News July 21, 2024
పాండ్య బౌలింగ్ ఫిట్‌నెస్‌పై సెలక్టర్ల పర్యవేక్షణ
వచ్చే ఫిబ్రవరిలో టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనున్న నేపథ్యంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్‌పై బీసీసీఐ దృష్టి సారించింది. 10 ఓవర్లు బౌలింగ్ చేయాల్సిన వన్డే ఫార్మాట్లో ఆయన ఎంత ఫిట్‌గా ఉన్నారనేదానిపై సెలక్టర్లలో సందేహాలున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో విజయ్ హజారే టోర్నీలో బౌలింగ్ ప్రదర్శనను నిశితంగా పరిశీలించనున్నారని బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ టోర్నీ ఈ ఏడాది చివర్లో జరగనుంది.
Similar News
News October 13, 2024
ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా
శ్రేయస్ అనేక ప్రొడక్ట్ డిజైనర్ వర్క్‌ఫ్రం హోం కారణంగా ఓ సంస్థలో తక్కువ జీతానికి చేరారు. మొదటి రోజే 9 గంటలు కాకుండా 12-14 గంటలు పనిచేయాలని, అది కూడా కాంపెన్సేషన్ లేకుండా చేయాలని మేనేజర్ ఆదేశించారట. పైగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఓ ఫ్యాన్సీ పదమని తీసికట్టుగా మాట్లాడడంతో శ్రేయస్ ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా చేశారు. ఆ మెయిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరలైంది.
News October 13, 2024
బాహుబలి-2ను దాటేసిన దేవర
తెలుగు రాష్ట్రాల్లో 16వ రోజు కలెక్షన్ల షేర్‌లో బాహుబలి-2 రూ.3.50 కోట్లతో అగ్రస్థానంలో ఉండేది. ఆ రికార్డును ఎన్టీఆర్ ‘దేవర’ దాటేసింది. 16వ రోజున రూ.3.65కోట్లు వసూలు చేసింది. ఈ జాబితాలో తర్వాతి మూడు స్థానాల్లో హను-మాన్(రూ.3.21కోట్లు), RRR (రూ.3.10కోట్లు), F2(రూ.2.56 కోట్లు) ఉన్నాయి. గత నెల 27న విడుదలైన ‘దేవర’ తాజాగా రూ.500 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.
News October 13, 2024
ఉపాధి హామీ పనుల ప్రభావంపై అధ్యయనం
క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పథకం పనితీరు, దాని ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నీతి ఆయోగ్ DMEO శాఖ అధ్యయనానికి బిడ్లు ఆహ్వానించింది. వివిధ దశల్లో కన్సల్టెంట్లను ఎంపిక చేస్తారు. క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే ద్వారా గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన పనుల ప్రభావంపై కన్సల్టెంట్ అధ్యయనం చేసి ఆరు నెలల్లోపు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.