News July 26, 2024

ఆ తేదీల్లో శాతవాహన, గోల్కొండ రైళ్లు రద్దు

image

నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను కొద్దిరోజుల పాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. శాతవాహన, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు, విజయవాడ- భద్రాచలంరోడ్‌, భద్రాచలంరోడ్‌- VJA, డోర్నకల్‌- VJA , VJA-డోర్నకల్‌ రైళ్లు ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు రద్దయ్యాయి. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఈ నెల 29, 31, ఆగస్టు 1 తేదీల్లో, దురంతో ఎక్స్‌ప్రెస్ ఈ నెల 30, 31 తేదీల్లో, నిజామాబాద్- పుణే రైలు ఈ నెల 31న అందుబాటులో ఉండదు.

Similar News

News February 6, 2025

పడుకునే ముందు ఈ పనులు చేస్తే..

image

రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు వ్యాయామం చేయడం మానుకోవాలి. దీని వల్ల శరీరం ఉత్తేజితమై నిద్రకు ఆటంకం కలుగుతుంది. కాఫీ, చాక్లెట్లు తినకూడదు. వీటిలో ఉండే కెఫీన్ నిద్రలేమిని కలిగిస్తుంది. నిద్రించేముందు ఆల్కహాల్ తీసుకోకూడదు. అలాగే నీరు కూడా ఎక్కువగా తాగకూడదు. రాత్రి వేళల్లో స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉండాలి. పడుకునే ముందు ఫోన్‌ను వేరే గదిలో ఉంచడం బెటర్.

News February 6, 2025

కోహ్లీ గాయం శ్రేయస్‌కు వరమైంది!

image

కోహ్లీ గాయపడటం వల్లే ENGతో తొలి వన్డేలో తనకు ఆడే అవకాశం వచ్చిందని శ్రేయస్ అయ్యర్ తెలిపారు. ‘మ్యాచులో ఆడట్లేదని తెలిసి నిన్న రాత్రి సినిమా చూద్దామని అనుకున్నా. అప్పుడే కెప్టెన్ నుంచి కాల్ వచ్చింది. కోహ్లీ మోకాలికి గాయమైందని, అతని స్థానంలో ఆడేందుకు సిద్ధంగా ఉండమని చెప్పారు. అందుకే తొందరగా నిద్రపోయా’ అని మ్యాచ్ అనంతరం వెల్లడించారు. ఈ మ్యాచులో శ్రేయస్ 36 బంతుల్లో 59 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.

News February 6, 2025

కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ

image

TG: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఢిల్లీలో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఎంపీలు కూడా వేణును కలిశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ పనితీరు, మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆయనతో చర్చిస్తున్నట్లు సమాచారం.

error: Content is protected !!