News May 11, 2024

సంక్షేమ కార్యక్రమాలు రెండింతలు చేస్తా: చంద్రబాబు

image

AP: బాబాయ్‌పై గొడ్డలి వేటు వేసింది ఎవరో సీఎం జగన్‌కు తెలియదటని చంద్రబాబు ఎద్దేవా చేశారు. చిత్తూరులో మాట్లాడుతూ.. ‘రాజకీయ నాయకులకు నీతి, నిజాయితీ ఉండాలి. నేరాలు, హత్యా రాజకీయాలకు నేను దూరం. తప్పులు చేసినవారిని వదిలిపెట్టను. ఎన్నికల్లో మభ్యపెట్టేవారిని ఓడించాలి. మేం వచ్చాక సంక్షేమ కార్యక్రమాలు రెండింతలు చేస్తా. యువతకు ఉద్యోగాలు కల్పిస్తా. పేదలు, రైతులను ఆదుకుంటా’ అని హామీ ఇచ్చారు.

News May 11, 2024

ముగిసిన ప్రచార పర్వం.. మూగబోయిన మైకులు

image

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. 2 నెలలుగా ప్రచారంలో హోరెత్తించిన మైకులు, DJలు, నేతల గళాలు మూగబోయాయి. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాల్లో సా.4 గంటలకే బంద్ కాగా.. మిగతా చోట్ల ఈ సా.6 గంటలకు ప్రచారం ముగిసింది. ఇన్నాళ్లూ ఇంటింటికీ తిరిగి అభ్యర్థులు హామీల వర్షం కురిపించగా.. మే 13న జరిగే ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. జూన్ 4న ఓటర్ల నాడి ఏంటన్నది ఫలితాల్లో తేలనుంది.

News May 11, 2024

వైసీపీకి ఓటేస్తే గూండా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్లే: పవన్

image

AP: సమాజంలో మార్పు రావాలనే రాజకీయాల్లోకి వచ్చానని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. YCPకి ఓటేస్తే చేజేతులా గూండా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్లేనని తెలిపారు. కాకినాడలో ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన దేశం, ప్రాంతాన్ని రౌడీల చేతికి ఇవ్వడం ఇష్టం లేదన్నారు. ఎన్నో దెబ్బలు తిని పదేళ్లుగా ఇక్కడే నిలబడి ఉన్నానని తెలిపారు. పార్టీలు మారే వ్యక్తులు కాకుండా స్థిరంగా ఉండేవారు కావాలని చెప్పారు.

News May 11, 2024

బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై మరో కేసు

image

TG: సినీ నటి, బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై మరో కేసు నమోదైంది. ఈ నెల 8న ఎన్నికల ప్రచారంలో చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై యాకుత్ పురా పోలీస్ స్టేషన్లో 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు 15 సెకన్లు మౌనంగా ఉంటే ఒవైసీ బ్రదర్స్‌ని ఏం చేస్తామో చూపిస్తానని ఆమె వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. అంతకుముందు షాద్ నగర్‌ ప్రచార సభలోనూ నవనీత్ చేసిన వ్యాఖ్యలకు ఆమెపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

News May 11, 2024

రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించే కుట్ర: ప్రియాంక

image

TG: రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించే కుట్ర దేశంలో జరుగుతోందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. తాండూరు జనజాతర సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. దేశప్రజల సమస్యలు వినడానికి కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. BJP పాలిత రాష్ట్రాల్లో పేదలను ఆదుకునే పథకాలేవీ లేవని విమర్శించారు. సామాన్య జనంపై ట్యాక్స్ పెంచి.. కార్పొరేట్లపై తగ్గిస్తున్నారని ఆరోపించారు.

News May 11, 2024

మోదీ.. ఇందిరా నుంచి ఈ లక్షణాలను నేర్చుకో: ప్రియాంక

image

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి ధైర్యం, దృఢ సంకల్పం వంటి లక్షణాలను ప్రధాని మోదీ నేర్చుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సూచించారు. మహారాష్ట్ర నందుర్బార్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రధాని గారడీ మాటలు చెబుతున్నారని.. వాటిలో ఎటువంటి దమ్ము లేదని దుయ్యబట్టారు. కోటీశ్వరులకు రక్షకుడిగా మారి ప్రధాని ఆ పదవికి అన్యాయం చేశారన్నారు.

News May 11, 2024

జగన్ మాకెప్పుడూ మిత్రపక్షం కాదు: మోదీ

image

AP: YCP మళ్లీ అధికారంలోకి రాదని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిందని, ఆ పార్టీకి ప్రజలు మళ్లీ ఓట్లు వేస్తారని తాను అనుకోవడం లేదన్నారు. కొన్ని విషయాల్లో YCP MPలు తమకు మద్దతిచ్చారని, అయినా.. CM జగన్‌ను తామెప్పుడూ మిత్రపక్షంగా భావించలేదని మోదీ చెప్పుకొచ్చారు. తాము రాజకీయ ప్రత్యర్థులమేనని స్పష్టం చేశారు. ఒక ప్రధానిగా అన్ని రాష్ట్రాల్లాగే AP అభివృద్ధికి తాను కట్టుబడి ఉంటానన్నారు.

News May 11, 2024

తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్‌గా మార్చా: చంద్రబాబు

image

AP: అభ్యర్థుల ఎంపికలో టీడీపీ, జనసేన సామాజిక న్యాయం పాటించాయని చంద్రబాబు చెప్పారు. చిత్తూరు సభలో మాట్లాడుతూ.. ‘నాకు రాజకీయ జన్మ ఇచ్చిన జిల్లా ఇది. ఇక్కడి ప్రజలు 45 ఏళ్లుగా నన్ను ఆదరించి, ముందుకు నడిపించారు. చిత్తూరును అగ్రస్థానంలో పెట్టాలని జీవితాంతం పనిచేశా. తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్‌గా మార్చా. అపోలో నాలెడ్జ్ సిటీని తెచ్చా. IIT, ఐసర్ సంస్థలు ఏర్పాటు చేశా’ అని తెలిపారు.

News May 11, 2024

చంద్రబాబుకు ఓటు వేస్తే మోసపోవడం ఖాయం: సీఎం జగన్

image

AP: పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోవడం ఖాయమని సీఎం జగన్ చెప్పారు. TDP అధినేత గతంలో మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారన్నారు. పిఠాపురం సభలో మాట్లాడుతూ.. ‘మేం మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం. ఈ 59 నెలల కాలంలో వివిధ పథకాలకు 130 సార్లు బటన్ నొక్కా. అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా రూ.2.70 లక్షల కోట్లు జమ చేశా’ అని గుర్తు చేశారు.

News May 11, 2024

మంగళగిరి ప్రజలకు నారా లోకేశ్ లేఖ

image

AP: మంగళగిరిని దేశంలోనే నం.1గా తీర్చిదిద్ది.. పేదరికం లేకుండా చేస్తానంటూ నారా లోకేశ్ ఆ నియోజకవర్గ ప్రజలకు లేఖ రాశారు. ‘2019లో స్వల్ప తేడాతోనే ఓడినా.. ఆ తర్వాతి రోజు నుంచే ఇక్కడి ప్రజలతో మమేకం అయ్యాను. ఐదేళ్లుగా ప్రజల కష్టసుఖాల్లో భాగమయ్యా. పాదయాత్రతో ఏడాది నియోజకవర్గానికి దూరంగా ఉన్నా నా మనసంతా మంగళగిరిలోనే ఉండేది. ఈ ఎన్నికల్లో మీ ఇంటిబిడ్డలా ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపండి’ అని కోరారు.