India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టొరంటోలో జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌ను <<13099220>>గెలిచిన<<>> అతి పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించిన గుకేశ్ దొమ్మరాజు ఇండియాకు చేరుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘ధోనీ, జొకోవిచ్ తీవ్ర ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటారు. అందుకే వాళ్లు ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటారు. అవసరమైనప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేస్తారు. ఈ లక్షణాలున్నందునే వారి పట్ల ఆకర్షితుడిని అయ్యాను. వారే నాకు స్ఫూర్తి’ అని తెలిపారు.

TG: సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలిచిన పార్టీనే కేంద్రంలో అధికారం చేపడుతుందనే సెంటిమెంట్ ఉంది. 1998 నుంచి ఇలాగే జరుగుతోంది. ఈసారి ఇక్కడ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి(BJP), దానం నాగేందర్(INC), పద్మారావు గౌడ్(BRS) పోటీ పడుతున్నారు. ముగ్గురూ బలమైన నేతలే కావడంతో పోరు రసవత్తరంగా ఉండనుంది. ఇక్కడ 12 సార్లు కాంగ్రెస్, 5సార్లు బీజేపీ, ఓసారి తెలంగాణ ప్రజా సమితి పార్టీ గెలిచింది.
<<-se>>#ELECTIONS2024<<>>

✒ RCB తరఫున ఎక్కువ మ్యాచ్‌లు- 246
✒ ఎక్కువ పరుగులు- 7,642
✒ మోస్ట్ ఫోర్లు- 679, సిక్సులు- 250
✒ సెంచరీలు- 8, హాఫ్ సెంచరీలు- 60
✒ మోస్ట్ క్యాచ్‌లు- 112
✒ కెప్టెన్‌గా ఎక్కువ విజయాలు- 66
✒ మోస్ట్ సెంచరీ భాగస్వామ్యాలు- ABD/కోహ్లీ 10
✒ జట్టులో ఎక్కువసార్లు టాప్ స్కోర్లు- 58

☛ The medieval forerunner of chemistry::- Alchemy
☛ A person who presents a radio/television programme::- Anchor
☛ One who studies the evolution of mankind::- Anthropologist
☛ The scientific study of the physiology, structure, genetics, ecology, distribution, classification and economic importance of plants::- Botany

అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ మై గాడ్ 2’. ఈ సినిమా తెలుగు వెర్షన్ OTTలోకి వచ్చేసింది. హిందీలో గత ఏడాదే అందుబాటులోకి వచ్చినా తెలుగులో మాత్రం తాజాగా రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. గత ఏడాది రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.220 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో శివుడి పాత్రలో అక్షయ్ కనిపించడం గమనార్హం.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలై 7 నెలలు దాటినా శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించట్లేదు. ఈ క్రమంలో హమాస్ ప్రతినిధి ఖలీల్ అల్ హయ్యా కీలక ప్రతిపాదన చేశారు. 1967కు ముందునాటి సరిహద్దులతో స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వదిలేస్తామని చెప్పారు. ఇజ్రాయెల్‌తో ఐదేళ్ల పైన సంధికి సిద్ధంగా ఉన్నామన్నారు. యుద్ధం ముగింపుపై హామీ ఇవ్వకపోతే బందీలను విడుదల చేయబోమని స్పష్టం చేశారు.

నీళ్ల మీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు
బైట మూరెడైనబాఱలేదు
నెలవు తప్పుచోట నేర్పరి కొరగాడు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: పడవ నీటిలో చక్కగా వెళ్తుంది. భూమి మీద ముందుకు వెళ్లలేదు. బుద్ధిమంతుడు మంచి స్థానంలో లేకపోతే అతని తెలివి ఉపయోగకరంగా ఉండదు.

గాయం కారణంగా టోర్నీకి దూరమైన మిచెల్ మార్ష్ స్థానాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. అతడి స్థానంలో అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ గుల్బదిన్ నాయబ్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ మేరకు డీసీ ఫ్రాంచైజీ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. కాగా అఫ్గాన్ తరఫున నాయబ్ 64 టీ20 ఆడారు. 127 స్ట్రైక్‌రేట్‌తో 802 రన్స్ బాదారు. అలాగే 26 వికెట్లు పడగొట్టారు.

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాపారవేత్తలతో భేటీలో మాట్లాడుతూ.. ‘బంగ్లాదేశ్‌ను ఒకప్పుడు భారంగా భావించాం. కానీ అక్కడ ఇప్పుడు పారిశ్రామిక వృద్ధి అద్భుతంగా ఉంది. వాళ్లను చూసి సిగ్గుపడుతున్నాం’ అని పేర్కొన్నారు. పాక్‌లో ఆర్థిక వృద్ధి కోసం భారత్‌తో వాణిజ్య చర్చలు జరపాలని వ్యాపారవేత్తలు పాక్ ప్రధానిని కోరారు.

1762: కర్ణాటక సంగీత విద్వాంసుడు శ్యామశాస్త్రి జననం
1920: భారతీయ గణితవేత్త శ్రీనివాస రామానుజన్ మరణం
1973: తమిళ నటుడు సముద్ర ఖని జననం
1986: చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రంలో ప్రమాదం
ఇవాళ ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం
నేడు సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం
Sorry, no posts matched your criteria.