India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఆమె సహ వ్యోమగామితో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో చిక్కుకున్నారు. 50 రోజుల క్రితమే ఇద్దరూ భూమికి తిరిగిరావాల్సి ఉండగా, వారిని తీసుకురావాల్సిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వారు భూమికి ఎప్పుడు, ఎలా వస్తారోనన్న ఆసక్తి నెలకొంది. సమస్య ఉన్నప్పటికీ వ్యోమగాములు సానుకూల దృక్పథంతో ఉన్నారని నాసా తెలిపింది.

అట్టహాసంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 1900, 1924ల్లో ఆతిథ్యం ఇచ్చిన ఫ్రాన్స్ మళ్లీ వందేళ్ల తర్వాత ఈ పోటీలకు వేదికైంది. ఈసారి పోటీల్లో పురుషులతో దాదాపు సమానంగా మహిళా అథ్లెట్లు ఉండటం విశేషం. అథ్లెట్లలో 5,630 మంది పురుషులు, 5,416 మంది మహిళలు ఉన్నారు. అందుకే దీనిని ఒలింపిక్స్ చరిత్రలో లింగసమానత్వం సాధించిన తొలి టోర్నీగా ఒలింపిక్ కమిటీ పేర్కొంది. <<-se>>#Olympics2024<<>>

ఈ పోటీలకు రూపొందించిన పతకాలకూ ఓ ప్రత్యేకత ఉంది. ఐఫిల్ టవర్ రినోవేషన్ సమయంలో వెలికితీసిన ఇనుమును వీటి తయారీలో వాడారు. ప్రతీ మెడల్‌లోనూ 18 గ్రాముల ఐఫిల్ టవర్ ఇనుము ఉంటుందట. బోట్లలో అథ్లెట్ల పరేడ్ నిర్వహించడం ఒలింపిక్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ టోర్నీ నిర్వహణ కోసం ఫ్రాన్స్ దాదాపు $10 బిలియన్లు ఖర్చు చేస్తోంది. పారిస్‌లో జరిగిన పోటీల (1900) ద్వారానే భారత్ ఒలింపిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. <<-se>>#Olympics2024<<>>

దిగుమతి సుంకం (కస్టమ్స్ డ్యూటీ) తగ్గింపుతో బంగారు ఆభరణాలకు గిరాకీ పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజుల్లోనే 10 గ్రాముల గోల్డ్, సిల్వర్ ధరలు వరుసగా రూ.5వేలు, రూ.7వేల మేరకు దిగొచ్చాయి. తగ్గిన ధరల నుంచి లాభం పొందేందుకు ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులవైపు ఆసక్తి చూపే అవకాశం ఉందంటున్నారు.

కొత్త కోచ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్య కాంబోలో టీమ్ ఇండియా నేడు శ్రీలంకతో తొలి T20 మ్యాచ్ ఆడనుంది. రా.7గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సోనీ ఛానల్స్‌లో లైవ్ ప్రసారం కానుంది. IND తుది జట్టులో జైస్వాల్, గిల్, పంత్, సూర్య, హార్దిక్, దూబే, అక్షర్, అర్షదీప్, సిరాజ్ పేర్లు లాంఛనమే. మిగిలిన 2స్థానాల్లో వాషింగ్టన్, బిష్ణోయ్, ఖలీల్‌లో ఇద్దరు ఆడొచ్చు. అటు గాయాలతో శ్రీలంక పలువురు ఆటగాళ్లను మిస్ కానుంది.

తెలంగాణలో ఈ ఏడాది మే నాటికి 1,65,65,130 వాహనాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోషియో ఎకనమిక్ ఔట్లుక్ నివేదికను విడుదల చేసింది. గతేడాది ఇదే సమయానికి 1.54 కోట్ల వాహనాలు ఉంటే.. ఏడాది కాలంలోనే ఏకంగా 10.88 లక్షల వెహికల్స్ రోడ్లపైకి చేరాయని తెలిపింది. మొత్తం 1.65 కోట్ల వాహనాల్లో అత్యధికంగా 1,21,74,353 బైకులు ఉన్నాయని వివరించింది.

అత్యాచార బాధితులకు అబార్షన్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రెగ్నెన్సీ కొనసాగించడం లేక అబార్షన్ చేయించుకోవడం అనే దానిపై బాధిత మహిళలే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అబార్షన్‌కు అనుమతించాలని ఓ మైనర్ కోర్టును ఆశ్రయించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ బాధితురాలు బిడ్డకు జన్మనిచ్చి దత్తతు ఇవ్వాలని భావిస్తే ఆ ప్రక్రియను పూర్తిచేసే బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొంది.

విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు సెబీ మరో షాక్ ఇచ్చింది. భారత సెక్యూరిటీ మార్కెట్‌లో (స్టాక్స్, బాండ్స్ మొదలైనవి) ట్రేడింగ్ చేయకుండా మూడేళ్ల పాటు నిషేధం విధించింది. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి అక్రమంగా భారత మార్కెట్‌లోకి నిధులు మళ్లించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2006-2008 మధ్య మాల్యా ఈ అవకతవకలకు పాల్పడ్డారు. కాగా ఇలాంటి కేసులోనే 2018-2021 మధ్య కూడా సెబీ మాల్యాపై బ్యాన్ విధించింది.

ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు ఢిల్లీలో నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం జరగనుంది. ‘వికసిత భారత్ 2047’పై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు (రేవంత్ రెడ్డి-TG, సిద్దరామయ్య-KN, సుఖ్విందర్ సింగ్- HP) గైర్హాజరు కానున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నట్లు సమాచారం.

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు గ్రాండ్‌గా ముగిశాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ గేమ్స్ ప్రారంభమైనట్లు ప్రకటించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన జరిగింది. పలువురు అథ్లెట్ల చేతులు మారుతూ ఫైనల్ టార్చ్ ఐఫిల్ టవర్ నుంచి కౌల్‌డ్రోన్‌కు చేరింది. టెడ్డీ రినర్, మేరీ (ఫ్రెంచ్ అథ్లెట్లు) ఆ టార్చ్‌తో హాట్ ఎయిర్ బెలూన్ రూపంలోని జ్యోతిని వెలిగించారు. నింగికెగిసిన ఆ జ్యోతి చూపరులను ఆకట్టుకుంది. <<-se>>#Olympics2024<<>>
Sorry, no posts matched your criteria.