News May 11, 2024

మాల్దీవుల్లో భారత ఉపసంహరణ పూర్తి

image

మాల్దీవుల నుంచి భారత సైన్యం ఉపసంహరణ పూర్తైంది. చివరి బ్యాచ్ ఇటీవలే స్వదేశానికి వెళ్లిపోయిందని మాల్దీవుల అధ్యక్షుడి కార్యాలయ ప్రతినిధి ఓ వార్తాసంస్థకు తెలిపారు. మే 10కల్లా తమ దేశాన్ని వీడాలంటూ అధ్యక్షుడు ముయిజ్జు గతంలోనే భారత్‌కు అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. దానికి ఒకరోజు ముందుగానే భారత సైన్యం వీడినట్లు తెలుస్తోంది. 89మంది భారత సైనికులు విడతలవారీగా ఆ దేశాన్ని విడిచి స్వదేశానికి చేరారు.

News May 11, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News May 11, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: మే 11, శనివారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:28
సూర్యోదయం: ఉదయం గం.5:46
జొహర్: మధ్యాహ్నం గం.12:12
అసర్: సాయంత్రం గం.4:41
మఘ్రిబ్: రాత్రి గం.6:40
ఇష: రాత్రి గం.07.58
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News May 11, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News May 11, 2024

శుభ ముహూర్తం

image

తేది: మే 11, శనివారం
శు.చవితి: తెల్లవారుజామున 02:04 గంటలకు
మృగశిర: ఉదయం 10:15 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం.05:38 నుంచి 06:30 వరకు
ఉదయం 06:30 నుంచి 07:21 వరకు
వర్జ్యం: సాయంత్రం 06:43 నుంచి 08:20 వరకు

News May 11, 2024

TODAY HEADLINES

image

✒ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీం బెయిల్
✒ AP: మే 13 వరకు DBTలకు హైకోర్టు బ్రేక్
✒ ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: CM జగన్
✒ పల్నాడులో రక్తచరిత్ర సృష్టించారు: చంద్రబాబు
✒ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 4,44,216: CEO ముకేశ్
✒ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం: పవన్
✒ ఏపీలో మళ్లీ జగనే సీఎం: KCR
✒ KCRపై అనుచిత వ్యాఖ్యలు.. రేవంత్‌కు EC నోటీసులు
✒ తెలంగాణలో RRR ట్యాక్స్: మోదీ

News May 11, 2024

చెన్నైపై గుజరాత్ ఘన విజయం

image

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఘన విజయం సాధించింది. 35 పరుగుల తేడాతో చెన్నైను మట్టికరిపించింది. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లు ఆడి 196/8 పరుగులకే పరిమితమైంది. జట్టులో మిచెల్ (63), మొయిన్ అలీ (56) అర్థ సెంచరీలతో రాణించారు. చివర్లో ధోనీ (26) సిక్సర్లతో చెలరేగినా అప్పటికే సమయం మించిపోయింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3 వికెట్లు తీశారు. రషీద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు.

News May 10, 2024

నా బిడ్డ అమాయకురాలు: కేసీఆర్

image

మద్యం కుంభకోణంలో తన బిడ్డ కల్వకుంట్ల కవిత అమాయకురాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నిజానికి ఇది మోదీ ఆడుతున్న ఒక క్రూరమైన ఆట. లిక్కర్ స్కామ్ అనేది అసలు స్కామే కాదు. అదొక చెత్త వదంతి. లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం స్కామ్‌ను సృష్టించింది. అసలు ఇది మోదీ చేసిన రాజకీయ కుంభకోణం. కేజ్రీవాల్ కూడా ఈ స్కామ్‌లో అమాయకుడే’ అని పేర్కొన్నారు.

News May 10, 2024

మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

image

TG: రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లు/జూనియర్ కాలేజీలలో ఇంటర్ ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. టెన్త్‌లో వచ్చిన జీపీఏ ఆధారంగా ఫస్టియర్ సీట్లు కేటాయిస్తారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ ఇంగ్లిష్ మీడియం కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు.
వెబ్‌సైట్: <>www.tsmodelschools.com<<>>

News May 10, 2024

మానవాళిని మోసం చేసే స్కిల్స్ AI సొంతం

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భవిష్యత్తులో మానవాళికి ముప్పు ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో ఓ షాకింగ్ అధ్యయనం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే AI మనుషులను మోసం చేసే స్కిల్స్‌ను సాధించిందని తేలింది. ఆన్‌లైన్‌లో ‘prove you’re not a robot’ టెస్టును పరిష్కరించే నైపుణ్యాన్ని AI అభివృద్ధి చేసిందట. ఇలాంటి ఉదాహరణలు ప్రస్తుతం చిన్నవిగా కనిపించినా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని సైంటిస్టులు వెల్లడించారు.