News July 31, 2024

భారత్-శ్రీలంక మ్యాచ్ టై

image

శ్రీలంక- భారత్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ టై అయ్యింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లూ 137 పరుగులే చేశాయి. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక ఒకానొక దశలో గెలిచేలా కనిపించింది. 15.2 ఓవర్లలో 110/2 స్కోరుతో బలంగా ఉన్న ఆ జట్టు.. ఆ తర్వాత 12 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోయింది. గెలుపు కోసం చివరి ఓవర్‌లో 6 పరుగులు చేయాల్సి ఉండగా, ఆశ్చర్యకరంగా సూర్య బౌలింగ్ వేశారు. 5 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టారు.

News July 30, 2024

ఒలింపిక్స్‌లో ఇండివిడ్యువల్‌గా పాల్గొనవచ్చా?

image

ప్రస్తుతం రష్యా, బెలారస్ దేశాల అథ్లెట్లు తమ దేశాల జెండాలతో పాల్గొనడంపై ఒలింపిక్ సంఘం నిషేధం విధించింది. దీంతో ఆయా దేశాలకు చెందిన కొందరు అథ్లెట్లు వ్యక్తిగతంగా ఇందులో పాల్గొంటున్నారు. అయితే వారు తమ దేశం కోడ్‌(RUS, BEL) కాకుండా AIN(అథ్లెట్స్ ఇండివిడ్యువల్ న్యూట్రల్) పేరుతో పాల్గొంటున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా, బెలారస్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నిషేధించింది. <<-se>>#Olympics2024<<>>

News July 30, 2024

రూ.1.30లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్

image

AP: 4 నెలల కాలానికి ₹1.30లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదం లభించేలా బడ్జెట్ రూపొందించింది. పూర్తిస్థాయి బడ్జెట్‌ను సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టే ఛాన్సుంది. రాష్ట్రంలో ఒకే ఏడాది 2 సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఇదే తొలిసారి. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు రేపటితో ముగియనుంది.

News July 30, 2024

రేపు రాలేను.. త్వరలోనే వస్తా: రాహుల్ గాంధీ

image

కేరళ: వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 123 మంది మృతి చెందారు. ఆ బాధిత కుటుంబాలను కలవడంతో పాటు పరిస్థితిని సమీక్షించడానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ రేపు వయనాడ్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఎడతెరిపిలేని వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా వేసుకున్నారు. త్వరలోనే వయనాడ్‌కు వస్తానని రాహుల్ X వేదికగా హామీ ఇచ్చారు. అటు కేరళకు తమిళనాడు రూ.5కోట్లు విరాళం ప్రకటించింది.

News July 30, 2024

‘హాయ్ నాన్న’ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ మూవీ?.. 2026లో షూటింగ్!

image

‘హాయ్ నాన్న’ సినిమా డైరెక్టర్ శౌర్యువ్‌తో Jr.NTR సినిమా చేయనున్నట్లు బాలీవుడ్ మీడియా తెలిపింది. ఈ యాక్షన్ మూవీ రెండు పార్టులుగా రానుందని, 2026లో పార్ట్-1 షూటింగ్ జరగనున్నట్లు పేర్కొంది. స్టోరీ డిస్కషన్స్ ఇప్పటికే జరిగాయని, తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 2028లో పార్ట్-1, 2031లో పార్ట్-2 రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు హీరో సన్నిహిత వర్గాలు తెలిపాయని ‘పింక్ విల్లా’ పేర్కొంది.

News July 30, 2024

ఎస్సీల కోసం కొత్త పథకాలు రూపొందించాలి: సీఎం

image

AP: ఎస్సీలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. 2014-2019 మధ్య కాలంలో అమలు చేసిన అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఎన్టీఆర్ విద్యోన్నతి, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, చంద్రన్న పెళ్లికానుక లాంటి పథకాలను గత ప్రభుత్వం నిలిపివేసిందని గుర్తు చేశారు. వాటితో పాటు మరిన్ని కొత్త పథకాలు రూపొందించాలని ఆదేశించారు.

News July 30, 2024

కొత్త రేషన్ కార్డులపై బిగ్ UPDATE

image

TG: త్వరలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్ అసెంబ్లీలో ప్రకటించారు. ఎల్లుండి మంత్రివర్గ సమావేశంలో దీనిపై విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. BRS హయాంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మంత్రి విమర్శించారు.

News July 30, 2024

CDPO, EO పోస్టుల ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

image

TG: మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. CDPO అభ్యర్థులకు జనవరి 3, 4న, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్(E0) అభ్యర్థులకు జనవరి 6, 7న పరీక్షలు ఉంటాయంది. గతేడాది నిర్వహించిన ఈ రెండు పరీక్షలను క్వశ్చన్ పేపర్ లీకేజీ కారణంగా టీజీపీఎస్సీ రద్దు చేసింది. 23 CDPO, 181 ఈవో పోస్టులను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.

News July 30, 2024

కొండచరియలు విరిగిపడటంలో రకాలు(2/2)

image

* ఫాల్స్: వాలు తక్కువుండే(దాదాపు నిటారుగా) ప్రాంతం నుంచి రాళ్లు, మట్టి హఠాత్తుగా కిందకు పడడం.
* టోపెల్స్: రాళ్లు, మట్టి ఉన్నచోట నుంచి కిందకు కూలిపోవడం.
* స్లైడ్స్: రాళ్లు, మట్టి కిందకు దొర్లుకుంటూ రావడం.
* స్ప్రెడ్స్: మట్టి, బురద వంటివి కింద ఆధారంగా ఉన్నప్రాంతం వదులుగా మారినప్పుడు కిందకు జారుకుంటూ వెళ్లడం.
* ఫ్లోస్: బురద వంటి వదులుగా ఉన్నవి కిందకు కొట్టుకుపోవడం.

News July 30, 2024

కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి?(1/2)

image

కొండలు వంటి ఎత్తైన ప్రాంతాల నుంచి రాళ్లు, మట్టి కిందకు జారిపడటాన్ని కొండచరియలు విరిగిపడటం అంటారు. ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో ఇలా జరుగుతుంది. వర్షం, మంచు కరగడం, నీటి మట్టాల్లో మార్పులు, ప్రవాహాల వల్ల కోత, భూగర్భ జలాల్లో మార్పులు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, మానవ కార్యకలాపాలు.. వంటివన్నీ కొండచరియలు విరిగిపడేందుకు కారణాలే. ఇందులో 5 రకాలుంటాయి. ఫాల్స్, టోపెల్స్, స్లైడ్స్, స్ప్రెడ్స్, ఫ్లోస్.