India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత్‌లో ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈసారి ఎన్నికల వ్యయం ₹1.35లక్షల కోట్లకు చేరుకుంటుందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఈ సంస్థ గత 35 ఏళ్లుగా ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తూ వస్తోంది. 2019 ఎన్నికల వ్యయం ₹60వేల కోట్లు కాగా, ప్రస్తుత ఎలక్షన్స్ కి అంతకు రెట్టింపు ఖర్చవుతోందని చెబుతోంది.

SRH ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ సీజన్లో అదరగొడుతున్నారు. 8 మ్యాచుల్లో 288 రన్స్ చేశారు. దూకుడుగా ఆడుతూ జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తున్నారు. టీ20ల్లో ఇలాంటి తరహా ఆట ఎంతో ముఖ్యమని, వరల్డ్ కప్ జట్టులో ఇతడికి చోటు కల్పించాలని పలువురు కోరుతున్నారు. అభిషేక్ శర్మ హిట్టింగ్ కెపాసిటీ బాగుందని, స్ట్రైక్ రేటు అద్భుతంగా ఉందని చెబుతున్నారు.

TG: న్యాక్ గుర్తింపు ఆధారంగా రాష్ట్రంలోని 3 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు UGC అటానమస్ హోదా ఇచ్చింది. వాటిలో బోధన్, ఖైరతాబాద్, కరీంనగర్(ఉమెన్స్) కాలేజీలున్నాయి. కోదాడ డిగ్రీ కాలేజీకి కూడా అటానమస్ హోదా దక్కాల్సి ఉండగా, చిన్న కారణంతో నిలిపేసినట్లు సమాచారం. కాగా 2022, 2023లో 14 కాలేజీలకు అటానమస్ హోదాను UGC కల్పించింది.

భారత సరిహద్దు ప్రాంతంలో చైనా అక్రమంగా రోడ్డు నిర్మిస్తున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది. సియాచిన్ గ్లేసియర్‌కు అత్యంత సమీపంలో చైనా తన హైవే జీ219ను నిర్మిస్తున్నట్లు తేలింది. సియాచిన్‌కు ఉత్తరాన పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మౌళిక సదుపాయాల అభివృద్ధికి చైనా ఈ రోడ్డు నిర్మించినట్లు తెలుస్తోంది. ఇది చట్ట విరుద్ధమని భారత ఆర్మీ మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రాకేశ్ శర్మ అన్నారు.

రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. జనరల్ టికెట్ కోసం తీసుకొచ్చిన UTS (అన్-రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్) యాప్‌లో మార్పులు చేసింది. ఎంత దూరం నుంచైనా ఫోన్ లోనే జనరల్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. గతంలో రైల్వేస్టేషన్‌కు 2, 3 కి.మీల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉండేది. అయితే స్టేషన్‌కు 50 మీటర్లలోపు ఈ యాప్ పని చేయదు. ఈ యాప్ వల్ల కౌంటర్ల వద్ద వెయిట్ చేయడం తప్పుతుంది.

ఐపీఎల్-2024లో భాగంగా ఇవాళ KKR, PBKS జట్లు తలపడనున్నాయి. కోల్‌కతా వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 సార్లు తలపడగా KKR 21, PBKS 11 మ్యాచుల్లో విజయం సాధించాయి. నేటి మ్యాచ్ కోసం కోల్‌కతా టీమ్‌లో స్టార్క్ స్థానంలో చమీర ఆడే అవకాశాలున్నాయి. మరోవైపు పంజాబ్ కెప్టెన్ ధవన్ తిరిగి తుది జట్టులోకి వచ్చే ఛాన్సుంది.

AP: సీబీఐ మాజీ జేడీ వీవీ.లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్ పార్టీ’ తరఫున విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం తన కుటుంబ ఉమ్మడి ఆస్తి రూ.11.81 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు. 2019లో ఆయన ఆస్తులు రూ.8.6 కోట్లుగా ఉండగా, ఐదేళ్లలో రూ.3.21 కోట్లు పెరిగాయి.

TG: రాష్ట్రాన్ని అకాల వర్షాలు వీడటం లేదు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో వానలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు మరో 5 రోజులపాటు పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. వానలు కురిసే, వడగాల్పులు వీచే జిల్లాల వివరాలను పైన ఫొటోల్లో చూసి తెలుసుకోవచ్చు.

TG: న్యాయ కళాశాలల్లో LLB, LLM కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీ ఎల్‌సెట్ పరీక్షలకు దరఖాస్తు గడువును అధికారులు మరోసారి పొడిగించారు. నిన్నటితో గడువు ముగియగా, ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వచ్చే నెల 4 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. మూడు, ఐదేళ్ల LLB కోర్సులు, రెండేళ్ల LLM కోర్సుల్లో చేరేందుకు జూన్ 3న పరీక్ష జరగనుంది.

TG: వరంగల్ మేయర్, మాజీ ఎంపీ గుండు సుధారాణి BRSను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు టీడీపీలో ఉన్న సుధారాణి 2002 నుంచి 2004 వరకు టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. 2010లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మరోవైపు వరంగల్ జిల్లాకు చెందిన BRS ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సైతం హస్తం పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.