India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు 7 రోజులు కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి, హనుమకొండ, కామారెడ్డి, మహబూబాబాద్, జగిత్యాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 50-60 KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వానలు కురిసే జిల్లాల జాబితాను పైన ఫొటోలో చూడొచ్చు.

AP: కృష్ణా(D) గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నెల 22న నామినేషన్లు వేసేందుకు అనుమతి ఇవ్వాలని TDP, YCP అభ్యర్థులు పోలీసులను కోరారు. శాంతిభద్రతల పరిరక్షణ నేపథ్యంలో ఇద్దరూ ఒకేరోజు నామినేషన్ వేయడం కుదరదని తేల్చి చెప్పారు. ఇరు పార్టీలు మాత్రం తాము వెనక్కి తగ్గేది లేదని పట్టుబట్టడంతో రేపు ఏం జరుగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ తరఫున వెనిగండ్ల రాము, వైసీపీ నుంచి కొడాలి నాని బరిలో ఉన్నారు.

పాత్రకు ప్రాధాన్యం ఉంటే ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేందుకు నాగార్జున వెనుకాడట్లేదు. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించే చిత్రంలో నాగార్జున నటించనున్నట్లు తెలుస్తోంది. సినిమాకు కీలకమైన పాత్రలో ఆయన కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో శ్రుతిహాసన్ నటించనున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ధనుశ్ ‘కుబేర’ చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు.

నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో SRH పలు ప్రపంచ రికార్డులు సాధించింది. పవర్ ప్లేలో అత్యధిక బౌండరీలు(24), అత్యధిక సిక్సర్లు(11) కొట్టిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో 2014లో సస్సెక్స్‌పై శ్రీలంక కొట్టిన 20 బౌండరీల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. అలాగే అత్యంత వేగంగా(8.4 ఓవర్లు) 150 రన్స్ చేసిన జట్టుగా, తొలి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు(158) చేసిన టీమ్‌గా SRH ఘనత సాధించింది.

TG: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి జోరు పెంచారు. ఇవాళ ఆయన భువనగిరిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్‌కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతను పటిష్ఠం చేశారు. కాగా నిన్న మెదక్ పర్యటనలో మోదీ, కేసీఆర్‌పై రేవంత్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

AP: రాష్ట్రంలో పోస్టల్ బ్యాలట్ దరఖాస్తుల సమర్పణ గడువును ఈ నెల 26 వరకు పొడిగించినట్లు సీఈవో ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఉద్యోగులు ఎక్కడ ఉన్నా పనిచేసే చోటే ఫాం-12 ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. వారందరూ ఓటు వేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

TG: వేసవికాలంలో అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పంట చేతికొచ్చిన సమయానికి వడగండ్ల వానలతో పలు చోట్ల తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వరితో పాటు మొక్కజొన్న, మామిడి ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. నష్టపోయిన వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

AP: వడ్డీ కాసుల వాడి ఖజానా ఏటేటా పెరుగుతోంది. 2023-24లో భక్తులు సమర్పించుకున్న రూ.1,161 కోట్ల నగదు, 1,031 కేజీల బంగారాన్ని టీటీడీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. దీంతో శ్రీవారి నగదు డిపాజిట్లు రూ.18వేల కోట్లకు చేరుకున్నాయి. బంగారం నిల్వ 11,329 కేజీలకు చేరింది. ఈ మొత్తానికి ఏటా రూ.1,200 కోట్ల వడ్డీ వస్తోంది. అలాగే శ్రీవాణి ట్రస్టుకు నాలుగేళ్లలో రూ.1,200 కోట్ల విరాళాలు వచ్చాయి.

మే 13న జరిగే AP ఎన్నికల్లో ఓటు వేయాలని HYDలోని అక్కడి ఓటర్లు భావిస్తున్నారు. దీంతో ఏపీకి వెళ్లే రైళ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మే 10, 11, 12 తేదీల్లో నర్సాపూర్, గోదావరి, గరీభ్‌రథ్, శబరి, చార్మినార్, పద్మావతి, చెన్నై, వెంకటాద్రి సహా పలు రైళ్లలో భారీగా W/L ఉంది. కొన్ని రైళ్లలో W/L పరిధి దాటి రిగ్రెట్ కూడా వస్తోంది. దీంతో కొత్త రైళ్లు, క్లోన్ రైళ్లను రైల్వే శాఖ ప్రకటించాలని ఓటర్లు కోరుతున్నారు.

TG: ఇంటర్ ఫలితాలను ఈ నెల 24న విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేయనుంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు 9.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అటు టెన్త్ ఫలితాలను ఈ నెల 30న లేదా వచ్చే నెల 1న విడుదల చేయడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. టెన్త్, ఇంటర్ ఫలితాలను అందరికంటే ముందుగా WAY2NEWS యాప్‌లో పొందవచ్చు.
Sorry, no posts matched your criteria.