India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

2016లో జరిగిన టీచర్ రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన <<13101174>>తీర్పు<<>>ను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. దాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా అభివర్ణించారు. ఈ తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వారికి మద్దతుగా తాము ఉంటామని చెప్పారు. వారందరికీ న్యాయం జరిగేలా చూస్తామని, హైకోర్టు తీర్పుపై తాము పైకోర్టుకు వెళతామని అన్నారు.

IPLలో మరో ఆసక్తికరమైన మ్యాచ్ కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. పాయింట్స్ టేబుల్‌లో టాపర్‌గా ఉన్న రాజస్థాన్ రాయల్స్‌ను 7వ స్థానంలోని ముంబై ఇండియన్స్ ఢీకొననుంది. జైపుర్ వేదికగా మ్యాచ్ జరగనుంది. హెడ్ టు హెడ్ రికార్డులు చూస్తే MI 15 గెలవగా.. RR 13 మ్యాచుల్లో గెలిచింది. ఇక ఈరోజు మ్యాచ్ జరుగుతున్న జైపుర్‌లో MIతో జరిగిన 7 మ్యాచుల్లో RR 5 గెలిచింది. దీంతో ముంబైకి నేడు కఠిన పరీక్ష ఎదురుకానుంది.

జేఈఈ మెయిన్ 2024(సెషన్-2) పరీక్షల ఫైనల్ అన్సర్ ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జరిగిన జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షకు దేశవ్యాప్తంగా 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన స్కోరును పరిగణనలోకి తీసుకొని మెరిట్ లిస్టును విడుదల చేయనుంది. కీని చూసుకునేందుకు ఇక్కడ <

AP: పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ జగన్ తరఫున ఆయన బంధువు వైఎస్ మనోహర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఆర్‌వోకు అందజేశారు. ఈ నెల 25న సీఎం జగన్ మరో సెట్ నామినేషన్ వేయనున్నారు. మరోవైపు టెక్కలి అభ్యర్థిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నామపత్రాలు సమర్పించారు. ఉండి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు నామినేషన్ దాఖలు చేశారు.

ఈవారం రెండు తెలుగు సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను అలరించనున్నాయి. సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ నటించిన ‘టిల్లు స్క్వేర్’ ఏప్రిల్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే గోపీచంద్ నటించిన ‘భీమా’ ఏప్రిల్ 25న నుంచి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. ఇక 26న క్రాక్(హిందీ), థాంక్యూ, గుడ్‌నైట్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.

AP: కూటమి పార్టీల్లో తన వాళ్లకే చంద్రబాబు టికెట్లు కేటాయిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పిఠాపురంలో పవన్‌ను తప్పించి SVSN వర్మను బరిలోకి దింపుతారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. చివరికి జనసేనకు 10 టికెట్లే పరిమితం చేస్తారన్నారు. చంద్రబాబు కోసమే విపక్ష కూటమి ఏర్పడిందన్నారు. CBN రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని.. గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు.

TG: మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనని ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘డిసెంబర్ 9న ఒక దొంగను ఓడగొట్టాం. లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ఓడగొట్టాలి. ఆదిలాబాద్‌లో సీసీఐ సిమెంట్ పరిశ్రమను మోదీ, కేడీ కలిసి మూసేశారు. త్వరలోనే దాన్ని తిరిగి తెరిపిస్తాం. ఉచిత కరెంట్‌తో పేదల ఇళ్లు వెలుగుతుంటే మోదీ, కేసీఆర్ కడుపు మండుతోంది’ అని రేవంత్ విమర్శించారు.

బాలిక గర్భం దాల్చిన కేసులో సుప్రీంకోర్టు అసాధారణ తీర్పు చెప్పింది. 30 వారాల గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతిచ్చింది. మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై గర్భం దాల్చింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న తల్లి బాలిక గర్భ విచ్ఛిత్తి కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ నిరాశ ఎదురవడంతో సుప్రీంకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన CJI జస్టిస్ చంద్రచూడ్ గర్భవిచ్ఛిత్తికి అనుమతించారు.

నెట్టింట సర్క్యులేట్ అవుతున్న తన డీప్ ఫేక్ వీడియోపై బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై సైబర్ క్రైమ్ సెల్‌ను ఆయన ఆశ్రయించారు. రణ్‌వీర్ ఇటీవల వారణాసిలో పర్యటించారు. ఓ రాజకీయ పార్టీకి మద్దతునిస్తున్నట్లుగా ఏఐ సాయంతో ఆయన గొంతును మార్చిన దుండగులు, వీడియోకు ఆ ఆడియో జత చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల్ని ఆశ్రయించినట్లు రణ్‌వీర్ తరఫు ప్రతినిధులు తెలిపారు.

కర్ణాటకలోని మాండ్య నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకటరమణ గౌడ రూ.622 కోట్ల ఆస్తులతో రెండో దశ ఎన్నికల్లో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. తర్వాతి స్థానాల్లో బెంగళూరు రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేశ్ రూ.593 కోట్లు, యూపీలోని మథుర నుంచి బీజేపీ అభ్యర్థి హేమమాలిని రూ.278 కోట్లతో ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. రెండో దశ పోలింగ్ ఈ నెల 26న జరగనుంది. ఎన్నికల్లో 1,210 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.