News May 13, 2024

కేజ్రీవాల్‌కు మరో ఊరట

image

అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ సీఎంగా తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న నేపథ్యంలో ఆయనకు సీఎంగా కొనసాగే అర్హత లేదంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిటిషనర్ వాదనలతో ఏకీభవించలేదు. కాగా లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు.

News May 13, 2024

రాష్ట్రాల వారీగా ఓటింగ్ శాతం @11AM

image

లోక్‌సభ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్‌లో ఉ.11గంటల వరకు 24.87 శాతం ఓటింగ్ నమోదైంది. ఏపీలో 23.10%, బిహార్ 22.54%, జమ్మూ కశ్మీర్ 14.94%, ఝార్ఖండ్ 27.40%, మధ్యప్రదేశ్ 32.38%, ఒడిశా 17.51%, మహారాష్ట్ర 17.51%, తెలంగాణ 24.31%, యూపీ 27.12%, వెస్ట్ బెంగాల్‌లో 32.78% ఓటింగ్ రికార్డు అయినట్లు ఈసీ వెల్లడించింది.

News May 13, 2024

పారిస్ ఒలింపిక్స్: రెజ్లింగ్‌లో దేశం నుంచి ఒకే ఒక్కడు

image

పారిస్ ఒలింపిక్స్‌కు భారత్ నుంచి పురుష రెజ్లర్లలో ఒక్కరు మాత్రమే అర్హత సాధించారు. 57 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో అమన్ సెహ్రావత్ పోటీ పడనున్నారు. మిగతా వారు క్వాలిఫయర్స్‌లో ఓటమితో ఈ పోటీలకు దూరమయ్యారు. 2004లో ఆరుగురు, 2008లో ముగ్గురు, 2012, 2016, 2020లో నలుగురు చొప్పున రెజ్లర్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ఈసారి ఒక్కరే వెళ్తుండడంతో దేశంలో రెజ్లింగ్ భవితవ్యంపై క్రీడాభిమానులు ఆందోళన చెందుతున్నారు.

News May 13, 2024

ఒక్క ఏడాదిలో దేశం గురించి ఏం తెలుస్తుంది?: మోదీ

image

ఈ ఎన్నికల్లో NDA కూటమి 400 సీట్ల మార్క్ దాటుతుందని ప్రధాని మోదీ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ‘మోదీని వ్యతిరేకిస్తే గెలుస్తామని ఇండియా కూటమి భావిస్తోంది. కానీ ఇప్పటివరకు ఆ కూటమి ప్రధాని అభ్యర్థినే తేల్చుకోలేదు. ఏడాదికి ఒకరిని చొప్పున ప్రధానిని చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు ఓ పేపర్‌లో చదివా. ఒక్క ఏడాదిలో దేశం గురించి ఆ ప్రధానికి ఏం తెలుస్తుంది? ఏం చేయగలడు?’ అని ప్రశ్నించారు.

News May 13, 2024

ఇవాళ ఎన్నికలు జరుగుతోన్న రాష్ట్రాలు ఇవే..

image

దేశంలో నేడు 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో ఏపీలో 25 (అసెంబ్లీ- 175), తెలంగాణలో 17 స్థానాలున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా-4, ఝార్ఖండ్-4, బిహార్-5, UP-13, MH-11, MP-8, WB-8, JK-1 సెగ్మెంట్లలో ఎలక్షన్ జరుగుతోంది. ఈ ఫేజ్‌లో17.7 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక 2019లో వీటిలో NDA-49, INDIA-11, నాడు రెండు కూటముల్లో లేని పార్టీలు 35 చోట్ల గెలిచాయి.

News May 13, 2024

ఉదయం 11 గంటలకు పోలింగ్ శాతం ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు ఏపీలో 23.10 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ పేర్కొంది. మరోవైపు తెలంగాణలో 24.31 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపింది. 2019లో ఇదే సమయానికి APలో 23.22 శాతం ఓటింగ్ నమోదవడం గమనార్హం.

News May 13, 2024

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

image

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను అధికారులు విడుదల చేశారు. 87.98% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం 0.65 పెరిగింది. అమ్మాయిల్లో 91.52 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇది అబ్బాయిలతో పోలిస్తే 6.40% అధికం.
వెబ్‌సైట్: https://cbseresults.nic.in/

News May 13, 2024

ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు

image

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సామాన్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మంత్రి రోజా, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి సీతక్క, మాజీ మంత్రి కేటీఆర్, హరీశ్‌రావు, మంచు మోహన్‌బాబు, విష్ణు, మనోజ్, నాగచైతన్య, దర్శకుడు రాఘవేంద్రరావు, కోట శ్రీనివాసరావు తదితరులు ఓటు వేశారు.

News May 13, 2024

అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు: డీజీపీ

image

TG: రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని డీజీపీ రవిగుప్తా తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు చెప్పారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. పోలింగ్ చివరి మూడు గంటలు అలర్ట్‌గా ఉంటామని పేర్కొన్నారు.

News May 13, 2024

ఎన్డీఏకు 400 సీట్లు రానున్నాయి: మోదీ

image

ఇప్పటివరకు జరిగిన ఎన్నికలను చూస్తే ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. భారత సైన్యంపై కాంగ్రెస్ తన ద్వేషాన్ని ప్రతిసారి చూపిస్తోందన్నారు. రామమందిర నిర్మాణం తర్వాత కాంగ్రెస్ వైఖరి అర్థమైందని.. తిరిగి రాముడిని టెంట్‌లోకి పంపాలని చూస్తోందని దుయ్యబట్టారు. ఇదంతా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమేనని విమర్శించారు.