలమానమైతే ఆ సినిమా హిట్టో కాదో మీరే డిసైడ్ చేయండి’ అని పేర్కొన్నారు. రిప్లై ఇంకొంచెం ఘాటుగా ఇవ్వాల్సిందంటూ ఓ అభిమాని కోరగా తప్పని కృష్ణవంశీ వారించారు.

కేరళలో నిఫా వైరస్ సోకిన 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మళప్పురం జిల్లాకు చెందిన బాలుడికి శుక్రవారం నిఫా వైరస్ నిర్ధారణ కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈరోజు ఉదయం మూత్రం ఆగిపోయిందని, కాసేపటికే తీవ్రమైన గుండెపోటుతో మరణించినట్లు అధికారులు తెలిపారు. అతడికి ఎవరెవరు దగ్గరగా వచ్చారనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు. 2018 నుంచి కేరళలో నిఫా వైరస్ వల్ల 21 మంది చనిపోయారు.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(82) పుట్టినరోజు సందర్భంగా PM మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషెస్ తెలిపారు. ‘ఖర్గేజీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సుదీర్ఘ జీవితాన్ని గడపాలని ప్రార్థిస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే ఖర్గేజీ. ప్రజలకోసం మీరు చేస్తున్న సేవ, మీ నిబద్ధత స్ఫూర్తిదాయకం. మీరు మరింత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు.

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. బీజేపీ ఆయన ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని దుయ్యబట్టారు. ‘మొదట్లో స్వీట్లు తింటూ కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆహారం తగ్గించారని అంటున్నారు. ఎవరైనా తమ ప్రాణాలపైకి తామే ఎందుకు తెచ్చుకుంటారు?’ అని ప్రశ్నించారు.

మహిళల ఆసియా కప్ టోర్నీలో భారత్‌తో జరుగుతున్న మ్యాచులో యూఏఈ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ తరఫున తనూజా కన్వర్ అరంగేట్రం చేస్తున్నారు
IND: షఫాలీ వర్మ, మంధాన, హేమలత, హర్మన్ ప్రీత్, రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రేణుకా సింగ్, తనూజా
UAE: ఈశా, తీర్థ, రినిత, సమైరా, కవిశా, ఖుషి శర్మ, హీనా, వైష్ణవి, రితికా, లావణ్య, ఇందూజ

TG: ECET-2024 ఫైనల్ ఫేజ్ సీట్లను అధికారులు కేటాయించారు. 22,365 మంది విద్యార్థులు క్వాలిఫై కాగా.. వారిలో 14,212 మంది సర్టిఫికెట్లు వెరిఫికేషన్ పూర్తి చేసుకుని, 9646 మంది ఆప్షన్లు ఎంచుకున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 23లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు వెల్లడించారు. లేదంటే అలాట్‌మెంట్ ఆర్డర్లు రద్దువుతాయని హెచ్చరించారు.

వచ్చే ఫిబ్రవరిలో టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనున్న నేపథ్యంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్‌పై బీసీసీఐ దృష్టి సారించింది. 10 ఓవర్లు బౌలింగ్ చేయాల్సిన వన్డే ఫార్మాట్లో ఆయన ఎంత ఫిట్‌గా ఉన్నారనేదానిపై సెలక్టర్లలో సందేహాలున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో విజయ్ హజారే టోర్నీలో బౌలింగ్ ప్రదర్శనను నిశితంగా పరిశీలించనున్నారని బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ టోర్నీ ఈ ఏడాది చివర్లో జరగనుంది.

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ముఠాకు చెందినవారిగా అనుమానిస్తున్న ఫైజ్, పర్వేజ్ అనే ఇద్దరికి బాంబే హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. దావూద్‌తో సంబంధమున్నంత మాత్రాన ఉగ్రవాదులుగా పరిగణించలేమని వ్యాఖ్యానించింది. ‘UAPA చట్టం కేవలం దావూద్‌పై ప్రయోగించారు. అతడి ముఠాతో సంబంధం ఉన్నవారికి అది వర్తించదు’ అని స్పష్టం చేసింది. ఫైజ్ వద్ద పట్టుకున్న 600 గ్రాముల గంజాయి స్వల్ప మొత్తమేనని పేర్కొంది.

AP: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులు జరిగే ఈ సమావేశాల్లో 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. రేపు ఉ.10 గంటలకు గవర్నర్ శాసనసభ, మండలిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాంతిభద్రతలు, మద్యం, ఆర్థిక శాఖలపై శ్వేతపత్రాలను అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేయనుంది.

AP: రాష్ట్రంలో ప్రాజెక్టులు ‘జల’కళకళలాడుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు వరద వెల్లువెత్తుతోంది. శ్రీశైలంలో గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 817 అడుగులకు చేరింది. జూరాల నుంచి దీనిలోకి 97,208 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రకాశం బ్యారేజీలో 14 గేట్ల ద్వారా 10,150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఏలూరు జిల్లా పోలవరం స్పిల్‌వే వద్ద నీటి మట్టం 31.7 మీటర్లకు చేరింది.
Sorry, no posts matched your criteria.