India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ముంబైతో జరిగిన మ్యాచులో లక్నో విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్యాన్ని 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. లక్నో బ్యాటర్లలో స్టొయినిస్(62), రాహుల్(28) రాణించారు. ముంబై బౌలర్లలో హార్దిక్ 2, నబి, తుషార, కోయెట్జీ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో లక్నో మూడో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు ముంబై ప్లేఆఫ్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి.

AP: నామినేషన్ల ఉపసంహరణ తర్వాత రాష్ట్ర ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను EC అధికారికంగా విడుదల చేసింది. 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది పోటీ చేస్తున్నట్లు తెలిపింది. తిరుపతి ఎమ్మెల్యే సీటుకు అత్యధికంగా 46 మంది, అత్యల్పంగా చోడవరంలో ఆరుగురు పోటీలో ఉన్నారు. విశాఖ ఎంపీ సీటుకు అత్యధికంగా 33 మంది, రాజమండ్రి పార్లమెంట్‌కు అత్యల్పంగా 12 మంది బరిలో నిలిచారు.

UPలోని అమేథీ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ పోటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే BJP అభ్యర్థి స్మృతి ఇరానీ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో INC అభ్యర్థిని త్వరగా తేల్చాలంటూ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. రాహుల్ గాంధీ లేదా ప్రియాంకా గాంధీ బరిలో నిలవాలంటూ నినాదాలు చేశారు. గత ఎన్నికల్లో ఓడిన రాహుల్.. ఈసారి గెలిచి గౌరవాన్ని పొందాలని కోరారు. కాగా ఇక్కడ మే 20న పోలింగ్ జరగనుంది.

AP: వాలంటీర్లపై EC ఆంక్షల నేపథ్యంలో తొలిసారి రేపు లబ్ధిదారుల అకౌంట్లలో ప్రభుత్వం పెన్షన్ డబ్బులు జమ చేయనుంది. రాష్ట్రంలో 65.49 లక్షల మంది పెన్షన్‌దారులు ఉండగా, దాదాపు 49 లక్షల మంది ఖాతాల్లోకి ఉ.8.30-11 గంటల మధ్య DBT ద్వారా నగదు పంపనుంది. బ్యాంక్ అకౌంట్, ఆధార్ లింక్ కాని మిగతా వారికి మే 3 వరకు ఇంటి వద్దే ఉద్యోగులు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

యూపీలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థి చిక్కుల్లో పడ్డారు. స్విమ్మింగ్ పూల్‌లో ఓ యువతితో ఆయన కలిసి ఉన్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయనను టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై స్పందించిన అక్షయ్.. అవి తన కాలేజీ రోజుల్లోని ఫొటోలని తెలిపారు. పాత ఫొటోలను ఇప్పుడు తెరపైకి తెచ్చి తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. ఈయన బదౌన్ స్థానం నుంచి బరిలో నిలిచారు.

1996 మేలో జరిగిన ఎన్నికల్లో BJP అతిపెద్ద పార్టీగా అవతరించగా.. వాజ్‌పేయి PMగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే లోక్‌సభలో బలం నిరూపించుకోలేక 13 రోజుల్లో GOVT పడిపోయింది. రెండేళ్లు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 1998 ఎన్నికల్లో BJP నేతృత్వంలో NDA సర్కార్ ఏర్పాటైంది. అయితే BSP, AIADMK మద్దతు ఉపసంహరించుకోవడంతో 13 నెలలకే ప్రభుత్వం కుప్పకూలింది. 1999 ఎన్నికల్లో NDA సంపూర్ణ మెజార్టీ సాధించింది.

కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నవోదయ విద్యాలయ సమితిలో నాన్ టీచింగ్ విభాగంలోని ఉద్యోగాలకు దరఖాస్తు గడువును పొడిగించారు. నేటితో గడువు ముగియగా మే 7వ తేదీ వరకు పొడిగించారు. పలు విభాగాల్లో మొత్తం 1377 పోస్టుల ఖాళీలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. వయో పరిమితి, పోస్టులు, ఇతర వివరాల కోసం https://nvs.ntaonline.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

ఈ IPL సీజన్‌లో MI కెప్టెన్ హార్దిక్ పాండ్య వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇవాళ LSGతో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగారు. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లలో 197 రన్స్ చేసి, 4 వికెట్లు మాత్రమే తీశారు. ఫామ్‌లో లేని పాండ్యను T20WCకి ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. IPLలో అదరగొడుతోన్న అభిషేక్, పరాగ్, రుతురాజ్, తిలక్, నటరాజ్, శశాంక్‌కు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు?

AP: సీఎం జగన్ రేపు మూడు చోట్ల మేమంతా సిద్ధం బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఉదయం 10గంటలకు బొబ్బిలిలో, ఆ తర్వాత పాయకరావుపేట, ఏలూరు సభల్లో ప్రసంగిస్తారు. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో వారాహి సభలో పాల్గొంటారు.

LSGతో మ్యాచ్‌లో MI బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. 20 ఓవర్లలో 144/7 స్కోరు మాత్రమే చేయగలిగారు. నెహాల్ వధేరా 46, ఇషాన్ కిషన్ 32, టిమ్ డేవిడ్ 35 రాణించగా, రోహిత్ 4, సూర్య 10, తిలక్ 7, హార్దిక్ 0 స్వల్ప స్కోర్లకే వెనుతిరిగారు. మోసిన్ ఖాన్ 2, స్టొయినిస్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.
Sorry, no posts matched your criteria.