India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉంది. ICMR అంచనాల ప్రకారం 2022లో దేశంలో 2,16,108 బ్రెస్ట్ క్యాన్సర్ కేసులున్నాయి. అయితే దీనిని ఇంటి వద్దే గుర్తించొచ్చంటున్నారు వైద్య నిపుణులు. ‘అద్దం ముందు నిల్చుని రొమ్ముల్ని చేతితో క్షుణ్ణంగా పరిశీలించండి. పుళ్లు పడటం, చనుమొనలు స్రవించడం, రొమ్ము, చంకల్లో, చనుమొనల వెనుక గడ్డలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించండి’ అని సూచిస్తున్నారు.

నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను కొద్దిరోజుల పాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. శాతవాహన, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు, విజయవాడ- భద్రాచలంరోడ్, భద్రాచలంరోడ్- VJA, డోర్నకల్- VJA , VJA-డోర్నకల్ రైళ్లు ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు రద్దయ్యాయి. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఈ నెల 29, 31, ఆగస్టు 1 తేదీల్లో, దురంతో ఎక్స్‌ప్రెస్ ఈ నెల 30, 31 తేదీల్లో, నిజామాబాద్- పుణే రైలు ఈ నెల 31న అందుబాటులో ఉండదు.

కార్గిల్ యుద్ధంలో పాక్‌పై గెలిచి పాతికేళ్లు పూర్తైన సందర్భంగా కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. ‘అమరుల త్యాగఫలితంతో ఈరోజు కార్గిల్ విజయ్ దివస్‌ను జరుపుకొంటున్నాం. మన జవాన్లు ఎంతో సాహసంతో పోరాడారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు. శ్రీనగర్, లద్దాక్‌ను అభివృద్ధి చేసుకుంటున్నాం. టన్నెల్ పూర్తయితే లద్దాక్ మరింత వేగంగా పురోగమిస్తుంది’ అని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ‘దేవర’పై శేఖర్ మాస్టర్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ షేర్ చేశారు. డాన్స్‌కు ప్రాధాన్యమున్న పాటలో ఎన్టీఆర్‌తో స్టెప్పులేయించనున్నట్లు తెలిపారు. 2రోజుల్లో ఆ షూట్ స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ గత సినిమాల్లో పక్కా లోకల్, యాపిల్ బ్యూటీ వంటి హిట్ సాంగ్స్‌కు శేఖర్ పనిచేశారు. ఈ నేపథ్యంలో ‘దేవర’ డాన్సులు ఎలా ఉండనున్నాయా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TG: పంచాయతీ ఎన్నికలపై మంత్రి సీతక్క, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. కులగణన జరిగితేనే రిజర్వేషన్ల పెంపు చేయాలన్న సుప్రీం ఆదేశాలతో సాధ్యాసాధ్యాలను ఆయన పరిశీలించనున్నారు. మరోవైపు గ్రామపంచాయతీల టర్మ్ ముగిసి ఆరు నెలలు కావొస్తుంది. దీంతో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యంగా రుణమాఫీని అమలు చేయడంతో రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. 7 నెలల వడ్డీ చెల్లించాకే, రుణమాఫీ చేస్తామని బ్యాంకర్లు వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. దీంతో అన్నదాతలు కొత్త అప్పులు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వమే వడ్డీని భరించాలని, రైతుల నుంచి వసూలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి మొత్తం 117 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఈ ప్లేయర్లలో 70 మంది పురుషులు, 47 మంది మహిళలు. మొత్తం 69 ఈవెంట్లలో భారత్ పాల్గొంటుంది. ఇందులో అత్యధిక వయసున్న ప్లేయర్ రోహన్ బోపన్న(44), అతిపిన్న వయస్కురాలు ధినిధి(14) కూడా పాల్గొంటున్నారు. అథ్లెట్లతో పాటు 140 మంది స్టాఫ్, అధికారులు పారిస్ వెళ్లారు. <<-se>>#Olympics2024<<>>

జేమ్స్ బాండ్ హీరో జార్జ్ లాజెన్‌బీ తన సినీ కెరీర్‌కు స్వస్తి పలికారు. 1969లో వచ్చిన ‘ఆన్ హర్ మెజేస్టిస్ సీక్రెట్ సర్వీస్’ చిత్రంలో ఐకానిక్ బాండ్ రోల్‌లో ఆయన నటించారు. రిటైర్మెంట్ నిర్ణయం అంత తేలిక కాదని, ఇకపై నటనతో పాటు ఈవెంట్లకు దూరంగా ఉంటానని తెలిపారు. ఇంటర్వ్యూలుకు స్వస్తి పలుకుతున్నట్లు ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు. మ్యాన్ ఫ్రమ్ హాంకాంగ్, నెవర్ టూ యంగ్ టు డై వంటి చిత్రాల్లో ఆయన నటించారు.

ప్రపంచంలో ఆదరణ పొందిన ఈవెంట్లను ఉద్దేశించి ఎప్పటికప్పుడూ గూగుల్ స్పెషల్ డూడుల్‌ను ప్రదర్శిస్తూ వస్తోంది. ఇవాళ పారిస్‌లో ఒలింపిక్స్ ప్రారంభం కానుండగా నదిలో ఈదుతున్న పక్షులతో కూడిన స్పెషల్ డూడుల్‌ను రూపొందించింది. చరిత్రలో తొలిసారి సెన్ నది వేదికగా ఈ ప్రారంభోత్సవం జరగనుంది. 6 కిలోమీటర్ల మేర పడవల్లో 205 దేశాల అథ్లెట్లు పరేడ్ నిర్వహిస్తారు.
<<-se>>#Olympics2024<<>>

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గొర్రెల పంపిణీ పథకానికి నిధులేమీ కేటాయించలేదు. దీంతో గత ఆరేళ్లుగా అమలవుతున్న ఆ పథకం ఇక లేనట్లేనని తెలుస్తోంది. వీటి పంపిణీలో అవినీతి ఆరోపణలున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్యకు కూడా బడ్జెట్‌లో నిరాశే దక్కింది. దీంతో ఆయా వర్గాల్లో ఆందోళన మొదలైంది. యాదవ, కురుమ వర్గాలకు గత BRS ప్రభుత్వం ఈ స్కీంను తెచ్చిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.