News May 13, 2024

నేనున్నంత వరకు సీఏఏను ఎవరూ తొలగించలేరు: పీఎం మోదీ

image

తాను ఉన్నంత వరకు సీఏఏను ఎవరూ తీయలేరని ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ‘కాంగ్రెస్ ఒక వర్గాన్నే బుజ్జగిస్తుంటుంది. హిందువులు ఆ పార్టీకి ద్వితీయ శ్రేణి పౌరులు. ఇండియా కూటమి భాగస్వామి అయిన మమతా బెనర్జీ పాలనలో బెంగాల్‌లో రాముడి పేరు పలకడం కూడా నేరమే. శ్రీరామనవమి కూడా జరుపుకోనివ్వడం లేదు. కానీ రాముడిని బాయ్‌కాట్ చేయడం బెంగాల్ సంస్కృతి కాదు’ అని స్పష్టం చేశారు.

News May 13, 2024

ఓట్ల పండగకు వేళాయె

image

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్ నేడు జరగనుంది. ఏపీ(25), తెలంగాణ(17) సహా యూపీ 13, మహారాష్ట్ర 11, మధ్యప్రదేశ్ 8, పశ్చిమ బెంగాల్ 8, బిహార్ 5, ఒడిశా 4, ఝార్ఖండ్ 4, జమ్మూ కశ్మీర్‌లో ఒక స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటితో పాటు ఏపీలో 175, ఒడిశాలో 28 అసెంబ్లీ స్థానాలకు, TGలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఇవాళే పోలింగ్ జరగనుంది.

News May 13, 2024

నేడే పోలింగ్..

image

తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగకు వేళైంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ, తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఏపీలో 6 నియోజకవర్గాలు, తెలంగాణలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మినహా అన్ని చోట్లా ఉ.7 నుంచి సా.6 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ముగింపు సమయానికి పోలింగ్ కేంద్రం లోపల క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది.

News May 13, 2024

ఏపీలో ఓటర్ల లెక్కలు ఇవి..

image

*మొత్తం ఓటర్లు: 4,14,01,887
*మహిళలు: 2,10,58,615
*పురుషులు: 2,03,39,851
*ఇతరులు: 3,421
>>మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు
>>బరిలో 2,387 మంది అభ్యర్థులు
>>25 లోక్‌సభ నియోజకవర్గాలు.. బరిలో 454 మంది

News May 13, 2024

పీఓకేను స్వాధీనం చేసుకుని తీరతాం: అమిత్ షా

image

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకుని తీరతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. పీఓకేను భారత్ కలుపుకొనేందుకు యత్నిస్తే పాకిస్థాన్‌ అణుబాంబు వేస్తుందంటూ ఇండియా కూటమి నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అణుబాంబుల్ని చూసి రాహుల్ భయపడతారేమో.. మాకు అలాంటి భయాలేవీ లేవు. పీఓకే ఎప్పటికీ భారత్‌దే. దాన్ని స్వాధీనం చేసుకుని తీరతాం’ అని స్పష్టం చేశారు.

News May 13, 2024

కేజ్రీవాల్ గ్యారంటీల వర్షం

image

ఎన్నికల ముంగిట ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ మరింత దూకుడు పెంచారు. ఆయన పార్టీ తాజాగా 10 గ్యారంటీలను ప్రకటించింది. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే చైనా ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం, ప్రజలందరికీ ఉచితంగా విద్య, వైద్యం, విద్యుత్, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా, ఏటా 2 కోట్ల ఉద్యోగాల కల్పన, సైన్యంలో అగ్నివీర్ రద్దు తదితర హామీలు వాటిలో ఉన్నాయి.

News May 13, 2024

ఖర్గే హెలికాప్టర్ తనిఖీ.. కాంగ్రెస్ ఆగ్రహం!

image

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌ను బిహార్‌లోని సమస్తిపూర్‌లో ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్‌లో కూడా కేరళలో తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్డీయే నేతల్ని వదిలేసి కేవలం విపక్ష నేతల్నే అధికారులు లక్ష్యంగా చేసుకున్నారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై ఈసీ తమకు స్పష్టతనివ్వాలని డిమాండ్ చేసింది.

News May 13, 2024

నేడు చింతమడకకు కేసీఆర్ దంపతులు

image

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీసమేతంగా చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 11గంటలకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి కేసీఆర్ దంపతులు చింతమడకకు వెళ్తారని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి. ఇక ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్‌లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్‌లో సతీసమేతంగా ఓటేయనున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

News May 13, 2024

నేడు కొడంగల్‌కు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి దంపతులు నేడు కొడంగల్‌కు వెళ్లనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వస్థలానికి వెళ్లనున్న రేవంత్, రెండు రోజుల పాటు సతీసమేతంగా అక్కడే ఉంటారని తెలుస్తోంది. గడచిన రెండు నెలలుగా ఆయన సహా రాజకీయ నేతలందరూ ప్రచారంలో బిజీబిజీగా గడిపిన సంగతి తెలిసిందే.

News May 13, 2024

ఐపీఎల్‌లో నేడు: గుజరాత్‌కు చావో రేవో!

image

ఐపీఎల్‌లో భాగంగా నేడు KKR, GT అహ్మదాబాద్‌లో తలపడనున్నాయి. కోల్‌కతా ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరింది. గుజరాత్‌కు మాత్రం ఇది చావో రేవో అన్న పరిస్థితి. ఈరోజు ఓడితే జీటీ కచ్చితంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. సీఎస్కేపై హోం గ్రౌండ్‌లో గెలిచి ఊపుమీదున్న ఆ జట్టు అదే ఫామ్‌ను కొనసాగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరం. కేకేఆర్ ఈరోజు గెలిస్తే పాయింట్స్ టేబుల్‌లో కచ్చితంగా తొలి 2 స్థానాల్లో నిలుస్తుంది.