News May 13, 2024

పల్నాడులో గొడవలపై ఈసీ ఆగ్రహం

image

AP: పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడు జిల్లాలో గొడవలు జరగడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘర్షణ జరిగిన ప్రాంతానికి ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా బయల్దేరారు. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని, అవసరమైతే అదనపు బలగాలను తరలించాలని అధికారులను ఈసీ ఆదేశించింది. రెంటచింతల మండల కేంద్రంలోని రెంటాలలో టీడీపీ, వైసీపీ వర్గాలు <<13236106>>ఘర్షణ<<>>కు దిగడంతో ఇద్దరు ఏజెంట్లకు గాయాలైన సంగతి తెలిసిందే.

News May 13, 2024

మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం: మోదీ

image

నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లందరూ భాగం కావాలని ప్రధాని మోదీ కోరారు. 96 లోక్‌సభ నియోజకవర్గాల్లోని ఓటర్లు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటారని, యువత, మహిళలు దీనికి బలం చేకూరుస్తారని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు.

News May 13, 2024

ఎన్నికల వేళ కరెంట్ కష్టాలు.. పోలింగ్‌కు ఇబ్బందులు!

image

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ వేళ పలు ప్రాంతాల్లో పవర్ కట్ కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తెలంగాణలోని కొమురం భీం(D) ఆసిఫాబాద్‌లో పవర్ కట్ వల్ల ఇంకా పోలింగ్ ప్రారంభం కానట్లు తెలుస్తోంది. రాత్రి నుంచి అక్కడ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. మరోవైపు ఏపీలోని అనంతపురం(D) రాయదుర్గంలో మాక్ పోలింగ్ నిలిచిపోయింది. భారీ వర్షం, పవర్ కట్‌తో పోలింగ్ సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు.

News May 13, 2024

ట్రెండింగ్‌లో ‘ఫిక్సింగ్’

image

నిన్న తప్పక గెలవాల్సిన మ్యాచుల్లో సీఎస్కే, RCB విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచులు ‘ఫిక్సింగ్’ అని నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఢిల్లీతో మ్యాచులో ఆర్సీబీ ఫిక్సింగ్ చేసిందని CSK ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. అందుకే DC ప్లేయర్లు క్యాచులు వదిలేశారని అంటున్నారు. మరోవైపు సీఎస్కేతో మ్యాచులో రాజస్థాన్ స్లోగా ఆడి ఫిక్సింగ్ చేసిందని ఆర్సీబీ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్స్?

News May 13, 2024

నేడే పోలింగ్.. పోటెత్తండి.. ఓటేయండి!

image

AP: నేడే పోలింగ్. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం రానిచోట ఎండ కూడా దంచికొట్టొచ్చు. ఎండైనా, వానైనా.. చివరికి తుఫాను వచ్చినా మీ హక్కును వినియోగించుకోవడం మానొద్దు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మీరు స్వయంగా పాలుపంచుకునే బాధ్యతను మరువొద్దు. ఐదేళ్లకోసారి వచ్చే ఈ అవకాశాన్ని మిస్ చేయొద్దు. మరచిపోకండి. పోలింగ్‌కు పోటెత్తండి. ఓటేయండి!

News May 13, 2024

దొంగ ఓటు వేయడానికి వెళ్తే కేసే!

image

ఎవరైనా ఓ వ్యక్తి దొంగ ఓటు వేయడానికి వచ్చారని పోలింగ్ ఏజెంట్లకు అనుమానం కలిగితే వారు ఆ వ్యక్తి గుర్తింపును సవాల్ చేస్తారు. ఇందుకోసం ప్రిసైడింగ్ అధికారికి రూ.2 డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. అనంతరం ఆ అధికారి విచారణ చేపడతారు. దొంగ ఓటు వేయడానికి వచ్చారని తేలితే సదరు వ్యక్తిని అక్కడున్న పోలీసులకు అప్పగించి, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తారు. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేస్తారు.

News May 13, 2024

మోదీతో చర్చకు రాహుల్‌కేం అర్హత ఉంది?: స్మృతి

image

ప్రధాని మోదీతో చర్చకు సిద్ధమంటున్న రాహుల్‌ గాంధీకి అసలు ఏం అర్హత ఉందంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ‘ఆయనేమైనా ప్రధాని అభ్యర్థా..? ఒకే వేదికపై ప్రధానితో చర్చించాలంటే ఆ స్థాయి వ్యక్తి అయి ఉండాలి. కాంగ్రెస్‌కు కంచుకోట వంటి అమేథీలో ఓ సాధారణ బీజేపీ కార్యకర్తపై పోటీ చేసే ధైర్యం లేని రాహుల్, ప్రధాని మోదీతో చర్చకు సిద్ధపడతారా?’ అని స్మృతి నిలదీశారు.

News May 13, 2024

నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

image

నేడు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు ఉన్నందున ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News May 13, 2024

జగన్, చంద్రబాబు, పవన్ ఓటు వేసేది ఇక్కడే..

image

*వైసీపీ అధినేత జగన్ పులివెందుల నియోజకవర్గంలోని భాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
*టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లాలోని ఉండవల్లి మండల పరిషత్ పాఠశాలలో ఓటు వేయనున్నారు.
*జనసేనాని పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

News May 13, 2024

భారతీయ పైలట్లను నియమించుకుంటాం: మాల్దీవులు

image

తమకు భారత్ విరాళమిచ్చిన రెండు హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ విమానాన్ని నడిపేందుకు భారతీయ పైలట్లనే నియమించుకుంటామని మాల్దీవుల రక్షణ మంత్రి ఘాసన్ మౌమూన్ తెలిపారు. ‘వాటిని నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు. గతంలో కొంతమంది శిక్షణ తీసుకున్నా అది పూర్తి స్థాయిలో జరగలేదు’ అని వివరించారు. దేశాధ్యక్షుడిగా ముయిజ్జు ఎన్నికైన తర్వాత మాల్దీవుల విదేశీ విధానం భారత్‌కు వ్యతిరేకంగా మారిన సంగతి తెలిసిందే.