News May 2, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News May 2, 2024

శుభ ముహూర్తం

image

తేది: మే 2, గురువారం
బ.నవమి: అర్ధరాత్రి 01:53 గంటలకు
ధనిష్ఠ: అర్ధరాత్రి 01:48 గంటలకు
దుర్ముహూర్తం:1.ఉదయం 09:58 నుంచి 10:48 గంటల వరకు
2.మధ్యాహ్నం 03:00 నుంచి 03:51 గంటల వరకు
వర్జ్యం: ఉదయం 06:57 నుంచి 08:27 గంటల వరకు

News May 2, 2024

టుడే హెడ్‌లైన్స్

image

* తెలంగాణలో పోలింగ్ సమయం సా.6వరకు పెంపు
* కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
* TG, AP, కర్ణాటకకు కేంద్రం ఏమీ చేయలేదు: రేవంత్
* ముస్లింలకు 50 ఏళ్లకే పింఛన్: చంద్రబాబు
* బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే: జగన్
* ఢిల్లీలో వంద స్కూళ్లకు బాంబు బెదిరింపులు
* రిజర్వేషన్లను రద్దు చేయం: అమిత్ షా
* IPL: చెన్నైపై పంజాబ్ విజయం

News May 2, 2024

అవేవీ ఈసీకి కనిపించవు, వినిపించవు: హరీశ్

image

TG: ప్రధాని మోదీ మత విద్వేషాలు రెచ్చగొడితే ఈసీకి కనిపించదని, సీఎం రేవంత్ బూతులు మాట్లాడితే వినిపించదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేసీఆర్ ప్రశ్నిస్తే మాత్రం ఆపుతున్నారని మండిపడ్డారు. ఆయన బస్సు యాత్ర చూసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు భయపడుతున్నారని అన్నారు. నిషేధం విధించినా ప్రజల గుండెల నుంచి కేసీఆర్‌ను వేరు చేయలేరని హరీశ్ స్పష్టం చేశారు.

News May 1, 2024

IPL: చెన్నైపై పంజాబ్ ఈజీ విక్టరీ

image

చెన్నైతో జరిగిన మ్యాచులో పంజాబ్ అలవోకగా విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన PBKS 13 బంతులు మిగిలి ఉండగానే జయకేతనం ఎగురవేసింది. పంజాబ్ బ్యాటర్లలో బెయిర్ స్టో(46), రోస్సో(43) రాణించారు. సామ్ కరన్(26*), శశాంక్(25*) జట్టును విజయతీరాలకు చేర్చారు. చెన్నై బౌలర్లలో శార్దూల్, రిచర్డ్, దూబే తలో వికెట్ తీశారు.

News May 1, 2024

క్యాన్సర్‌తో పోరాటం.. బతుకుతానని అనుకోలేదు: మనీషా

image

బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా గతంలో క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో క్యాన్సర్‌తో తాను పోరాడిన సమయంలో అనుభవించిన బాధను పంచుకున్నారు. ‘అండాశయ క్యాన్సర్ నాలుగో దశకు చేరడంతో జీవితంపై ఆశలు కోల్పోయా. ఎంతకాలం బతుకుతానో అనుకుంటూ కాలం గడిపాను. అదృష్టవశాత్తూ క్యాన్సర్‌ను జయించా. హీరామండీతో ప్రేక్షకుల ముందుకు రావడం ద్వారా నటిగా రెండో జీవితాన్ని పొందా’ అని చెప్పారు.

News May 1, 2024

IPL-2024: కోహ్లీని దాటేసిన గైక్వాడ్

image

ఐపీఎల్-2024లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రుతురాజ్ గైక్వాడ్(509) కొనసాగుతున్నారు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచులో 62 రన్స్‌తో రాణించి ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉన్న కోహ్లీని (500) అధిగమించారు. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో వరుసగా సాయి సుదర్శన్ 418, కేఎల్ రాహుల్ 406, పంత్ 398, సాల్ట్ 392, శాంసన్ 385, నరైన్ 372 ఉన్నారు.

News May 1, 2024

బీజేపీకి ఓటేయడం మేలన్న కాంగ్రెస్ నేత!

image

ఇండియా కూటమిలో భాగస్వామ్యులైన కాంగ్రెస్, టీఎంసీ.. ప.బెంగాల్‌లో మాత్రం ప్రత్యర్థులై విమర్శలకు దిగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఆజ్యం పోశాయి. TMCకి ఓటేయడం కంటే BJPకి వేయడం మేలని ఆయన అన్నారు. దీంతో బీజేపీకి కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలు బీటీమ్‌గా పని చేస్తున్నారని టీఎంసీ దుయ్యబట్టింది. ఈ వ్యవహారాన్ని చల్లబర్చేందుకు TMC తమ మిత్రపక్షమంటూ కాంగ్రెస్ సర్దిచెప్పుకుంటోంది.

News May 1, 2024

BREAKING: వారికి 50 ఏళ్లకే పింఛన్: చంద్రబాబు

image

AP: గుంటూరు ప్రజాగళం సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ముస్లింలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ప్రకటించారు. హజ్ యాత్రకు వెళ్లేవారికి రూ.లక్ష, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రూ.5లక్షలు వడ్డీలేని రుణాలు అందజేస్తామని స్పష్టం చేశారు. నూర్ బాషాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.100 కోట్ల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కొనసాగేలా కృషి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

News May 1, 2024

21 జిల్లాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

image

ఏపీవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవాళ అత్యధికంగా పల్నాడు(D) కొప్పునూరులో 46.2 డిగ్రీలు, తిరుపతి(D) మంగనెల్లూరులో46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 21 జిల్లాల్లో 43డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. రేపు 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 234 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆయా ప్రాంతాల వివరాల కోసం ఈ <>లింక్‌‌<<>>పై క్లిక్ చేయండి.